• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ వల్ల జనంలో సోమరితనం -దాన్ని మోదీ సహించరు -అందుకే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సున్నా: వైసీపీ ఎంపీ

|

వాస్తవంగా చూసుకున్నా.. 15వ ఆర్థిక సంఘం రిపోర్టులు చూసినా.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని, రాబడిలో సగానికిపైగా వడ్డీలు, జీతాల చెల్లింపులకే పోతుండగా, కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని, ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ లాంటి అనవసర పథకాలతో ముఖ్యమంత్రి జగన్.. ప్రజల్ని సోమరిపోతులుగా మార్చుతున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధులు రాకపోవడానికి ఇలాంటివి కూడా కారణాలే అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం, పంచాయితీ ఎన్నికలు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

union budget 2021: రివ్యూ -సామాన్యుణ్ని పిండేసిన నిర్మల -బ్రేక్ ఫెయిల్.. హారన్ సౌండ్ పెంపు

ప్రజల్ని సోమరిపోతులుగా..

ప్రజల్ని సోమరిపోతులుగా..

‘‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భయానకంగా ఉండబోతోంది. దీనజనోధ్దారణే తన ధ్యేయమంటూ జగన్ అనవసరమైన పథకాలెన్నో పెడుతున్నారు. పేద ప్రజలకు సంక్షేమం అవసరమే. కానీ ప్రజల్ని సోమరిపోతుల్ని చేసే స్థాయిలో అవి ఉండకూడదు. ఏ గ్రామంలోనైనా ప్రజలకు రేషన్ షాపు మహా అయితే కిలోమీటరులోపే ఉంటుంది. రేషన్ షాపునకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీకాదు. అలాంటిదానికి సరుకుల డోర్ డెలివరీ అంటూ అనవసరపు ఖర్చెందుకు? సంక్షేమం అందజేయడానికి ఇంతగా దుబారా చేయాలా? ఎన్నికల తర్వాత ఆ వాహనాల రిపేర్లకు కూడా డబ్బులుండని పరిస్థితి దాపురిస్తుంది. ఇలాంటి పథకాలు ముమ్మాటికీ జనాన్ని సోమరిపోతులుగా మార్చుతుంది. రేప్పొద్దున ఇదే ప్రజలు మాకు వంట చేసి, తినిపించాలని డిమాండ్ చేస్తే పరిస్థితి ఏంటి? దానికి కూడా సిద్ధంగా ఉండాలని వాలంటీర్లను జగన్ ఆదేశిస్తారా?

నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్‌కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీ

ప్రధాని మోదీ అసలే సహించరు..

ప్రధాని మోదీ అసలే సహించరు..

సంక్షేమ పథకాల్లో ఏపీని తలదన్నే రాష్ట్రం మరోటి లేదు. బాగా అభివృద్ది చెందిన దేశాలకు ధీటుగా ఏపీలో ప్రజాసంక్షేమం అమలవుతోంది. అప్పు చేసి పప్పు కూడు తరహాలో సాగే విధానాల వల్ల ఏపీలో ప్రజలు సోమరిపోతులు అవుతారు. మన ప్రధాని నరేంద్ర మోదీ.. సోమరితనాన్ని అసలే సహించరు. ప్రజలంటే కష్టపడాలి.. వాళ్ల పని వాళ్లే చేసుకోవాలని ఆయన భావిస్తారు. అందుకే 100ఏళ్ల వయసులోనూ మోదీ తల్లి తన పని తానే చేసుకుంటారు. ప్రజలు కష్టపడాలి అనేది ఎప్పటికైనా కరెక్టు పాలసీనే. రేషన్ కార్డులేనివాళ్లు డబ్బులిచ్చి మరీ దుకాణాలకు వెళుతూ సరుకులు కొంటారు. అలాంటి వాళ్లకే లేని సౌకర్యాలు.. ఫ్రీగా సరుకులు పొందేవాళ్లకు అవసరమా? ఏపీ ప్రభుత్వం ఇంత దర్జాతనాన్ని ప్రదర్శిస్తోంది కాబట్టే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అదనంగా నిధులు దక్కలేదు. అంతేకాదు..

సముద్రం ఒడ్డున బీర్ బాటిల్‌తో యంగ్ బ్యూటీ.. ఒయ్యారాలు ఒలికించిన ఆషికా రంగనాథ్

అన్నింటికీ అమిత్ షానేనా?

అన్నింటికీ అమిత్ షానేనా?

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడానికి కారణం మా(వైసీపీ)వాళ్లే. ఏది చేసినా కేంద్రంలోని ఆ ఇద్దరు పెద్దలు(ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా)కు చెప్పే చేస్తామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గతంలో చాలా సార్లు చెప్పారు. మరి అంతలా కమ్యూనికేషన్ ఉన్నప్పుడు.. బడ్జెట్ లో అదనపు కేటాయింపులు ఇవ్వలేదని ప్రెస్ మీట్లు పెట్టి ఏడవటం దేనికి? అయినా, బడ్జెట్ కు ముందు ముఖ్యమంత్రి జగన్ గానీ, వైసీపీ ఎంపీలుగానీ ఎన్నిసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశారు? కరక్కాయ మందు లాగా ప్రతి అన్నింటికీ అమిత్ షా దగ్గరికి వెళితే ఏమొస్తుంది? పోలవరం ప్రాజెక్టు మొదలుకొని చిన్న ప్రతిపాదనల దాకా సంబంధిత మంత్రులను, ఆర్థిక మంత్రిని కలిస్తే తప్ప పనులు కావన్న సంగతి తెలీదా? కనీసం ఇప్పటికైనా సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగి.. రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకునేలా చర్యలు చేపట్టాలి. అలా కాకుండా, దర్జా తనాన్ని ప్రదర్శిస్తే ఇవ్వాలనుకునే వాడు కూడా మానుకునే ప్రమాదం ఉంది.

సాయిరెడ్డిపై భారం తగ్గించాలి..

సాయిరెడ్డిపై భారం తగ్గించాలి..

రాష్ట్రంలో ఇసుక దగ్గర్నుంచి ప్రతి చిన్న అంశానికి సంబంధించిన కాంట్రాక్టుల వ్యవహారాలను వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డే చూస్తున్నారు. అటు ఢిల్లీ వ్యవహారాలు, కోర్టు కేసులు, పార్టీ పనులు.. అన్నీ తానై నడిపిస్తున్న సాయిరెడ్డికి సీఎం జగన్ కొంతైనా రిలీఫ్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కడిపైనే అధిక భారం పడటం వల్ల అంతిమంగా అది రాష్ట్రానికి నష్టదాయకంగా మారింది. ఎంపీలకు పనుల విభజన వల్ల ఏపీకి మేలు జరుగుతుంది. కేంద్రంతో కలిసి నడుస్తామని, కేబినెట్ లోనూ చేరుతామని ప్రకటనలు చేసినవారే.. ఇప్పుడు బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని అనడం హాస్యాస్పదంగా ఉంది. రెగ్యులర్ నిదుల్లో ఏపీకి వాటాలే తప్ప ప్రత్యేకంగా వచ్చిందేమీ లేదు. రాజధాని ఎక్కడో ప్రభుత్వానికే క్లారిటీ లేదు కాబట్టి మెట్రో రైలు ప్రాజెక్టు కూడా పోయింది. బిల్డప్పులకు పోయి నష్టపోయే కంటే, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలి. ఇక..

నిమ్మగడ్డకు పరువుభంగం కాదా?

నిమ్మగడ్డకు పరువుభంగం కాదా?

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి గుండు సున్నా విషయాన్ని పక్కనపెడితే, రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో ప్రభుత్వ పెద్దలు ఇప్పటికీ విభేదిస్తున్నారు. మంత్రులు చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా ఎస్ఈసీ.. గవర్నర్ ను కలిసి, కోర్టులకు ఫిర్యాదు చేసే హక్కుపై మాట్లాడారు. అసలు ఎవరు ఎవర్ని తిడుతున్నారో ప్రజలు చూడటం లేదా? తమ పరువుకు భంగం కలిగించాడని నిమ్మగడ్డపై మండిపడుతోన్న మంత్రులు.. అదే వ్యక్తిని ఉద్దేశించి దారుణంగా మాట్లాడినప్పుడు నిమ్మగడ్డకు పరువుకు భంగం ఏర్పడలేదా? ఎన్నికల కమిషనర్ పై అసెంబ్లీలో ప్రివిలేజ్ నోటీసులు చెల్లవు. కేంద్ర ఎన్నికల సంఘం తప్పు చేసినా.. దాన్ని పార్లమెంటుకు పిలిపించే అధికారం శాసన వ్యవస్థకు లేదు. ఇప్పటికే కోర్టుల్లో 151కిపైగా మొట్టికాయలు తిన్న జగన్ సర్కారుకు మళ్లీ ఎదురుదెబ్బలు తప్పవు'' అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

  Union Budget 2021:BJP leaders Hail Budget in Telangana బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యం-డీకే అరుణ

  English summary
  criticising the ration door delivery scheme in andhra pradesh, narsapuram ysrcp mp raghurama krishnam raju said, people will turn into lazy with such schemes. speaking to media on tuesday in delhi, the rebel mp slams cm jagan and ysrcp leaders over union budget 2021 allocations and panchayat elections.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X