• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌పై వి‘ప్లవ’ పోరాటం: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పిలుపు -కామెడీ పీస్ అంటూ విజయసాయిరెడ్డి ఫైర్

|

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం నాడు కూడా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యవహారాలు హాట్ హాట్ గానే సాగాయి. నారా లోకేశ్ వల్లే టీడీపీ దుస్థితికి చేరిందంని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నట్లున్న వీడియో సంచలనం రేపగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై, వైసీపీ సర్కారు తీరుపై విప్లవ పోరాటాలు చేద్దామంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు..

video leak: జగన్, దొంగ సాక్షి విష పన్నాగం -నారా లోకేశ్‌తో విడదీయలేరు: టీడీపీ అచ్చెన్నాయుడు రియాక్షన్video leak: జగన్, దొంగ సాక్షి విష పన్నాగం -నారా లోకేశ్‌తో విడదీయలేరు: టీడీపీ అచ్చెన్నాయుడు రియాక్షన్

ప్లవ నామ.. విప్లవ నామ..

ప్లవ నామ.. విప్లవ నామ..

ఇవాళ్టి ఉగాది పండుగతో శ్రీ ప్లవ నామ సంవత్సరం ఆరంభమైంది. ప్లవ అంటే, దాటించునది అనే అర్థం వస్తుందని, చీకటిని పారదోలి వెలుగులు నింపేదని, ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుందని, చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని పండితులు పేర్కొన్నారు. అయితే, ఈ ప్లవ నామ సంవత్సరాన్ని కాస్తా ‘విప్లవ' నామ సంవత్సరంగా మార్చుకుందామని, ఏపీకి జగన్ చేస్తోన్న అన్యాయాలపై పోరాడుదామని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పిలుపునిచ్చారు.

టీమ్ స్పిరిట్‌తో పోరాడుదాం..

టీమ్ స్పిరిట్‌తో పోరాడుదాం..

ఉగాది పండుగ సందర్భంగా నర్సాపురం ఎంపీ రఘురామ కీలక సందేశమిచ్చారు. ‘‘తెలుగువారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గతేడాది మనం ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. కరోనా, ఇతర కారణాల వల్ల కష్టాలు పడ్డాం. ఆంధ్రప్రదేశ్ లోనైతే ప్రజలు రెట్టింపు కష్టాలు చవిచూశారు. ఈ ప్లవ నామ సంవత్సరాన్ని.. అన్యాయాలను ఎదురించే విప్లవ నామ సంవత్సరంగా మార్చుకోవాలి. మన ఆర్థిక పరిస్థితిని మనమే చక్కదిద్దుకోవాలి. ఈ దిశగా మన తెలుగువారంతా టీమ్ స్పిరిట్ తో ముందుకు వెళ్లాలి. అందరూ తమ వంతు సహకారం అందించాలి'' అని రఘురామ అన్నారు. కాగా,

రఘురామ ఓ కామెడీ పీస్..

రఘురామ ఓ కామెడీ పీస్..

రెబల్ ఎంపీ రఘురామ నిత్యం తన విమర్శల్లో సీఎం జగన్ తోపాటు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తుండటం తెలిసిందే. ఇన్నాళ్లూ మౌనం వహించిన సాయిరెడ్డి చాలారోజుల తర్వాత రఘురామకు కౌంటరిచ్చారు. ‘‘సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే ధైర్యం లేదు.. ప్రజలను గాలికొదిలేశాడు. నాకు ప్రాణభయం ఉంది.. కొట్టేస్తారు, చంపేస్తారని పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ కామెడీ పీస్ లా కాలక్షేపం చేస్తున్నాడు.. ఫోర్జరీ పేపర్లతో బ్యాంకులను ముంచేసినవాడే పచ్చచొక్కాల సాన్నిహిత్యంతో కోర్టు మెట్లెక్కుతున్నాడు'' అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సీబీఐ కోర్టును ఆశ్రయించడం తెలిసిందే.

ఆ పెద్ద నేతకు తీవ్రమైన కష్టాలు -జగన్, కేసీఆర్ జాతకాలు ఇలా -ఉగాది వేళ స్వరూపానంద బాంబు -ప్లవ అంటేఆ పెద్ద నేతకు తీవ్రమైన కష్టాలు -జగన్, కేసీఆర్ జాతకాలు ఇలా -ఉగాది వేళ స్వరూపానంద బాంబు -ప్లవ అంటే

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju called for a mass movement against ysrcp govt. in his ugadi 2021 message on tuesday, the rebel mp slams ap cm ys jagan. ysrcp mp vijayasai reddy counters rebel mp raghurama, said rebel mp is a comedy piece.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X