• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రఘురామ ఇష్యూలో ట్విస్ట్: పార్లమెంట్‌కు ఏపీ సీఐడీ ఉదంతం -షాకైన ఎంపీలు -జగన్‌ను హిట్లర్‌తో పోల్చుతూ

|

ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం సుమోటోగా నమోదు చేసిన దేశ ద్రోహం కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన తర్వాత నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంకాస్త జోరుపెంచారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. వరుసగా కేంద్రం పెద్దలు, హక్కుల కమిషన్ ను కలిసి జగన్ సర్కారుపై ఫిర్యాదులు ఇస్తున్నారు. తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు కూడా రఘురామ లేఖలు రాయగా, అనూహ్యంగా ప్రత్యర్థల నుంచి మద్దతు లభించింది..

vaccine కొరత: సంచలన మలుపు -Sputnik V ఉత్పత్తికి సీరం సిద్దం -ఇండెమ్నిటీకి డిమాండ్vaccine కొరత: సంచలన మలుపు -Sputnik V ఉత్పత్తికి సీరం సిద్దం -ఇండెమ్నిటీకి డిమాండ్

పార్లమెంట్‌లో థర్డ్ డిగ్రీ టాక్..

పార్లమెంట్‌లో థర్డ్ డిగ్రీ టాక్..


ఏడాదిన్నరగా సొంత పార్టీ వైసీపీని, సీఎం జగన్ ను తిట్టినతిట్టు తిట్టకుండా తీవ్రస్థాయి విమర్శలు, సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చిన ఎంపీ రఘురామపై ఏపీ సీఐడీ పోలీసులు రాజద్రోహం కేసు పెట్టడం తెలిసిందే. కాగా, అరెస్టు తర్వాత కస్టడీలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, విపరీతంగా కొట్టడంతో కాళ్లకు గాయాలయ్యాయని ఎంపీ ఆరోపించడం, సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించడం, సదరు రిపోర్టులోని అంశాలపై అడ్డగోలుగా రాస్తే చర్యలు తప్పవని మీడియాను ఏపీ సీఐడీ హెచ్చరించడం తెలిసిందే. తన పట్ల ఏపీ సీఐడీ వ్యవహరించిన తీరును ఎంపీ రఘురామ ఇప్పుడు పార్లమెంటుకు తీసుకెళ్ళనున్నారు. ఆ మేరకు సహచర కమిటీ సభ్యులకు ఆయన బుధవారం లేఖలు రాశారు..

video: గులాబీ ఒనర్ మెడలో కాషాయం -టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా రేపే -8న బీజేపీలోకిvideo: గులాబీ ఒనర్ మెడలో కాషాయం -టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా రేపే -8న బీజేపీలోకి

దేశంలో తొలి ఎంపీని..

దేశంలో తొలి ఎంపీని..


రఘురామపై వైసీపీ అధిష్టానం అనర్హత ఫిర్యాదు చేయడానికి ముందు ఆయన రక్షణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్. ప్రస్తుతం పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో సభ్యుడైన రఘురామ.. తన సహచరులకు లేఖలు రాశారు. తన అరెస్ట్‌, అనంతర పరిణామాలను వివరిస్తూ.. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు. దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు.

జగన్‌ను కోర్టులు 150 సార్లు

జగన్‌ను కోర్టులు 150 సార్లు

దేశద్రోహం కేసుకు సంబంధించిన అంశాలేవీ మీడియాతోగానీ, సోషల్ మీడియాతోగానీ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు బెయిల్ షరతు విధించినా, ఎంపీ రఘురామ అటు మీడియాతో, ఇటు సోషల్ మీడియాలో తన వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా పార్లమెంటరీ కమిటీకి రాసిన లేఖలో తన అరెస్టుకు దారి తీసిన పరిణామాలను వివరిస్తూ.. ఏపీలో జగన్ సర్కారు తీసుకునే మెజార్టీ నిర్ణయాలు అసమంజసంగా ఉన్నాయని దాదాపు 150 సార్లు కోర్టులే పేర్కొన్నాయని, అదే విషయాలను తాను మీడియా ముందు మాట్లాడానని, సీఎం అధికారగణం కుట్రపూరితంగా తనను టార్గెట్ చేసి దేశద్రోహం కేసు పెట్టారని, కస్టడీలో టార్చర్ చేశారని, ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో తన పోరాటానికి మద్దతివ్వాలని రఘురామ కోరారు. అంతకుముందు..

సీఐడీ అధికారులపై ఫిర్యాదు..

సీఐడీ అధికారులపై ఫిర్యాదు..


అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేసినందుకే కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఢిల్లీలో స్పీకర్ ను కలిసిన ఎంపీ.. దాదాపు అర్ధ గంట సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై పెట్టిన రాజద్రోహం కేసు, తదనంతర పరిస్థితులన్నీ వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. తన కేసులో సీఎం జగన్‌, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌, ఏఎ్‌సపీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. ఇదిలా ఉంటే,

  Chandrababu Naidu ఐనా KissMiss Naidu ఐనా వదలను - Kodali Nani
  రఘురామకు అనూహ్య మద్దతు..

  రఘురామకు అనూహ్య మద్దతు..


  తన అరెస్టు, పోలీస్ కస్టడీలో అనుమానిత టార్చర్ ను వివరిస్తూ రఘురామ రాసన లేఖకు అనూహ్య రీతిలో మద్దతు వచ్చింది. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో సభ్యుడు, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మణికం ఠాకూర్.. రఘురామకు అండగా నిలిచారు. ‘‘సిద్ధాంతపరంగా నేను రఘురామతో విభేదించవచ్చుగాకా, కానీ ఒక సహచర ఎంపీగా ఆయనకు జరిగిన ఘటనలన్ని చూసి షాకయ్యాను. ఏపీ పోలీసుల తీరు నిజంగా ఉన్మాదంగా, క్రూరంగా ఉంది. ఒక ఎంపీ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించారంటే సామాన్య రాజకీయ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఏపీలో హిట్లర్ రాజ్యం నడుస్తోందా?'' అని మణికం ఠాగూర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

  English summary
  narsapuram ysrcp mp raghu rama krishnam raju, who is critic of ap cm ys jagan and out on bail in ap cid filed sedition case is no at delhi meeting several vips. raghu rama on thursday writes letter to parliamentary committee on Personnel, Public Grievances, Law and Justice, alleging that ap cid police had torched in,. mp also talks on ap cm ys jagan's schemes and court cases on ap govt. telangana congress incharge and tamilnadu congress mp manickam tagore stands with raghurama sand slams jagan as hitler raj.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X