• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో సాయిరెడ్డి వియ్యంకుడి వ్యాక్సిన్? -రజనీలా దమ్ముందా? -జగన్ గుక్కపెట్టి ఏడ్చేలా: ఎంపీ రఘురామ

|

అనర్హత పిటిషన్ వ్యవహారం ఎంతకూ తేలకపోవడంతో సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్‌పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలు, ఆరోపణల పరంపరను కొనసాగిస్తున్నారు. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకుని, కోలుకుంటోన్న ఆయన.. 'మినీ రచ్చబండ' పేరుతో మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఏపీలో స్థానిక ఎన్నికలు, కరోనా వ్యక్సిన్ పంపిణీ తదితర అంశాలపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

మేం లేన‌ప్పుడు ఏ కొ..గాడైనా వస్తాడు -పెద్దారెడ్డి ఎంత మగాడో మాకు తెలుసు: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

 నిమ్మగడ్డవైపే న్యాయం..

నిమ్మగడ్డవైపే న్యాయం..

‘‘ఎలాగైనాసరే స్థానిక ఎన్నికలను తప్పించుకోవాలని చూసిన వైసీపీ సర్కారుకు, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య కొనసాగిన వివాదంతో ఏపీ హైకోర్టు ఎట్టకేలకు సముచిత తీర్పు చెప్పింది. ఏపీలో ప్రజాస్వామ్య బద్ధంగా స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయమై, ప్రన్సిపల్ సెక్రటరీ స్థాయికి తగ్గకుండా ముగ్గురు అధికారుల్ని ఎస్ఈసీ వద్దకు పంపి, పోల్ ఏర్పాట్లపై మాట్లాడాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఆర్డర్ ఈనెల 29న రానుంది.

60 శాతం రక్తం వాలంటీర్లదే..

60 శాతం రక్తం వాలంటీర్లదే..

ఎప్పుడో మూడేళ్ల కిందటి జగన్ పాదయాత్ర వార్షికోత్సవాన్ని ఊరూరా వేల మందితో చేసినప్పుడు అడ్డురాని కరోనా ఎన్నికలకే అడ్డొస్తుందని చెప్పడం హాస్యాస్పదం. ఇక జగన్ పుట్టినరోజును శ్రీవారి ఉత్సవాల్లా జరిపారు. వైసీపీ నేతలకు టార్గెట్లు ఇచ్చి, ప్రతిరోజూ ఫొటోలు పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. జనం నుంచి బలవంతంగా రక్తం లాగారు. నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనైతే.. 60 శాతం రక్తాన్ని విలేజ్ వాలంటీర్ల నుంచే లాగేశారు. ఉద్యోగం పోతుందనే భయంతో వాళ్లంతా దిక్కులేక నెత్తురు సమర్పించుకున్నారు. ఏపీలో సర్వత్రా జగన్నామ స్మరణ, అద్భుతమైన పథకాలు అమలవుతుండగా పుట్టిన రోజు పేరుతో ఇలా బలవంతంగా రక్తం సేకరించడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. నిజంగా వైసీపీ కరోనాకు భయపడితే ఈ దశదినోత్సవాలు, జన్మదినోత్సవ వేడుకలేంటని జనం ముక్కునవేలేసుకుంటున్నారు.

విజయసాయిరెడ్డి వియ్యంకుడి వ్యాక్సిన్

విజయసాయిరెడ్డి వియ్యంకుడి వ్యాక్సిన్

ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఏ పేపర్ లోని రాని వార్తలు ఒక్క జగన్ మీడియాలోనే వస్తున్నాయి. రాష్ట్రంలో కోటి మందికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారని, వారి జాబితాను కూడా తయారు చేస్తున్నట్లు వార్తలు రాశారు. వాళ్లు పేర్కొన్న అంశాల ప్రకారమైతే.. కోటి కాదుకదా, 25వేల మందికైనా కరోనా టీకా వేసే పరిస్థితి లేదు. సరే, ఒక లక్ష మందికి వ్యాక్సిన్ వేస్తారని భావించినా.. అసలు ఏ వ్యాక్సిన్ ఇస్తారన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇండియాలో ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్ కు కూడా అనుమతి దొరకలేదు. మరి ఏపీ ప్రభుత్వం కోటి మందికి వ్యాక్సిన్ ఎలా ఇస్తుంది? క్లినికల్ ట్రయల్స్ కు నోచుకోని లేదా కేంద్రం ఆమోదం పొందని వ్యాక్సిన్లను ఏపీ ప్రజలకు ఇస్తారా? లేదంటే, విజయసాయి రెడ్డి మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి, ఆయన వియ్యంకుడి కంపెనీలో ఏదైనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా?

జనవరి చివర్లోనే ఎన్నికలు

జనవరి చివర్లోనే ఎన్నికలు

పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్లతోనే కరోనాను కంట్రోల్ చేస్తామన్న మీరు.. ఫిబ్రవరిలో ఎన్నికలను అడ్డుకోడానికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తెచ్చారు. హైకోర్టు ఆదేశంతో ప్రభుత్వానికి చెందిన ముగ్గురు అధికారులు ఎస్ఈసీని కలవనున్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఈ సందర్భంగా నిమ్మగడ్డకు నేనొక విన్నపం చేయదలిచాను. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికీ ‘ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్' వాదననే వినిపిస్తే గనుక, జనవరి చివరి వారంలోనే ఎన్నికలు పెట్టాలని నా మనవి. బంపర్ మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఉన్నప్పటికీ వైసీపీ ఎన్నికలకు భయపడుతోంది కాబట్టి, ప్రజాస్వామిక పద్ధతిలో ఎస్ఈసీనే ఎన్నికలను నిర్వహించాలి.

రజనీకాంత్‌లా జగన్ చెప్పగలరా?

రజనీకాంత్‌లా జగన్ చెప్పగలరా?

ఏపీకి కొత్త రాజధాని విశాఖపట్నమే అని ప్రగల్భాలకు పోతున్న ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్రస్తుతం ఉత్తరాంధ్రకు సామంత పాలకుడిలా వ్యవహరిస్తున్నారు. సిహాచలం ఆలయ పరిధిలోని భూములు, విశాఖలో భూములను పరిరక్షిస్తున్నానంటూ తనవి కాని పనులతో ఆయన బిల్డప్ ఇస్తున్నారు. ఆలయ భూములు కబ్జాకు గురైతే దేవాదాయ శాఖ కదా చూసుకోవాల్సింది, విజయసాయిరెడ్డికి ఏం అధికారం ఉందని భూములపై నిర్ణయాలు తీసుకుంటున్నారు? గజపతిరాజుల కుటుంబం ఎంతో నిజాయితీగా వ్యవహారాలు చూసుకుంటుంటే.. వైసీపీ వికృత చేష్టలతో వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ, తమకు అనుకూలమైన వ్యక్తుల్ని పదవుల్లో కూర్చోబెడుతూ పిచ్చిపనులకు పాల్పడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోతున్నది. కబ్జాకు గురైన దేవాలయాల భూముల విషయంలో తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేకు మద్రాస్ హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం తాను అధికారంలోకి వస్తే దేవాలయాను ప్రభుత్వ పరిధి నుంచి తప్పిస్తానని హామీ ఇచ్చారు. ఏపీలో జగన్ కూడా వీలైతే అలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలేగానీ అసలు సంబంధమే లేని వ్యక్తుల్ని తెరపైకి తీసుకొచ్చి, చట్టాలను తుంగలో తొక్కడం ఎంతవరకు సబబు? అసలీ వ్యవహారాలతో విజయసాయిరెడ్డికి సంబంధం ఏంటి?

విజయసాయిరెడ్డి ఎవరు?

విజయసాయిరెడ్డి ఎవరు?

ఉత్తరాంధ్రలో అరాచకాల నేపథ్యంలో అసలు విజయసాయిరెడ్డి ఎవరు? అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. సాయిరెడ్డి.. సీఎం జగన్ కు బాగా కావాల్సిన, నచ్చిన వ్యక్తి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే ప్రాంతీయ పార్టీకి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈ విషయంలో నేనేమీ నాని లాగా ప్రశ్నించబోను. అయితే, కేరళ వర్సెస్ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా.. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పర ఆధారితాలని, ఒకరి తప్పుల్ని మరొకరు సరిదిద్దేలా వ్యవస్థలు ఉన్నాయేగానీ, ఒకరు చేయాల్సిన పనిని మరొకరు చేయరాదని కోర్టు స్పష్టంగా పేర్కొంది. విజయసాయిరెడ్డిగానీ, నేనుగానీ, ఇంకొకరైనా శాసన పరిధిలోకే వస్తాం. మా నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అమలు చేస్తుంది. అంతేగానీ, విజయసాయి రెడ్డి తానే ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరిస్తుండటం రాజ్యాంగ విరుద్ధం కూడా. ఎంపీలను, ఎమ్మెల్యేలను మీటింగ్స్ కు పిలిచే అధికారం ఆయనకు ఏముంది? ప్రజల ఓట్లతో లోక్ సభ ఎంపీలుగా గెలిచిన మాపై మీ ఆజమాయిషీ ఏంటి? వైజాగ్ లో ఏవైనా తప్పులు పొరపాట్లు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలేగానీ, మీకు మీరే ఆదేశాలు జారీ చేసే అధికారం ఎక్కడిది? ఎంపీగా స్థాయిని మించి మీరు జోక్యాలు చేసుకోవడం సబబేనా? రాజ్యాంగేత శక్తిగా స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రభుత్వానికి మంచిదికాదు.

సీదరిపై జనం చీదరింపులు..

సీదరిపై జనం చీదరింపులు..

సర్దార్ గౌతు లచ్చన్నగారు ఎంత గొప్పవారో అందరికీ తెలుసు. మరి కొత్తగా జగన్ మంత్రివర్గంలో చేరిన అప్పలరాజుకు ఆ విషయం తెలుసో లేదో? ఎంబీబీఎస్ చదివిన అప్పలరాజుకు చాలా విషయాలు తెలిసుండొచ్చు, కానీ చరిత్ర తెలుసుకోకుండా గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తానని చెప్పడం సిగ్గుచేటు. 1948లో, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో విశాఖ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గౌతు లచ్చన్న.. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 1983 వరకు నిర్విరామంగా ఎన్నికవుతూ వచ్చారు. గీతకార్మికుల హక్కుల కోసం మంత్రి పదవిని సైతం వదిలేసుకున్నారు. బీసీ నాయకుడంటేనే గౌతు లచ్చన్న అని గుర్తింపు పొందారు. అలాంటి సర్దార్ గురించి మంత్రి అప్పలరాజు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల బీసీ కులాలన్నీ చిన్నబుచ్చుకున్నాయి. ఇప్పటికే ఏపీలో పెద్ద ఉద్యోగాలు, పదవులన్నీ ఒక కులానికే దక్కుతున్న నేపథ్యంలో బీసీ నేతను ఉద్దేశించి మరో బీసీ మంత్రి ఇలా మాట్లాడటం వెనుక మతలబు ఏంటో ఆలోచించాలి. గౌతు లచ్చన్న కుటుంబం టీడీపీకి చెందింది కాబట్టి వాళ్లను తిడితే జగన్ దృష్టిలో మార్కులు పడతాయని, మరో శాఖ అదనంగా వస్తుందేమో అని అప్పలరాజు ఆలోచించి ఉండొచ్చు. కానీ అలాంటి మాటలు ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకతను పెంచుతాయి.

 జగన్ సైన్యాన్ని మామలుగా ఏడిపించను..

జగన్ సైన్యాన్ని మామలుగా ఏడిపించను..

ఎవరో ఎగతాళి చేశారని జీవితం ఆగిపోరాదని, ఎగతాళి చేసేవారే ఏడ్చే విధంగా జీవితాన్ని మలుచుకోవాలని వివేకానందుడు చెప్పాడు. ఈ మంచిమాట నాకు బాగా నప్పుతుంది. ప్రభుత్వం నుంచి నిధులు పొందుతూ సోషల్ మీడియాలో కలాపాలు సాగించే వైసీపీ కురచవ్యక్తులు కొందరు నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎగతాళి చేసిన వైసీపీ సోషల్ మీడియా వాళ్లకు ఒకటి చెప్పదల్చుకున్నా. మీరు ఏడ్చే విధంగా నేను ఏం చేయబోతున్నాననో త్వరలోనే చూస్తారు. ఆ ఊడేపు మామూలుగా ఉండదు.. గుక్కపెట్టి ఏడుస్తారు వెధవల్లారా.. జాగ్రత్తగా ఉండండి''అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

కేసీఆర్ ఇన్నింగ్స్ ముగింపు: 2021లో ముఖ్యమంత్రిగా కేటీఆర్ -బెంగాల్ స్ట్రాటజీతో టీబీజేపీ దూకుడు

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju alleges and expressed doubts that ap govt is going to approve vijayasai reddy relative made corona vaccine. speaking through social media, the rebel mp slams cm jagan on several issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X