అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రిస్మస్‌నాడు జగన్ పచ్చి అబద్దాలు -సీఎం స్థాయి ఇంకా పతనం -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్

|
Google Oneindia TeluguNews

సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. అనర్హత పిటిషన్ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేకపోవడంతో మాటల దాడిని పెంచిన ఆయన.. కొంతకాలంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని కోలుకుంటోన్న ఎంపీ రఘురామ.. సామాజిక మాధ్యమాలు, ఫోన్ ఇన్‌లద్వారా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తాజాగా..

బిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణబిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణ

 అమరావతి ఆ కులానిదే..

అమరావతి ఆ కులానిదే..

గత టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖరారైన అమరావతి.. అందరి రాజధాని కాదని, కేవలం ఒక కులానికి చెందినదని, చంద్రబాబు తన వర్గానికి మాత్రమే లబ్ది చేకూరేలా రాజధానిని ఏర్పాటు చేశారని, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆ కులానికి చెందిన వాళ్లు ‘డెమోగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్' పేరిట పేదలకు ఇళ్లివ్వరాదంటూ హైకోర్టును ఆశ్రయించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. క్రిస్మస్ పండుగ రోజున తూర్పుగోదావరి జిల్లా పేదలకు ఇళ్ల పంపకం కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలకు చోటు లేని అమరావతి ఎందుకు? అని సభాముఖంగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి..

Recommended Video

సీఎం జ‌గ‌న్‌కు క‌నీస ప‌రిజ్ఞానం లేదు.. రాజ‌ధానిలో ఎస్సీలే ఎక్కువ ఉన్నారు : ఎంపీ
జగన్‌కు కనీస పరిజ్ఞానం లేదా

జగన్‌కు కనీస పరిజ్ఞానం లేదా

అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో సీఎం జగన్ కనీస పరిజ్ఞానం లేకుండా అమరావతిపై వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. అమరావతిలో ఎస్సీ వర్గానికి చెందినవారు 50 శాతం పైగానే ఉన్నారన్నారని, సీఎం స్థాయి వ్యక్తి శాస్త్రియ గణాంకాలు తీసుకొని మాట్లాడితే బాగుంటుందని రఘురామ అన్నారు.

 సీఎం స్థాయి దిగజారేలా..

సీఎం స్థాయి దిగజారేలా..

‘‘అమరావతి ఒకే కులానికి రాజధాని అని తన నోటితో చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ తన స్థాయిని తానే తగ్గించుకున్నట్లయింది. ఎందుకంటే సీఎం మాటలు వాస్తవ పరిస్థితికి పూర్తిగా భిన్నమైనవి. అమరావతిలో ఎస్సీలే 50 శాతం మంది ఉన్నారు. అమరావతిలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా సీఎం మాట్లాడటం సబబు కాదు. ఆ స్థాయి వ్యక్తి కనీసం సంయమనం పాటించాల్సింది. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడడం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుంది'' అని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. మరోవైపు..

డెమోగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ అంటే?

డెమోగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ అంటే?

అమరావతిని ఒక కులానికి చెందిన ప్రాంతంగా పేర్కొంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై వైసీపీ ఎంపీ రఘురామ కంటే ముందే అమరావతి జేఏసీ తీవ్రస్థాయిలో ఖండించింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని, అమరావతి కొలువున్న తాడికొండ అసెంబ్లీ స్థానం ఎప్పటి నుంచో ఎస్సీ రిజర్వుడు అని, రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో అనేక కులాల వాళ్లు అనేక తరాలుగా శాంతియుతంగా కలిసిమెలిసి బతుకుతున్నారని, వారిలో ఎస్సీ, ఎస్టీలే ఎక్కువని, వైసీపీ అధికారంలోకి వచ్చాకే కుల విభేదాలను పెంచాలని ప్రయత్నిస్తోందని అమరావతి జేఏసీ ఆరోపించింది. ‘డెమోగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్‌' అన్న పదానికి కులాల అసమతౌల్యం అని సీఎం జగన్ వక్రభాష్యం చెప్పడం దురదృష్టకరమని, రాజధానికి భూములిచ్చిన రైతుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందినవారే కావడం సీఎం దృష్టిలో కులాల అసమతౌల్యమా? అని ఉద్యమకారులు ప్రశ్నించారు.

జడ్జిలపై జగన్ పార్టీ మరో పిడుగు -అమ్మకానికి హైకోర్టు తీర్పులు -భారీ అవినీతి -ఎంఎస్ బాబు సంచలనంజడ్జిలపై జగన్ పార్టీ మరో పిడుగు -అమ్మకానికి హైకోర్టు తీర్పులు -భారీ అవినీతి -ఎంఎస్ బాబు సంచలనం

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju slams andhra pradesh chief minister ys jagan on sunday regarding three capitals issue. rebel mp alleges that cm jagan caste comments on amaravathi capital was baseless
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X