వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచైత తండ్రి ఎవరు? వీలునామా ఇదే -విజయసాయి వేళ్లు తెగడం ఖాయం -ఎంపీ రఘురామ సంచలనం

|
Google Oneindia TeluguNews

సొంత పార్టీపై, జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ కాబోయే రాజధాని విశాఖపట్నం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కీలక వ్యవహారాలు నెరపుతున్నారని, స్కెచ్ లో భాగంగానే సంచైత గజపతిరాజును తెరపైకి తెచ్చారని రఘురామ ఆరోపించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టు తీర్పు తర్వాత సంచైత, సాయిరెడ్డిలకు తిప్పలు తప్పబోవన్నారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...

రక్తపాతానికి బీజేపీ భారీ కుట్ర -మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన -సర్వత్రా టెన్షన్..రక్తపాతానికి బీజేపీ భారీ కుట్ర -మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన -సర్వత్రా టెన్షన్..

 సాయిరెడ్డికి ఆసక్తి ఎందుకు?

సాయిరెడ్డికి ఆసక్తి ఎందుకు?

‘‘విశాఖపట్నం, దాని పక్కనుండే సింహాచలం దేవస్థానం, మన్సాస్ ట్రస్టు ద్వారా ఎంతో మందిని ఎడ్యుకేట్ చేశారు. ట్రంస్టు ప్రారంభానికి ముందే సంగీత పాఠశాల కూడా ఉందక్కడ. ఘంటసాల, సుశీల లాంటి గొప్ప కళాకారులు అక్కడ చదువుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అక్కడే చదువుకున్నానని, తన రాజకీయ జీవితానికి ట్రస్టు కాలేజీలోనే బీజం పడిందని ఇటీవల చెప్పారు. అలాంటి సింహాచలం ట్రస్టుకు సంబంధించిన వీలునామాల్లో ‘మేల్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ' అని స్పష్టంగా ఉంది. కానీ మా వైసీపీ నేతలు, ముఖ్యంగా విజయసాయిరెడ్డి సడెన్ గా సంచైత గజపతిరాజును తెరపైకి తెచ్చారు. వంశపారంపర్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం కలుగజేసుకుని, రాత్రికిరాత్రే సంచైతను సిహాచలం దేవస్థానం చైర్ పర్సన్ గా నియమించారు. కొంతకాలానికి మన్సాస్ లో కూడా అశోక్ గజపతిని తొలగించి, సంచైతకు స్థానం కల్పించారు. అసలీ వ్యవహారం విజయసాయిరెడ్డికి ఎక్కడలేని ఆసక్తి ఎందుకొచ్చిందని జనం చర్చించుకుంటున్నారు..

 స్కెచ్‌లో భాగంగానే ఆమె..

స్కెచ్‌లో భాగంగానే ఆమె..

సింహాచలం దేవస్థానం, మన్సాస్ ట్రస్టుకు కలిపి 30వేల ఎకరాలకుపైగా భూములున్నాయి. ఒకవేళ వైసీపీ ఆశలు ఫలించి విశాఖపట్నంలో రాజధాని గనుక వస్తే ఆస్తుల విలువ బాగా పెరిగిపోతుంది. విజయసాయి స్కెచ్ వేసింది ఆ ఆస్తుల కోసమేనా? అని అనుమానాలు పెరుగుతున్నాయి. సింహాచలం దేవస్థానం భూములున్న పంచగ్రామాల్లో సుమారు 1800 ఎకరాల్లో పేదలు ఇళ్లు కట్టుకున్నారు. ఆ వ్యవహారం కోర్టులో ఉండగా.. జగన్ సర్కారు తగుదునమ్మా అంటూ దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సదరు కమిటీలో లోకల్ ఎంపీ సత్యనారాయణ లేరు. కొద్దిగొప్ప భూములు అనకాపల్లి పరిధిలోకి వస్తాయి కాబట్టి ఆ ఎంపీ కమిటీలో ఉండటంలో తప్పులేదు. కానీ ఎక్కడో నెల్లూరులో పుట్టి, రాయలసీమలో మెట్టి, చెన్నైలో ప్రాక్టీస్ చేసుకుని, వైసీపీ జాతీయ కార్యదర్శిగా ఎంపికైన విజయసాయిరెడ్డికి విశాఖపట్నంతో సంబంధం ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి. భూములు, పేదల ఇళ్లపై వేసిన కమిటీలో ఆయనే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ట్రస్టు భూముల్ని కొట్టేయాలని చూస్తున్నారని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. స్కెచ్ లో భాగంగానే సంచైతను తెరపైకి తెచ్చారని స్పష్టంగా తెలుస్తోంది. అసలు..

సంచైత తండ్రి ఎవరు?

సంచైత తండ్రి ఎవరు?

విజయనగరం సంస్థానాదీశులు పీవీజీ రాజుగారంటే నాకు ప్రత్యేక అభిమానం. చిన్నప్పుడు కలిశాను కూడా. ఆయన వారసుడు ఆనందగజపతిరాజు రెండు సార్లు ఎంపీగా, ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆయనను జనం దేవుడిలా కొలుస్తారు. ఆనందగజపతిని ప్రేమించి పెళ్లాడిన మహిళ(ఉమా గజపతి).. కొంతకాలానికే(1992లో) ఆయనను వదిలేసి.. రమేశ్ శర్మను పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు విడాకులు తీసుకునే నాటికి సంచైత వయసు మూడేళ్లు. అప్పట్లోనే ఆర్థిక సెటిల్మెంట్లు కూడా జరిగాయి. పిల్లలు తండ్రి దగ్గర ఉండబోరని, తల్లి దగ్గరే ఉండాలని విడాకుల డాక్యుమెంట్ లోనూ స్పష్టంగా పేర్కొన్నారు. సంచైత తల్లి కూడా పెద్ద పొలిటీషియన్. కాలికట్ లో పుట్టి చెన్నైలో చదువుకున్నారు. ఢిల్లీ సర్కిళ్లలో పెద్ద పేరుంది. సంచైత తన సర్టిఫికేట్లు, ఇతర ఐడెంటిటీల్లో తండ్రి పేరును రమేశ్ శర్మ అనే పేర్కొంటుంది తప్ప, ఆనందగజపతి పేరు ఉండదు. అలాంటి కుటుంబంలోని సంచైతను విజయసాయిరెడ్డి సడెన్ గా తెరపైకి తీసుకొస్తారని ఎవరూ ఊహించలేదు..

ఉర్మిళనే అసలైన వారసురాలు..

ఉర్మిళనే అసలైన వారసురాలు..

విడాకుల తర్వాత కనీసం చావులకు కూడా రాలేదు. 1995లో పీవీజీ రాజు కాలం చేసినప్పుడు కూడా ఉమా గజపతి రాలేదు. ఆమెతో విడాకుల తర్వాత ఆనందజపతి.. విజయనగరానికే చెందిన సుధారాజును రెండోపెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టిన ఉర్మిళనే తమ వారసురాలని ఆనందగజపతి స్పష్టంగా చెప్పారు. తాను లండన్ లో ఉన్నందున ఇన్నాళ్లూ స్పందించలేక పోయానని, సింహాచలం, మన్సాస్ ట్రస్టు విషయంలో కోర్టును ఆశ్రయిస్తామని ఉర్మిళ చెప్పారు. నిజంగా ఆ రెండు సంస్థల పదవుల్లో ఆనందగజపతి వారసులు ఉండాలన్నదే విజయసాయిరెడ్డి ఉద్దేశం అయితే.. అందుకు ఉర్మిళ ఒక్కరే అర్హురాలు అవుతారే తప్ప..

 సంచైతా.. చెలరేగిపోవద్దు..

సంచైతా.. చెలరేగిపోవద్దు..

ఏనాడో ఏనాడో తల్లితో వెళ్లిపోయి, స్కూల్ రికార్డుల్లోనూ తండ్రి పేరును రమేశ్ శర్మగా పెట్టుకున్న సంచైత కాబోరు. ఈ మధ్య సిరిమానోత్సవం కార్యక్రమం నుంచి ఆనందగజపతి అసలైన వారసులను పంపించేసి సంచైత కుసంస్కారాన్ని ప్రదర్శించారు. రాజవంశీకులెవరూ ఇలాంటి పనులు చేయరు. ఎవరిదో అండ చూసుకుని ఇంతలా చెలరేగిపోవడం సంచైతకు మంచికాదు. నిజంగా గజపతి కుటుంబంపై గౌరవం ఉంటే.. విజయసాయిరెడ్డి కుట్రల పట్ల ఆమె జాగ్రత్తగా ఉండాలి. అతి త్వరలోనే కోర్టు తీర్పులు వస్తాయి. అప్పటిదాకా వ్యక్తులకు లబ్ది చేకూర్చే నిర్ణయాలు తీసుకోరాదు. అనవసర విషయాల్లో కలుగజేసుకున్నందుకు విజయసాయి వేళ్లు తెగడం ఖాయం. అలా జరగకముందే ప్రభుత్వం తన చేతిని వెనక్కి తీసుకోవాలి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

బాబాయిలూ.. బండి తీసుకోండి -రూ.42వేల ట్రాఫిక్ జరిమాన కట్టలేక చివరికిలా..బాబాయిలూ.. బండి తీసుకోండి -రూ.42వేల ట్రాఫిక్ జరిమాన కట్టలేక చివరికిలా..

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju made key allegations on sanchaita gajapathi raju and vijayasai reddy over simhachalam devasthanam an mansas trust. the rebel mp alleges that urmila is the only successor to gajapathi family. speaking to media on monday at delhi mp raghurama made these comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X