వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రైస్తవ జగన్, డీజీపీ సవాంగ్ -రాక్షసం -జస్టిస్ రాకేశ్‌కు నీరాజనం -సీఎంకు భయం: ఎంపీ రఘురామ

|
Google Oneindia TeluguNews

వైఎస్ జగన్ ఏలుబడిలోని ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై వరుస దాడులు చోటుచేసుకోవడంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ల క్రైస్తవ్యాన్ని ప్రస్తావిస్తూ పోలీసులు, వైసీపీ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కనీసం కొత్త ఏడాదిలోనైనా జగన్ ప్రజాకంటక పాలనకు దూరంగా ఉండాలని జీసస్‌ను కోరుతున్నట్లు చెప్పారు. శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రఘురామ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

 బీజేపీలోకి 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -పాత ప్రొఫెషన్‌లోకి కేసీఆర్ -బండి సంజయ్ భారీ బాంబు బీజేపీలోకి 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -పాత ప్రొఫెషన్‌లోకి కేసీఆర్ -బండి సంజయ్ భారీ బాంబు

జగన్ మాట తడి ఆరకముందే..

జగన్ మాట తడి ఆరకముందే..


‘‘అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. గతేడాది ఇబ్బందుల నేపథ్యంలో కొత్త ఏడాదిలోనైనా ప్రపంచం బాగుండాలని కోరుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా గతేడాదిలా కాకుండా అడ్డంకులన్నీ తొలిగిపోవాలని దేవుణ్ని కోరుతున్నాను. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలను నరికేసిన ఘటన అందరినీ కలిచివేసింది. నిందితులను పట్టుకుని గట్టిగా యాక్షన్ తీసుకుంటామని సీఎం చెప్పారు. ఆయనా మాటలు చెప్పి 24 గంటలైనా తిరక్కముందే, రాజమండ్రిలో ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణస్వామి ఆలయంలో కొందరు మతోన్మాదులు విఘ్నేశ్వరుడి విగ్రహం చేతులు ఖండించారు. అసలు..

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూతిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

సీఎం -డీజీపీ -క్రైస్తవ్యం

సీఎం -డీజీపీ -క్రైస్తవ్యం

ఒకపక్క వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ సొమ్ములతో క్రైస్తవ చర్చిలను నిర్మిస్తోంది. ప్రజాధనాన్ని పాస్టర్లకు భృతిగా ఇస్తోంది. ప్రజాధనంతో ఇలా క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడంపై కనీసం పోలీసులైనా దృష్టిసారించాలి. సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు హిందువేతరులు(క్రైస్తవులు) కాబట్టి ఆ ఇద్దరూ ఏపీలో జరుగుతోన్న హిందూ ఆలయాలపై దాడులను ఇంకాస్త శ్రద్ధతో అరికట్టాల్సిన అవసరం ఉంది.

పదవులకు అనర్హులు..

పదవులకు అనర్హులు..


ఏపీలో హిందూ దేవాలపై దాడుల అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఎట్టకేలకు ఏడాదిన్నర తర్వాతైనా స్పందించారు. ఆలయాల్లో విధ్వంసాలపై సీఎం జగన్ 18 నెలల తర్వాతైనా స్పందించారు. కానీ ఆయన మాటలు నీటిమూటలుగా పోనీయకుండా, చేతల్లో చూపించి, నిందితులను పట్టుకోవాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ నిర్వహించలేని వాళ్లు పదవులకు అనర్హులు. గుడులపై దాడులను అరికట్టలేకపోతోన్న పోలీసు శాఖను ప్రక్షాళన ప్రక్షాళన చేయాలా, ఇంకేదైనా చేయలా అని సీఎం జగన్ ఆలోచించాలి. ఈ మధ్య..

రాక్షసులు ఎవరు? దేవతలు ఎవరు?

రాక్షసులు ఎవరు? దేవతలు ఎవరు?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇతర మంత్రులను దేవతలుగా పేర్కొంటూ, వారు చేస్తోన్న ప్రజాయగ్నాలకు కొందరు రాక్షలు అడ్డుపడుతున్నారని, మంచి పనులకు అడ్డుతగులుతూ రాక్షసులు కోర్టులకు వెళ్లారని చెప్పుకొంటున్నారు. మరి ప్రభుత్వం న్యాయంగా ఇచ్చిన మాటను వెనక్కి తీసుకున్నప్పుడు ఆ అన్యాయంపై న్యాయస్థానంలో న్యాయయగ్నం జరుగుతుండగా అడ్డుకున్న రాక్షసులు ఎవరో వైసీపీ నేతలే చెప్పాలి. జగన్ తన గుండె మీద చేయి వేసుకుంటే ఎవరు రాక్షసులో, ఎవరు దేవతలో స్పష్టంగా అర్థమవుతుంది. ఆవ భూములు మునుగుతాయని తెలిసీ, తాటిచెట్టు లోతులో నీళ్లొచ్చాయ జనం పడవలపై అక్కడికి వెళ్లారని చూసి కూడా అక్కడ పేదలకు ఇళ్లు కట్టిస్తామని జగన్ సర్కారు యగ్నం తలపెడితే, ఆ అన్యాయాన్ని అడ్డుకోవడాన్ని కూడా రాక్షస చర్యగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోండి.

జస్టిస్ రాకేశ్, సీఎం జగన్‌కు తేడా ఇదే..

జస్టిస్ రాకేశ్, సీఎం జగన్‌కు తేడా ఇదే..


జగన్ ఇకనైనా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చెడ్డ పనులు చేస్తే కోర్టుల్లో స్టేలు రావని గుర్తెరగాలి. న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా అమరావతి జనం నీరాజనాలు పలికారు. సరిగ్గా ఆ ప్రాంతానికే వెళ్లడాకి సీఎం జగన్ కు హైసెక్యూరిటీ కావాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోండి. కనీసం కొత్త సంవత్సరంలోనైనా జగన్ ప్రజారంజకంగా పరిపాలించాలి. గతేడాది ఆయన అనుకున్నవన్నీ ప్రజాకంటకంగా ఉన్నాయి. ఈ ఏడాది ప్రజలకు మంచి చేసే, మంచి పాలన అందించే శక్తిని జగన్ కు ఆ భగవంతుడు అందించాలని నేను నమ్మే వెంకటేశ్వరుడిని, మీరు నమ్మే జీసన్ ను కోరుతున్నాను'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narasapuram ysrcp mp raghurama krishnam raju criticises andhra pradesh cm jagan and dgp gowtham sawang over attacks on hindu temples. the rebel mp wishes ap people atleast in 2021 ap would get good governance
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X