• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిగ్గుందా.. వాలంటీర్లు జగన్ సైన్యాలా? -షర్మిల పార్టీకి విజయమ్మ అధ్యక్షురాలా? -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్

|

సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్‌పై రోజుకో తీరుగా విరుచుకుపడుతోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు భాషను సైతం మార్చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులను 'ఏంట్రా' అంటూ దూషణలకు దిగారు. ఏపీలో గ్రామ వాలంటీర్లకు సన్మానం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు.. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులకు తార్కాణంగా నిలిచాయన్నారు. జగన్ సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మలపైనా రఘురామ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రచ్చబండ పేరుతో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

సంచలనం: వైసీపీ ఎంపీల రాజీనామా -తిరుపతిలో ఓడితే చేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి -పవన్ పెయిడ్ ఆర్డిస్ట్<br>సంచలనం: వైసీపీ ఎంపీల రాజీనామా -తిరుపతిలో ఓడితే చేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి -పవన్ పెయిడ్ ఆర్డిస్ట్

 సన్మానాలకు రూ.261 కోట్లా?

సన్మానాలకు రూ.261 కోట్లా?

‘‘అసలే అప్పుల్లో కూరుకుపోయిన ఏపీలో అత్యంత చీప్ డ్రామాలు జరుగుతున్నాయి. గ్రామ, వార్డు వాలంటీర్లకు సన్మానాలు పేరుతో రూ.261 కోట్లు తగలేశారు. ఓవైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఇలాంటి పనికిమాలిన పనులకోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం దారుణం. పెన్షన్ డబ్బులు అకౌంట్లలో వేసి, రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందిస్తే పోయేదానికి అనవసరంగా ఓ వ్యవస్థను పెట్టి, దాన్ని చూసి దేశమంతా గర్విస్తోందని సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు. వాలంటీర్ వ్యస్థను విస్త్రను చేసి వైసీపీ వాళ్లు తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు..

 ఏట్రా ఇది? ఎవడబ్బ సొమ్మురా?

ఏట్రా ఇది? ఎవడబ్బ సొమ్మురా?

వాలంటీర్లకు సన్మాన సభలో సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, వాలంటీర్లను జగనన్న సైన్యాలని అభివర్ణించాడు. అదేంట్రా? ఎవడబ్బ సొమ్ముతో వాలంటీర్లకు జీతాలిస్తున్నారు? ప్రజాధనంతో, ప్రభుత్వ సొమ్ముతో పనిచేసే వాలంటీర్లు జగనన్న సైన్యం ఎలా అవుతార్రా? అసలు సైన్యమంటే ఎవరు? రాజుగారి రాజ్యకాంక్షను తీర్చే బలగాలేకదా? మరి ఏపీలోని వాలంటీర్లు కూడా జగన్ రాజ్యకాంక్షను తీర్చేవాళ్లలాగానే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది కదా, అలాంటప్పుడు వాళ్లకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇవ్వడమేంటి? అంతగా సైన్యం కావాలనుకుంటే వైసీపీ పార్టీ నుంచే డబ్బులు ఇచ్చి పెట్టించుకోవచ్చుకదా? ప్రజా ధనంతో మేం పార్టీ సైన్యాలను నడుపుతున్నాం అని ఇప్పటికైనా బాహాటంగా ఒప్పుకున్నారుగా..

 మాస్కు జనాలకేనా? జగన్‌కు వద్దా?

మాస్కు జనాలకేనా? జగన్‌కు వద్దా?

ఏపీలో మాస్కులు ధరించని జనాలకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. మరి ఇవాళ వాలంటీర్ల సన్మాన సభలో సీఎం జగన్, ఆయన పక్కనున్న ఇద్దరు మంత్రులు మాస్కులు పెట్టుకున్నారా? వాళ్ల నుంచి రూ.3వేలు వసూలు చేయాల్సిందే కదా. కరోనా వ్యాప్తి సాకుతో జగన్ తన తిరుపతి ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. మరి ఇవాళ్టి సభకు జనం నిండుగా హాజరయ్యారు, సగానికిపైగా మందికి మాస్కులే లేవు. మాస్కులు లేకుంటే జనాన్ని కొట్టి చంపుతారా? అదే మీరు మాత్రం నిస్సిగ్గుగ్గా వ్యవహరిస్తారా? ఇదెక్కడి న్యాయం. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే, పొరుగున తెలంగాణలో...

 కేసీఆర్ దెబ్బకు రాయలసీమ ఎడారే

కేసీఆర్ దెబ్బకు రాయలసీమ ఎడారే


ఏపీ సీఎం జగన్ అప్పులు చేసి వాలంటీర్లకు సన్మానాల వంటి పనికిమాలిన పనులు చేస్తుంటే, అవతల తెలంగాణ సీఎం కేసీఆర్ సమర్థులైన అధికారులు, మంత్రుల్ని పెట్టి కృష్ణా జలాలను వాడేసుకునే పనిలో బిజీ అయిపోయారు. బచావత్ అవార్డు, కృష్ణా రివర్ బోర్డు కేటాయింపులకు మించి, మిగులు జాలాల ఆధారంగా తెలంగాణలో కొత్త ప్రాజెక్టులను కట్టుకుంటున్నారు. అదే జరిగితే రాయలసీమ ఎడారిగా మారడం ఖాయం. కేసీఆర్ తో హార్ధిక సంబంధాలున్న జగన్ ఏం చేస్తున్నట్లు? సీమ ప్రజలకు నీళ్లిస్తానన్న వాగ్ధానం ఏమైనట్లు? ఎంత సేపూ ఢిల్లీకి పోతే రఘురామ మీద ఫిర్యాదులో, సొంత పనులో కాకుండా కృష్ణా జలాలపైనా మాట్లాడండి, మీకు చేతకాకపోతే కనీసం నిష్ణాతులను పెట్టుకుకోండి, తెలంగాణ నిర్మిస్తోన్న కొత్త ప్రాజెక్టులను అడ్డుకోండి. ఏపీలో అన్న జగన్ చేతులు ముడుచుకుని కూర్చుంటే తెలంగాణలో చెల్లెల్లు షర్మిల మాత్రం..

 సీమకు నీళ్లివ్వనని షర్మిల శపథం

సీమకు నీళ్లివ్వనని షర్మిల శపథం

పుట్టింటోళ్లు తరిమేస్తేనో, మరో కారణం చేతనో జగన్ సోదరి వైఎస్ షర్మిల తన అత్తగారింటి కోసం పని చేయాలని ఫిక్స్ అయ్యారు. నీటా వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరగనీయనని అంటోన్న షర్మిల.. రాయలసీమకు చుక్క నీరు కూడా రానీయబోనని శపథాలు చేస్తున్నారు. ఏపీ రాజన్న రాజ్యంలో సీమకు నీరివ్వడం ప్రధాన అంశమైతే, తెలంగాణ రాజన్న రాజ్యంలో మాత్రం అదే సీమకు నీళ్లను అడ్డుకోవడం విధానంగా ఉన్నట్లుంది. పైపెచ్చు, షర్మిల పార్టీతో సంబంధం లేదని జగన్ సలహాదారులు ప్రకటిస్తుంటే, అదే జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలైన వైఎస్ విజయమ్మ తెలంగాణలో షర్మిల పార్టీకి ఆశీర్వచనాలు ఇస్తారు. త్వరలో పెట్టబోయే షర్మిల పార్టీకి కూడా విజయమ్మే వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉంటారా? ఒక వ్యక్తి రెండు పార్టీలకు ఆ పదవుల్లో ఉండొచ్చా?, అసలీ రాజన్న రాజ్యాల డ్రామాలేంటో అర్థం కావట్లేదు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

జగన్ బెయిల్ రద్దుపై మరో పిటిషన్ -భరతం పట్టేదాకా వదలను -వైసీపీ ఎంపీ రఘురామ అనూహ్యంజగన్ బెయిల్ రద్దుపై మరో పిటిషన్ -భరతం పట్టేదాకా వదలను -వైసీపీ ఎంపీ రఘురామ అనూహ్యం

English summary
narsapuram ysrcp mp raghu rama krishnam raju made serious remarks on ap cm ys jagan and minister perni nani over ap grama/ward volunteer system. speaking through social media on monday, the rebel mp also slams jagan and his sister ys sharmila on krishna water dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X