వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై మోదీకి ఫిర్యాదు - 18 నెలల కుదుపు - 2021లెక్కలే కీలకం - బీమా మెలిక చూశారా?: ఎంపీ రఘురామ

|
Google Oneindia TeluguNews

సొంత పార్టీపై, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి తెరలేపారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న 2021 జనాభా లెక్కలకు సంబంధించి అసాధారణ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో గత 18 నెలలుగా నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలోనే నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరే తానీ ప్రతిపాదన చేశానని, జగన్ తీరువల్లే ఇది కోరాల్సి వచ్చిందని రఘురామ తెలిపారు. రోజువారీ 'రాజధాని రచ్చబడ్డ' కార్యక్రమంలో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక అంశాలపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

జగన్ దెబ్బ.. రఘురామరాజు అబ్బా - జస్టిస్ రమణపై ఇవి చూశారా? 777 రెడ్లకు పదవులు: వైసీపీ ఎంపీజగన్ దెబ్బ.. రఘురామరాజు అబ్బా - జస్టిస్ రమణపై ఇవి చూశారా? 777 రెడ్లకు పదవులు: వైసీపీ ఎంపీ

జగన్ సర్టిఫికేట్స్‌లో అదే

జగన్ సర్టిఫికేట్స్‌లో అదే

‘‘తిరుమల డిక్లరేషన్ వివాదంపై ఎవరో కోర్టుకు వెళితే.. నిన్న ఒక తీర్పు వచ్చింది. జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ, అందుకు ఆధారాలేంటి? అని కోర్టు వారు అడిగారు. వ్యక్తిగతంగా నాకు కొన్ని విషయాలు తెలుసు. జగన్ చదువులు, ఇతర సర్టిఫికేట్లలో తాను క్రిస్టియన్ అనే ఉంటుంది. పులివెందులలో క్రైస్తవ సంప్రదాయంలోనే భారతిని పెళ్లి చేసుకున్నారు. సీఎంగా జగన్ మొదటి సంతకం చేసినప్పుడు పక్కన బైబిల్ మాత్రమే పెట్టుకున్నారు. బైబిల్ లేకుండా విజయమ్మగారిని అరుదుగా చూస్తాం. దీనిపై కోర్టు తదుపరి ఏం స్పందిస్తుందో చూడాలి. అయితే పరిపాలనలో జగన్ తన మతానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. దేవాలయాలపై దాడులు కాకుండానే, ఇది గడిచిన 18 నెలలుగా ఏపీలో హిందువుల మనోభావాలు తీవ్రంగా కుదిపేస్తోంది.

పాస్టర్లు రావొద్దంటే అరెస్టులా?

పాస్టర్లు రావొద్దంటే అరెస్టులా?

రాజ్యాంగ విరుద్ధంగా క్రైస్తవ మత వ్యాప్తికి సీఎం, యంత్రాంగం ప్రభుత్వపరంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నికల హామీ కాబట్టే పాస్టర్లకు భృతి ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ అది క్రైస్తవ మత వ్యాప్తికి ప్రభుత్వ సొమ్ములను అందించినట్లవుతుంది. చర్చిల నిర్మాణానికి కూడా డబ్బులిచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ‘మేమంతా హింందువులం.. పాస్టర్లు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు' అని కొన్ని గ్రామాల్లో బోర్డులు పెడితే, వాళ్లను అరెస్టులు చేస్తున్నట్లు జర్నలిస్టు చెబుతున్నారు. పరమత సహనం ఉండాలి కానీ ప్రభుత్వం ఒక మతానికి మద్దతిచ్చేలా వ్యవహరించడం వైసీపీ భవిష్యత్తుకు మంచిదికాదు. ఈ విషయమై హిందూ సంఘాలు కోర్టుకు వెళ్లాలని నేను కోరుతున్నాను. దానికి అయ్యే ఖర్చును సనాతన స్వదేశీ సేన భరిస్తుందని హామీ ఇస్తున్నాను. దీనిపైనే..

ప్రధాని మోదీకి లేఖ

ప్రధాని మోదీకి లేఖ

ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశాను. రాష్ట్రంలో 1.8 శాతంగా ఉన్న క్రైస్తవ జనాభాకు 30 వేల చర్చిలు ఎలా వచ్చాయి? లెక్కల ప్రకారం 88 శాతంగా ఉన్న హిందువులకు 33వేల ఆలయాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి? ఈ లెక్కలు ఎక్కడ తప్పాయో తేలాలంటే 2021 జనాభా లెక్కలే కీలకం అవుతాయి. అందుచేత ఏపీలో 2021 జనాభా లెక్కల్లో మత అంశాలను కచ్చితంగా తేల్చాలని ప్రధానిని కోరాను. అదే సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా చర్చిలకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడాన్ని కూడా పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరాను. మరో ముఖ్యమైన అంశం..

సీఎం రేసులో చిత్తూరు వైసీపీ నేత - జగన్‌పై 2లక్షల మెజార్టీ ఇలా - వాలంటీర్ల దుస్థితి:ఎంపీ రఘురామసీఎం రేసులో చిత్తూరు వైసీపీ నేత - జగన్‌పై 2లక్షల మెజార్టీ ఇలా - వాలంటీర్ల దుస్థితి:ఎంపీ రఘురామ

Recommended Video

YSRCP MP Raghurama Krishnam Raju met JP Nadda రఘురామరాజు ను లోక్ సభలో వెనక సీటుకు పంపేసిన YCP
వైఎస్సార్ బీమా పథకానికి ఎందుకిలా?

వైఎస్సార్ బీమా పథకానికి ఎందుకిలా?

తాజాగా తలపెట్టిన వైఎస్సార్ బీమా పథకంలో ప్రతిపాలసీకి పీఎంజేజేబీవై కింద కేంద్రం ఇచ్చే 50 శాతం వాటా రావడంలేదని, మానవతా దృక్పథంతో ప్రతిపైసా ఏపీ ప్రభుత్వమే భరిస్తున్నదని మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. రైతు బీమాలో కేంద్రం వాటా లేదని ఇంత కచ్చితంగా చెబుతున్నప్పుడు.. మరి కేంద్రం వాటా ఉన్న పథకాలకు ప్రధాని మోదీ ఫొటోను ఎందుకు పెట్టడంలేదు అన్నది ఇక్కడ ముఖ్యాంశం. ఎందుకంటే అసలే ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. రేపు కేంద్ర సాయం అడగాలన్నా ఇలాంటి పథకాల ప్రకటనల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. గతంలో చంద్రన్న బీమా పథకానికి.. ప్రధాని పేరును కూడా జోడించారు. ఏపీకి కేంద్రం నుంచి బీమా చెల్లింపులపై నేను పార్లమెంటులో ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ నా శ్రమ ఫలించి కేంద్రం వాటా విడుదలైతే, అప్పుడు మా వైసీపీ వాళ్లు ఈ ప్రకటనను వాపస్ తీసుకుంటారా? దీనిపై వేరే పార్టీవాళ్లు ఎందుకు మాట్లాడరో నాకు తెలీదు. ప్రజల అంశం కాబట్టే నేను మాట్లాడుతున్నా'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju alleges that andhra pradesh cm ys jagan is in favour of one particular religion, which is anti constitutional. speaking to media on wednesday, the rebel told that he had complaint with prime minister narendra modi on ap cm jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X