వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్టిస్ ఎన్వీ రమణపై 9ఏళ్లుగా ఇలానే - జగన్ కుట్రలకు ఆధారాలివే - ఎంపీ రఘురామ తాజా బాంబు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నందుకే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఫిర్యాదు చేశామంటూ జగన్ సర్కారు చేస్తున్న వాదన నూటికి నూరుశాతం అబద్ధమని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. న్యాయవ్యవస్థపై దాడులకు ఎనిమిదేళ్ల కిందటే బీజం పడిందని, అప్పుడు, ఇప్పుడూ జస్టిస్ ఎన్వీ రమణనే జగన్ టార్గెట్ చేస్తూ వచ్చారని ఎంపీ అన్నారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

5000 కేజీల బాంబు పేలితే ఎట్టా ఉంటదో తెలుసా? నిర్వీర్యం చేయబోతే చివరికిలా: వైరల్ వీడియో5000 కేజీల బాంబు పేలితే ఎట్టా ఉంటదో తెలుసా? నిర్వీర్యం చేయబోతే చివరికిలా: వైరల్ వీడియో

 2011, డిసెంబర్ 27నాటి..

2011, డిసెంబర్ 27నాటి..

‘‘న్యాయవ్యవస్థపై జగన్ దాడికి పునాది నిజానికి 2011-12లోనే పడింది. ఎలాగంటే.. అప్పట్లో ఎం.మనోహర్ రెడ్డి అనే ప్రముఖ న్యాయవాది మరో లాయర్ తో కలిసి అప్పటి హైకోర్టు జడ్జి(జస్టిస్ ఎన్వీ రమణ)పై అబద్దాలతో కూడిన ఆరోపణలు చేశారు. దీనిపై అప్పటి చీఫ్ జస్టిస్ వాలన్ తీవ్రంగా స్పందించారు. ఫిర్యాదును సమీక్షించిన తర్వాత ఆదేశాలు జారీ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్జి(రమణ)పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవ ఆధారాలు లేవని, ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని, పిటిషనర్లపై పరువునష్టం దావాకు కూడా అవకాశం ఉందని నాటి సీజే పేర్కొన్నారు. ఒక వార్తా పత్రిక(సాక్షి)లో వచ్చిన కథనం(2011, డిసెంబర్ 27న ప్రచురితమైన వార్త) ఆధారంగా జడ్జిపై ఫిర్యాదు ఎలా చేస్తారంటూ సీజే ఫైరయ్యారు. అంతేకాదు..

జగన్‌కు అక్షింతలు తప్పవు

జగన్‌కు అక్షింతలు తప్పవు

2011, డిసెంబర్ 27న సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేసి, దాన్నే ఫిర్యాదుగా దాఖలు చేశారని తేలడంలో ఆ ఇద్దరు లాయర్లకు చెరో రూ.50వేలు పెనాల్టీతోపాటు బార్ కౌన్సిల్ నుంచి వెలేయాలని హైకోర్టు సీజే ఆదేశించారు. అయితే తర్వాతి కాలంలో కోర్టు ఆ లాయర్లను క్షమించింది. నాడు జస్టిస్ రమణపై ఫిర్యాదు చేసిన లాయర్ ఎం.మనోహర్ రెడ్డి ఇవాళ ఏపీ మున్సిపల్ శాఖకు ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. దీన్ని బట్టి నాడు జరిగిన, నేను జరుగుతోన్న తంతును ప్రజలే అర్థం చేసుకోవాలి. అప్పుడంటే ఒక లాయర్.. జడ్జిపై ఫిర్యాదు చేశాడు కాబట్టి పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.. సుప్రీం జడ్జిపై ఇంత పెద్ద స్థాయిలో అసత్యఆరోపణలు చేయడం కీలకంగా మారింది. ఇందుకుగానూ జగన్ కు కచ్చితంగా కోర్టులో అక్షింతలు పడతాయి. ఇది ఇంకా చాలా దూరం పోతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం చెబుతాను..

 ఆ జడ్జిపై మరీ దారుణమైన అభియోగం

ఆ జడ్జిపై మరీ దారుణమైన అభియోగం

కరోనా చికిత్సకు అద్భుతమైన ఏర్పాట్లు చేశామని ఏపీ సర్కారు చెబుతోంటే.. విజయసాయి రెడ్డి దగ్గర్నుంచి వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ హైదరాబాద్, బెంగళూరుకు పరుగులు తీస్తున్నారు. దీని అర్థం ఏపీలో వైద్య సౌకర్యాలు సరిగా లేవనే కదా. గతంలో అచ్చెన్నాయుడిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చమన్నందుకు ఎంత రచ్చ చేశారో వైసీపీ నేతలు గుర్తుతెచ్చుకోవాలి. మొన్న జగన్ ఆరోపణలు చేసిన జడ్జిల జాబితాలో ‘‘అచ్చెన్నన్ను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాలని''అని ఆదేశించిన జడ్జి పేరు కూడా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రిలో అద్భుతమైన సౌకర్యాలు ఉంటే, ఈ జడ్జిగారు ప్రైవేటుకు వెళ్లమంటున్నారని సీజేఐకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. నిజంగా ఏపీలో ఆస్పత్రులు అంత బాగుంటే ఇవాళ మంత్రులు, నేతలు వేరే ఊళ్లకు ఎందుకు వెళుతున్నారు? ఇదేనా మీ సంస్కారం? అసలు మీరు మనుషులేనా? ఇది సీఎం జగన్ కు తెలియకుండా జరిగి ఉంటుందని నాతోపాటు చాలా మంది నమ్ముతున్నారు.

దేశమంతా ఏపీ గురించే చర్చ..

దేశమంతా ఏపీ గురించే చర్చ..

హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఏపీ సీఎం చేసిన ఫిర్యాదులపై దేశమంతా చర్చిస్తున్నది. ఒక ప్రణాళికతో కావాలనే దాడి చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్పింది.అలాగే ‘అడ్వొకేట్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు' అసోసియేషన్ కూడా దీన్ని కుట్రపూరిత చర్యగా పేర్కొంది. ఎన్నో నేరాల్లో నిందితుడిగా ఉన్న జగన్ ఇలా మాట్లాడటం అసమంజసంగా ఉంటుందని చెప్పింది. మరోవైపు ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు జీఎస్ మణి, యాదవ్ లు.. జగన్ తన పదవిని తప్పుడు పనులకు వాడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కేసులన్నీ అడ్మిట్ అయితే ఏపీ సీఎం పరిస్థితి ఏమవుతుందో చూడాలి. న్యాయస్థానాన్ని ఏదో చెయ్యాలనే ప్రయత్నంలో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని దేశమంతా అనుకుంటున్నది'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

జస్టిస్ రమణ పిల్లల భూములెక్కడో తెలుసా? జగన్-సంజీవయ్యకు తేడా ఇదే: ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలుజస్టిస్ రమణ పిల్లల భూములెక్కడో తెలుసా? జగన్-సంజీవయ్యకు తేడా ఇదే: ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

English summary
narsapuram ysrcp rebel mp raghurama krishnam raju made key remarks over cm jagan- justice nv ramana row. speaking to media in delhi on thursday, mp alleges that ys jagan and his loyalists were constantly targeting justice ramana since 2011-12. with the recent issues total nation is talking about andhra pradesh, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X