• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

16న జగన్ భవితవ్యం: తర్వాతి సీఎం ఎవరు? -సుప్రీం నోటీసులు -సాయిరెడ్డికి చుక్కలు: ఎంపీ రఘురామ

|

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఐదుగురు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసినవి అనుచిత ఆరోపణలని, ఫిర్యాదు లేఖపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని, ఈనెల 16వ తేదీన జగన్ భవితవ్యం తేలుతుందని, దాంతో ఏపీకి తదుపరి సీఎం రాకతప్పదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడియన ఆయన.. ఏపీకి సంబంధించిన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

ట్రంప్‌కు మోదీ భారీ షాక్ -బైడెన్‌తో మాటామంతి -'విదేశీ నేతల'పై ఆంక్షల వేళ సంచలనంట్రంప్‌కు మోదీ భారీ షాక్ -బైడెన్‌తో మాటామంతి -'విదేశీ నేతల'పై ఆంక్షల వేళ సంచలనం

సీఎంకు సుప్రీం నోటీసులు..

సీఎంకు సుప్రీం నోటీసులు..

‘‘హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ గత నెల (అక్టోబర్ 6న) రాసిన అనుచిత లేఖ తాలూకు ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలైంది. జగన్ చర్యలను కోర్టు ధిక్కార నేరంగా పరిగణించాలని ప్రముఖ లాయర్లు అశ్వనీ కుమార్, సునీల్ కుమార్ సింగ్ లు దాఖలుచేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు లిస్ట్ అయ్యాయి. నవంబర్ 16 నుంచి వాటి విచారణ ప్రారంభంకానుంది. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే కాబట్టి వైసీపీలో ఆందోళన చెలరేగుతున్నది. ఈ వ్యవహారంలో ముందుగా జగన్ కు సుప్రీం నోటీసులు జారీ అవుతాయి. ఆ తర్వాత ఆయనకు రెండే దారులు ఉంటాయి..

షాకింగ్: ట్రంప్ ఆరోపణలు నిజమే -ఆధారాలతో విజిల్ బ్లోయర్లు -డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ అక్రమాలంటూషాకింగ్: ట్రంప్ ఆరోపణలు నిజమే -ఆధారాలతో విజిల్ బ్లోయర్లు -డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ అక్రమాలంటూ

తర్వాతి సీఎం ఎవరు?

తర్వాతి సీఎం ఎవరు?

జడ్జిలపై అనుచిత ఫిర్యాదుకు సంబంధించి జగన్ కు ఉన్న రెండు ఆప్షన్లలో మొదటిది... తన తప్పును ఒప్పుకోవడం. ఎలాగూ కోర్టు ధిక్కారం నిరూపణ అవుతుంది కాబట్టి జగన్ తప్పయిందని కోర్టుకు క్షమాపణలు చెప్పుకోవాలి. అది కాకుంటే మిగిలిన రెండో ఆప్షన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన నామినీని సీఎం పోస్టులో కూర్చొబెట్టాలి. ఇలా జరుగుతుందా? అనే అనుమానాలు ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే.. గతంలో ఏపీ తొలి సీఎం సంజీవరెడ్డి కూడా కంటెప్ట్ ఆఫ్ కోర్టుగా తేలిన సందర్భంలో నైతిక నియమాలకు కట్టుబడి పదవికి రాజీనామా చేశారు. తర్వాతి కాలంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కూడా కోర్టు చేత తప్పు చేసిన వ్యక్తిగా నిరూపించబడి, రాజ్యాంగంలోని కన్వెన్షన్లకు అనుగుణంగా సీఎం పోస్టు నుంచి తప్పుకున్నారు. జగన్ ది కూడా అదే పరిస్థితి. అందుచేత..

ముఖ్య పదవిపై జగన్ కు అనాసక్తి..

ముఖ్య పదవిపై జగన్ కు అనాసక్తి..

న్యాయవ్యవస్థపై దాడి చేసిన ఫలితంగా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని జగన్ ఇప్పటికైనా గుర్తించాలి. తప్పుడు ఐడియాలిస్తోన్న సలహాదారుల్ని పక్కనపెట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన సీఎంగా కొనసాగడం ఏపీ ప్రజలకు చాలా అవసరం. పాదయాత్రలో గొప్ప గొప్ప హామీలిచ్చి, భారీ మెజార్టీతో గెలిచిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక వాటిని విస్మరించారనేది నిజం. పేదలకు పెన్షన్లు మొదలుకొని ఉద్యోగులకు డీఏ పెంపు వరకు దాదాపు అన్ని హామీలను గాలికొదిలేసిన పరిస్థితి. అయితే ఏపీలో నిధుల లేమి ఉందన్నది కూడా వాస్తవమే. మరి ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సిన, ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. సీఎం పదవి అంటే ఆయనకు పెద్దగా లెక్కలేక పోవచ్చు. కానీ ఇచ్చిన వాగ్ధానాల కోసమైనా ఆయన ఉండి తీరాల్సిందే. లేదా సీఎం నామినీలనైనా సిద్ధం చేయాలి. నిజానికి..

  Chandrababu Naidu Slams CM YS Jagan On Polavaram Project Letter Issue | Oneindia Telugu
  ఇటు గుండాలు -అటు పోలీసులు..

  ఇటు గుండాలు -అటు పోలీసులు..

  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమరావతిలో ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారు. ఈ కేసును గుడ్డిగా పెట్టకుండా, డీఎస్పీ స్థాయిలో దర్యాప్తు తర్వాతే పెట్టాలని మార్గదర్శకాలు ఉన్నా, వాటిని అతిక్రమించి, రైతులకు బేడీలు వేసి మరీ అరెస్టు చేశారు. కింది కోర్టులో వారికి బెయిల్ రాకపోవడంతో హైకోర్టు జోక్యం చేసుకుని.. పోలీసు వ్యవస్థను మందలించి, ప్రభుత్వం చెంపలు వాయించింది. ఏపీలో ఒకవైపు గుండా రాజ్యం.. మరోవైపు పోలీసు రాజ్యం కొనసాగుతున్నది. జనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రజల్లో తిరిగే వైసీపీ నేతలు ఏమని సమాధానం చెప్పుకోవాలి? ఇలా దిక్కుతోచని స్థితిలోనే కొందరు బయటికి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి ఆడియోలు ఆ కోవలోకే చెందుతాయి. లీకైన ఆడియోలు తనవి కావని ఆమె చెప్పారు. కానీ..

  వైసీపీ హైకమాండ్‌పై తిరుగుబాటు..

  వైసీపీ హైకమాండ్‌పై తిరుగుబాటు..

  శ్రీదేవీ ఒక్కరే కాదు, అంతకుముందు తూర్పుగోదావరిలో ఓ ఎమ్మెల్యే కూడా ఇలానే మాట్లాడారు. తాజాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఏకంగా ఎంపీ విజయసాయిరెడ్డిపై తిరుగుబాటు చేశారు. విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో సాయిరెడ్డి మాట్లాడుతూ, పాలనా రాజధాని విశాఖకు రాబోతోందన్నారు. హైకోర్టు పరిధిలో విచారణలో ఉన్న అంశంపై ఈయన ప్రకటనలు చేయడమేంటి? బుద్ధి లేకుండా ఏదిపడితే అది మాట్లాడటమేనా? ఒకవైపు సీఎం జగన్ సుప్రీంకోర్టులో కంటెప్ట్ ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. తగుదునమ్మా అని సాయిరెడ్డి.. హైకోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడటమేంటి? రాజధాని వస్తుందని చెప్పడానికి ఆయనెవరు? మళ్లీ ఎవరో కేసు వేస్తే.. అప్పుడు మీరే కోర్టులు కుట్ర చేస్తున్నాయని ఫిర్యాదులు చేస్తారు. అభివృద్ధి, మంచిపనులు చేయమని గెలిపిస్తే ఈ అనుచితాలు మనకు అవసరమా?'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

  English summary
  narsapuram ysrcp mp raghurama krishnam raju says that andhra pradesh chief minister ys jagan would pay heavy price for allegging high court, supreme court gudges. speaking to media on friday at hyderabad, the rebel mp slams cm jagan, mp vijayasai reddy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X