• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామ

|

ఇప్పటికీ అధికారికంగా వైసీపీ ఎంపీగానే కొనసాగుతోన్న రఘురామకృష్ణంరాజు మరోసారి సొంత పార్టీపై, హైకమాండ్ పెద్దలపై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేశారు. పార్లమెంటులో దారుణమైన తప్పిదానికి పాల్పడిన విజయసాయిరెడ్డిని సీఎం జగన్ క్షమించరాదని, అయినాసరే ఉపేక్షిస్తే పోయేది పార్టీ పరువేనని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు వివాదం సాధారణమైనదేమీ కాదని, దాని విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా వైసీపీ బంగాళాఖాతంలో కలవడం తథ్యమని చెప్పారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాట్లోనే..

షర్మిల పార్టీ గుట్టు విప్పిన రఘురామ -ఎన్టీఆర్‌లా జగన్ -అనిల్ బాణం -కర్ణాటక, తమిళనాడులో సక్సెస్షర్మిల పార్టీ గుట్టు విప్పిన రఘురామ -ఎన్టీఆర్‌లా జగన్ -అనిల్ బాణం -కర్ణాటక, తమిళనాడులో సక్సెస్

అందరు స్పీకర్లూ తమ్మినేనుల్లా..

అందరు స్పీకర్లూ తమ్మినేనుల్లా..

‘‘శాసన మండలి చైర్మన్ మొదలుకొని హైకోర్టు జడ్జిలు, కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, రాజ్యాంగ పదవిలోని నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఇలా వరుసపెట్టి అందరిపైనా దూషణలు కొనసాగిస్తోన్న వైసీపీ నేతలు.. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపైనా అనుచిత వ్యాఖ్యలకు దిగారు. ఇక మావాళ్ల ఖాతాలో మిగిలింది రాష్ట్రపతి కోవింద్ ఒక్కరే కావొచ్చు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల శుక్రవారం మాట్లాడిన దానిపై వైసీపీ ఎంపీ సాయిరెడ్డి సోమవారం పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అది విధానం కాదని వారించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. లిఖితపూర్వకంగా రాసిస్తే పరిశీలిస్తానని చెప్పారు. అయినాసరే అంతటి ఉపరాష్ట్రపతినే అనుచిత రీతిలో సాయిరెడ్డి అవమానించారు. స్పీకర్ చైర్లో కూర్చున్నవాళ్లంతా తమ్మినేని సీతారామ్ లాగా వైసీపీకి, జగన్ కు బాకా ఊదేవాళ్లు ఉండరని సాయిరెడ్డికి అర్థం కావట్లేదు. అందుకే..

జగన్‌కు మోదీ పెద్ద లెక్క కాదు -సోనియానే మట్టికరిపించాం -కేంద్రానికి వైసీపీ వార్నింగ్ -బీజేపీ గప్‌చుప్జగన్‌కు మోదీ పెద్ద లెక్క కాదు -సోనియానే మట్టికరిపించాం -కేంద్రానికి వైసీపీ వార్నింగ్ -బీజేపీ గప్‌చుప్

మతి చెడిందని ఒప్పుకోలు..

మతి చెడిందని ఒప్పుకోలు..

రాజ్యసభ చైర్మన్ వెంకయ్యను ఉద్దేశించి సాయిరెడ్డి చేసిన కామెంట్లు చాలా తీవ్రమైనవి, పార్టీకి ప్రమాదకరమైనవి కూడా. నిజానికి ఆయనపై ఆరు నెలల సస్పెన్షన్ కు కూడా అవకాశం ఉంది. కానీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఈ వివాదాన్ని చాలా స్మూత్ గా డీల్ చేశారు. పార్టీ చీఫ్ జగన్ సహా అన్ని వైపుల నుంచి విజయసాయికి దెబ్బలు పడేసిరికి తిరిగి అదే సభలో క్షమాపణలు చెప్పుకున్నారు. తన మానసిక స్థితి మరోలా ఉంది కాబట్టే తొందరపడ్డానని సాయిరెడ్డి ఒప్పుకున్నాడు. తద్వారా తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని స్వయంగా చెప్పుకున్నాడు. గతంలోనూ ఇలాంటివే తప్పులు చేసి, సారీలతో తప్పించుకున్న సాయిరెడ్డి ఇకనైనా మెంటల్ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందాలి. ఆ మేరకు జగన్ చర్యలు తీసుకోవాలి. నిజానికి..

నిమ్మగడ్డను వెక్కిరించి.. గోతిలో పడ్డాడు..

నిమ్మగడ్డను వెక్కిరించి.. గోతిలో పడ్డాడు..

విజయసాయిరెడ్డి పార్లమెంటు సాక్షిగా అందరికీ క్షమాపణలు చెప్పడానికి కొన్ని గంటల ముందు.. ఎస్ఈసీ నిమ్మగడ్డను ఉద్దేశించి అన్న వెకిలి మాటలు రివర్స్ లో తగలడం దేవుడి ప్రభావమే. కంటి ఇన్ఫెక్షన్ తో నిమ్మగడ్డ హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళితే దాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘నిమ్మగడ్డ వెళ్లింది ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిగా, దాని పక్కనే ఉన్న ఇంటి(టీడీపీ) ఆస్పత్రికా? కేవలం కళ్లే చెడిపోయాయా? బుర్ర కూడా చెడిపోయిందా? అలాగైతే ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి కూడా వెళ్లాలిగా'అని వెటకరించారు. విచిత్రంగా ఆయనీ కామెంట్లు చేసిన 24 గంటల్లోనే దేవుడు విజయసాయితోనే నిజం కక్కించాడు. తనకే మెంటల్ అని రాజ్యసభలో అందరి ముందు క్షమాపణలు చెప్పేలా చేశాడు..

జగన్ పరువు గంగలో..

జగన్ పరువు గంగలో..


పేరు వైసీపీనే అయినా, ఢిల్లీ వర్గాల్లో వైసీపీని జగన్ పార్టీ అనే సంబోధిస్తారు. రాజ్యసభలో విజయసాయి పిచ్చి వ్యాఖ్యల తర్వాత కనీసం 15 మంది ఎంపీలు నాకు ఫోన్లు చేశారు. ఏంటయ్యా, మీ బాస్ పట్టించుకోడా, ఇలాంటోళ్లను వదిలేస్తే ఎలా? అని నిలదీశారు. కులస్తుడు కాబట్టి సాయిరెడ్డిని కాపాడాలని జగన్ అనుకోవచ్చు, కానీ పార్టీ పరువు గంగలో కలవకుండా ఉండాలంటే సాయిరెడ్డిపై కనీస చర్యలైనా తీసుకోవాలి. రాజ్యసభ పక్ష నేతగా కొత్త ఎంపీ అయోధ్యరామిరెడ్డికైనా అవకాశం కల్పించాలి. సాయిరెడ్డి మెంటల్ కండిషన్ సెట్ అయ్యేదాకా ఆస్పత్రిలో చికిత్స అందించాలి. మొత్తంగా వైసీపీ ఎంపీలు అందరికీ రాజ్యాంగంపై కనీస శిక్షణ ఇవ్వాలి. ఇక..

వైసీపీ గతి బంగాళాఖాతమే..

వైసీపీ గతి బంగాళాఖాతమే..

పార్టీ నేతల అనుచిత ప్రవర్తన, పిచ్చి మాటల వల్ల వైసీపీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. అయితే అసలైన ప్రజాసమస్య మాత్రం విశాఖపట్నం ఉక్కు కర్మాగారం రూపంలో ముందుకొచ్చింది. స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ వ్యవహారం సాధారణమైనది కాదు.. ఏమాత్రం పొరపాటు జరిగినా వైసీపీ మొత్తం బంగాళాఖాతంలోకి కొట్టుకుపోయేంత పెద్ద సమస్య. వైజాగ్ స్టీల్ ప్లాంటును పోస్కో సంస్థకు కట్టబెట్టడం వెనుక జగన్ హస్తం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అది అబద్ధం అని నిరూపించాలంటే సీఎం స్వయంగా రంగంలోకి దిగాలి. డ్యామేజ్ కంట్రోల్ లేకపోతే అబద్దాలు ఇంకాస్త జోరుగా ప్రజల్లోకి వెళతాయి. కాబట్టి సీఎం వెంటనే ప్రధాని దగ్గర సమయం తీసుకుని విషయాన్ని చర్చించాలి. ఒకవేళ..

ఆపగలిగితే వైసీపీకి అడ్డే ఉండదు..

ఆపగలిగితే వైసీపీకి అడ్డే ఉండదు..


స్టీల్ ప్లాంటుకు చెందిన కీలక అధికారులతోనూ నేను మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇచ్చిన భూమిలో కేంద్రం పరిశ్రమ పెట్టింది కాబట్టి, ఇప్పుడు అమ్మడానికి కూడా రాష్ట్ర సర్కారు అనుమతి అవసరం. సీఎం జగన్ సహకారం లేకుండా కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయలేదు. నిజంగా జగన్ దీన్ని సీరియస్ గా తీసుకుని.. విశాఖ ఉక్కును కాపాడితే గనుక వైసీపీ రాకెట్ తరహాలో దూసుకెళ్లి.. ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తుంది. విశాఖ ప్లాంట్ ప్రైవేటు పరం అయితే మాత్రం వైసీపీ కచ్చితంగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది.. రెండిటిలో ఏది జరగాలో నిర్ణయించుకోవడం జగన్ చేతిలోనే ఉంది'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju slams his own party parliamentary leader vijaya sai reddy for insulting vice president venkaiah naidu. speaking to media at delhi on thursday, the rebel mp demands cm jagan to take action on sai reddy, mp also suggests cm jagan to save visakhapatnam steel plant, if not ysrcp will ruin into bay of bengal, raghurama said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X