• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీబీఐ కేసుపై ఎంపీ రఘురామ బాంబు -జగన్‌ ఆఫీసు నుంచి ఫోన్లు -వైసీపీ ఒత్తిడి వల్లే ఎఫ్ఐఆర్ -ఇదే నిజమంటూ..

|

సొంత పార్టీపై, అధినేత సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో ఆరోపణల బాంబు వేశారు. బ్యాంకులను మోసం చేశారంటూ తనకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేయడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు సీబీఐ, ఇటు ఏపీ సీఎం ఇద్దరిపైనా వివాదాస్పద ఆరోపణలు చేశారు. వివరాల్లోకి వెళితే..

షాకింగ్: నాగార్జున సాగర్ ఉపఎన్నిక -మిగిలింది ఒక్కరోజే -టీఆర్ఎస్, బీజేపీ మల్లగుల్లాలు -జనసేనకు అవకాశం?

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

వైసీపీ ఎంపీగా ఎన్నిక కావడానికి ముందు నుంచే రఘురామ వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అందులో విద్యుత్ ప్రాజెక్టులు ప్రధానమైనవి. పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని మోసానికి పాల్పడ్డారని ఆయనపై గతంలోనూ సీబీఐ ఓ కేసు నమోదు చేసింది. తాజాగా గురువారం రెండో ఎఫ్ఐఆర్ ను సీబీఐ నమోదు చేసింది. అందులో ఎంపీపై తీవ్ర ఆరోపణలున్నాయి. అయితే, తాను మాత్రం ఏ తప్పూ చేయలేదని, సీబీఐ ఆరోపణలన్నీ అభూతకల్పనలని, తనపై కేసు వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, ఆర్థిక నేరాల్లో నిందితుడైన ఏపీ సీఎం జగన్ ను మాత్రం సీబీఐ వదిలేసిందంటూ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి పోరు: రత్నప్రభ అనూహ్య స్పందన -పవన్ కల్యాణ్ షాకింగ్ తీరు -ఉమ్మడి కమిటీ ఉంటుందా?

సీబీఐ ఏం చెప్పిందంటే..

సీబీఐ ఏం చెప్పిందంటే..

వ్యాపారం కోసం రుణం తీసుకుని రూ.237.84 కోట్లు దారి మళ్లించి, అక్రమంగా లబ్ధి పొందారనే ఫిర్యాదుపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన ఇండ్‌ భారత్‌ పవర్‌ జెన్‌కమ్‌ లిమిటెడ్‌ సంస్థతో పాటు దాని డైరెక్టర్లపై సీబీఐ ఢిల్లీ విభాగం గురువారం ఓ కేసు నమోదు చేసింది. చెన్నైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎస్‌ఏఎంబీ బ్రాంచ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.రవిచంద్రన్‌ ఈ నెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేసినట్లు సీబీఐ ఓ నోట్ విడుదల చేసింది. అందులో..

వచ్చే ఎన్నికల్లో మన పార్టీదే విజయం..నేనే తెలంగాణ సీఎం: నేతలతో వైయస్ షర్మిల (ఫోటోలు)

కుట్రపూరితంగా మళ్లించారు..

కుట్రపూరితంగా మళ్లించారు..

ఎంపీ రఘురామతోపాటు ఆయన కంపెనీల్లో వివిధ స్థాయిల్లో ఉన్న మొత్తం ఎనిమిది మందిపై సీబీఐ కేసు పెట్టింది. ఐపీసీలోని 120బీ రెడ్‌విత్‌ 420, 468, 471తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13(1)(డీ) కింద అభియోగాలు మోపింది. నకిలీ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లు, ఊహాజనిత లావాదేవీలను సృష్టించడం ద్వారా బ్యాంకుల కన్షార్షియం నుంచి తీసుకున్న రుణాల్ని కుట్రపూరితంగానే దారి మళ్లించారని అందులో ప్రస్తావించింది. 2012 నుంచి 2017 మధ్యకాలంలో ఈ మోసం జరిగినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో తాము గుర్తించామని రవిచంద్రన్‌ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీబీఐ వివరించింది. ఇప్పటికే పలు వివాదాల్లో కూరుకుపోయిన ఎంపీ రఘురామపై సీబీఐ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. కాగా,

సీబీఐ కేసుపై రఘురామ స్పందన

సీబీఐ కేసుపై రఘురామ స్పందన

పవర్ ప్రాజెక్టుల వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి లోన్లు పొంది, అక్రమాలకు పాల్పడ్డారంటూ సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఆర్‌ఐపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అభూతకల్పనలు, అవాస్తవాలతో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిందన్నారు. ఎన్‌పీఎల్టీలో ఉన్న తన కంపెనీపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. నిధుల మళ్లింపు, దుర్వినియోగం ఆరోపణల్లో నిజం లేదని కుండబద్దలు కొట్టారు. నిజాలన్నీ నిలకడ మీద తెలుస్తాయని, సీబీఐ విచారణకు సహకరిస్తానన్నారు. అంతటితో ఆగకుండా..

ఏపీ సీఎంవో నుంచి ఫోన్ కాల్స్

ఏపీ సీఎంవో నుంచి ఫోన్ కాల్స్

విచారణకు సహకరిస్తానంటూనే తనపై సీబీఐ చేసిన అభియోగాల్లో నిజం లేదన్న ఎంపీ రఘురామ.. ఈ వ్యవహారం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయిని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే వైసీపీ తనపై కక్ష కట్టిందని, సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ వెనుక వైసీపీ బడా నేతల ఒత్తిడి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఫిర్యాదు చేసిన ఎస్‌బీఐ మేనేజర్‌(రవిచంద్రన్‌)కు, జగన్ కార్యాలయం (ఏపీ సీఎంవో) మధ్య.. ఫోన్‌ కాల్స్‌పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి కేసుల్లో పలు ఛార్జిషీట్‌లు దాఖలైన సీఎం జగన్‌.. విచారణకు హాజరుకాకపోయినా సీబీఐ పట్టించుకోవడం లేదనీ ఎంపీ రఘురామ విమర్శించారు.

English summary
Narsapuram ysrcp MP Raghurama Krishna raju reacted on CBI FRI against him. speaking to media on Friday at his residence in Delhi, the mp allegges that CBI had filed an FIR with fabrications and untruths. raghurama also made Sensational allegations on jagan sating ysrcp leaders behind the CBI FIR. cbi has filed an fir on raghurama On a complaint that he had misappropriated Rs 237.84 crore by taking a loan for a business and illegally making a profit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X