• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ సిగ్గుపడుతున్నారు -నిమ్మగడ్డకు వైసీపీ కాన్సెంట్ -అకౌంట్లలోకి డబ్బులు: ఎంపీ రఘురామ

|

సొంత పార్టీపై, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అదే పనిగా మాట్లాడుతోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజురోజుకూ విమర్శల డోసును పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతోన్న పథకాలపై సీఎం జగన్ స్వయంగా సిగ్గుపడుతున్నారని, ప్రతిసారి కోర్టుల చేత ఛీకొట్టించుకోవడం తమ పార్టీకి, సీఎంకు అలవాటుగా మారిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

గుడ్ న్యూస్: ఏపీ పోలీస్ శాఖలో 6,500 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్: హోంమంత్రి సుచరిత

సంక్రాంతిలోపే స్థానిక ఎన్నికలు

సంక్రాంతిలోపే స్థానిక ఎన్నికలు

‘‘కరోనాను దాదాపుగా అరికట్టడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తక్కువ సమయంలో ప్రక్రియ పూర్తయ్యేలా, డిసెంబర్ 4లోపే ఎన్నికలు జరపబోతున్నట్లు అధికారులు చెప్పారు. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లోనూ సంక్రాంతిలోపే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం విధానపరంగా, పథకాల పరంగా ఏ పని చేయాలన్నా అందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీంకోర్టు కొద్ది గంటల కిందటే కుండబద్దలు కొట్టింది. కోర్టుల ప్రస్తావన వచ్చింది కాబట్టి మరో కీలక అంశమంది..

చెంప పగిలినా బుద్ధి రాలేదు..

చెంప పగిలినా బుద్ధి రాలేదు..

ఎన్నికల దగ్గర్నుంచి సాధారణ పరిపాలన దాకా అన్నింటా అనుచిత నిర్ణయాలు తీసుకుంటోన్న జగన్ ప్రభుత్వానికి కోర్టుల్లో చెంపదెబ్బలు ఎదురవుతున్నా బుద్ధిరావట్లేదు. తాజాగా దేవాదాయ శాఖ జారీ చేసిన మెమోను హైకోర్టు కొట్టిపారేసింది. నిజానికి గౌరవమర్యాదలు పొందడానికి స్వరూపానందస్వామికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి.

కానీ ఆయన పేరుతో పూజలు నిర్వహించాలని ఆదేశించే హక్కు మాత్రం ప్రభుత్వానికి లేదు. ప్రతిసారి కోర్టు చేత కొట్టించుకోవడమేనా? కొట్టుడు పోతుందని తెలిసీ మోమో ఇవ్వడం స్వరూపానందను అవమానించినట్లుకాదా? అసలా స్వామీజీకి ఇలాంటి చీప్ పబ్లిసిటీ అవసమా? ఇలాంటి చర్యలతో అందరి మనసుల్ని గాయపరుస్తున్నారు. ఇక ఎన్నికల విషయానికొస్తే, సుప్రీం తీర్పు ప్రకారం ప్రతిదానికి ఎస్ఈసీ అనుమతి కావాలి కాబట్టి కనీసం ప్రభుత్వాన్ని నడపడానికైనా ఎన్నికలు పెట్టాల్సిందే. అదీగాక, కరోనా వల్లే ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామన్న అధికార పార్టీ తాజాగా తన చర్యతో ఒక గొప్ప సందేశాన్ని వెలువరించింది...

నిమ్మగడ్డకు వైసీపీ అంగీకారం..

నిమ్మగడ్డకు వైసీపీ అంగీకారం..

స్థానిక ఎన్నికల నిర్వహణపై పలు పార్టీలు తమ అభిప్రాయాలను నేరుగా ఎస్ఈసీకి మాటల ద్వారా తెలియజేశాయి. అఖిలపక్షం భేటీకి గైర్హాజరైన వైసీపీ మాత్రం ఇప్పుడు తన చేతల ద్వారా ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని నిమ్మగడ్డకు అంగీకారం తెలిపినట్లుగా వ్యవహరిస్తున్నది. జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ వ్యాప్తంగా 10 రోజులు కార్యక్రమాలు చేశారు. చివరిదైన సోమవారం నాడు మంత్రులతోపాటు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో భారీ సభలు జరిగాయి. రాష్ట్రావ్యాప్తంగా సుమారు 1కోటి మంది ఆయా సభల్లో పాలుపంచుకున్నారు. తద్వారా కరోనాకు భయపడే ప్రశ్నే లేదని వైసీపీ చాటి చెప్పుకుంది. ఎలాగూ అభిప్రాయం చెప్పడంలేదు కాబట్టి, వైసీపీ చర్యలనే ఎన్నికలకు అంగీకారంగా నిమ్మగడ్డ ముందుకు కదలాలి. అద్భుతమైన పథకాలు అమలవుతుండగా వైసీపీని జనమే గెలిపిస్తారు. ఈ మాత్రం దానికే భయపడటం అనవసరం. అదీగాక..

చంద్రబాబు ముందుచూపు -పనబాక లక్ష్మికే టీడీపీ టికెట్ -బీజేపీకి చెక్ -రసవత్తరంగా తిరుపతి బైపోల్

ప్రజాప్రతినిధుల్ని పూడ్చేస్తారు..

ప్రజాప్రతినిధుల్ని పూడ్చేస్తారు..

సంక్షేమ పథకాలే కాదు, రాష్ట్రంలో అభివృద్ధి కూడా అద్భుతంగా సాగుతోంది. గతంలో విజయవాడ హైవే మీదుగా మా ఊరికి వెళ్లడానికి 45 నిమిషాలు పడితే, ఇప్పుడు మూడు గంటలు పడుతోంది. వాహనాలు రోడ్లపై దిగబడిపోయేంత గొప్పగా రోడ్లు తయారయ్యాయి. కనీసం రోడ్లపైన గుంతల్ని కూడా పూడ్చకుంటే.. జనం కోపంతో ఆ గుంతల్లోనే ప్రజాప్రతినిధుల్ని పూడ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. పోలీసులను అడ్డం పెట్టుకునో, ప్రాణాలు తీసేస్తామనో వైసీపీ సాగిస్తోన్న అరాచకాలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. స్థానిక ఎన్నికలు వచ్చేలోపే పథకాల రూపంలో.. అందరి డబ్బును కొందరికి పంచేసి.. అకౌంట్లలో డబ్బులు వేయడం ద్వారా ఓట్లు రాబట్టుకోవచ్చని మా వాళ్లు అనుకుంటున్నారేమో. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..

  Tirupati LokSabha Bypoll | Oneindia Telugu
  జగన్ సిగ్గుపడుతున్నారు..

  జగన్ సిగ్గుపడుతున్నారు..

  ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా, తమ కనీస అవసరాలను కూడా తీర్చలేని ప్రభుత్వాలకు జనమే బుద్ధి చెబుతారు. సంక్షేమ పథకాలంటే గుర్తొచ్చింది.. సున్నా వడ్డీ పథకంపై ప్రభుత్వం తాజాగా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది. అదేదో జగన్ జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నట్లుగా ప్రతి పథకానికి జగనన్న పేరు పెట్టడం వింతగా ఉంది. గతంలో చంద్రబాబు కూడా ఇలానే చేశారు. పబ్లిక్ డబ్బులతో ఈ పబ్లిసిటీ పిచ్చి ఏమిటో అర్థంకావట్లేదు. పథకాల పేర్లపై ఎవరో ఒకరు పిల్ వేసేలోపే పద్ధతులు మార్చుకుంటే మంచిది. అయినా ప్రతిదానికి జగనన్న గోరుముద్ద.. జగనన్న కానుక.. జగనన్న చెంగల్వపూదండ.. అని పేర్లు చదవడానికి స్వయంగా జగనే సిగ్గుపడుతున్నారు. రాష్ట్రంలో ఆయనకు ఓటేయని 50 శాతం మంది కూడా చిన్నబుచ్చుకుంటున్నారు. అసలు పథకాల పేరు చెప్పేటప్పుడు ఆయన తన పేరును వదిలేసి గోరుముద్ద, విద్యాకానుక అని సీఎం సింపుల్ గా పలుకుతున్నారు. అలాంటప్పుడు వాటిని ముఖ్యమంత్రి పథకంగానో, లేదా జాతీయ నేతల పేర్లనో పెడితే సరిపోతుంది కదా'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

  English summary
  As telangana govt released ghmc election schedule, andhra pradesh narsapuram ysrcp mp raghurama krishnam raju demands ap sec nimmagadda ramesh to conduct local polls in ap too. speaking to media on tuesday at hyderabad, the mp criticises ap cm jagan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X