• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!

|

దేశ ద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, విడుదల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ లో కులమతాలు, వర్గాల మధ్య చిచ్చురాజేసేలా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినప్పటికీ, సంబంధిత ఆదేశాల జారీలో ఆలస్యం ఏర్పడటం, ఆ వెంటనే వీకెండ్ కావడంతో విడుదల ఆలస్యమైంది. ఆదివారం రాత్రి ఎంపీని ఆయన కొడుకు భరత్, లాయర్లు కలుసుకున్నారు. మరోవైపు ఎంపీ అరెస్టు వ్యవహారంపై విపక్ష టీడీపీ, బీజేపీలు జగన్ సర్కారుపై అసాధారణ, సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. వివరాలివి..

  Raghu Rama Krishnam Raju పై పోలీసుల దాడి... షుగర్ వల్లే కాళ్లు అలా అంటూ YCP || Oneindia Telugu

  wife video: భార్య నగ్న వీడియో వైరల్ -భర్త ఆత్మహత్య -కృష్ణా జిల్లాలో ఘోరం -పోలీసులు ఏం చేశారంటే..wife video: భార్య నగ్న వీడియో వైరల్ -భర్త ఆత్మహత్య -కృష్ణా జిల్లాలో ఘోరం -పోలీసులు ఏం చేశారంటే..

  viral video: కలెక్టర్ శర్మ ఓవరాక్షన్ -లాక్‌డౌన్ పేరిట యువకుడిపై దాడి -వేటేసిన సీఎం -క్షమించాలంటూ..viral video: కలెక్టర్ శర్మ ఓవరాక్షన్ -లాక్‌డౌన్ పేరిట యువకుడిపై దాడి -వేటేసిన సీఎం -క్షమించాలంటూ..

   నేడు రఘురామ విడుదల!

  నేడు రఘురామ విడుదల!

  సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై తిరుగుబావుటా ఎగరేసిన వైసీపీ ఎంపీ రఘురామ.. గడిచిన ఏడాదిన్నరగా ఏపీ సర్కారును, ముఖ్యమంత్రిని తీవ్రస్థాయిలో దూషిస్తూ రావడం, పలు ప్రెస్ మీట్లలో ఆయన ఇచ్చిన పిలుపులు, చేసిన కామెంట్ల ఆధారంగా రఘురామపై ఏపీ సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేయడం తెలిసిందే. అయితే కస్టడీలో తనను కొట్టారని ఎంపీ ఆరోపించడం, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలు కావడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. దేశద్రోహం ఆరోపణలను కొట్టేయనప్పటికీ, ఎంపీకి కస్టడీ అవసరం లేదన్న సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ తరఫు న్యాయవాదులు సోమవారమే బెయిల్ పూచీకత్తును సీఐడీ కోర్టుకు సమర్పించనున్నారు. అనూహ్య పరిణామాలు తలెత్తకుంటే ఎంపీ రఘురామ సోమవారం సాయంత్రంలోగా సీఐడీ కస్టడీ నుంచి విడుదలవుతారు. ప్రస్తుతం..

  ఆర్మీ ఆస్పత్రికి ఎంపీ ఫ్యామిలీ..

  ఆర్మీ ఆస్పత్రికి ఎంపీ ఫ్యామిలీ..

  ప్రస్తుతం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఆయన కుటుంబీకులు ఆదివారం రాత్రి కలిశారు. రఘురామ తనయుడు భరత్ తోపాటు న్యాయవాదులు కూడా ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి ఎంపీని కలుసుకున్నారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిపై భరత్ ఆర్మీ డాక్టర్లతో మాట్లాడారు. సోమవారం నాటి బెయిల్ ప్రక్రియకు సంబంధించిన లాంఛనాలను ఎంపీ లాయర్లు పూర్తిచేసినట్టు తెలుస్తోంది. గుంటూరులోని సీఐడీ కోర్టులో ఆ మేరకు పత్రాలు సమర్పించి బెయిల్ ఆర్డర్ పొందనున్నారు. అనంతరం, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి రఘురామ డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే,

  అనుమానాస్పద మృతి తప్పిందంటూ..

  అనుమానాస్పద మృతి తప్పిందంటూ..

  వైసీపీ రెబల్ ఎంపీ ఉదంతంపై ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసాధారణ వ్యాఖ్యలు చేశారు. రఘురామను జైలులోనే ఉంచేదుంటే అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండేవారని భావిస్తున్నట్లు బీజేపీ నేత అన్నారు. అసెంబ్లీ సాక్షిగా రఘురామను దూషించిన ఎమ్మెల్యే జోగి రమేశ్ ను సీఎం జగన్ మెచ్చుకున్నారని, కేబినెట్ విస్తరణలో జోగికి మంత్రి పదవి ఖాయమని, ఎంపీని కొట్టిన అధికారులు, సిబ్బందికీ ప్రమోషన్లు వస్తాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. రఘురామ ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, ఎంపీ రఘురామ సీఐడీ కస్టడీలో థర్డ్‌డిగ్రీ ప్రయోగించినట్లు ఆర్మీ వైద్యుల నివేదికలో తేలిందని.. దీనిపై ముఖ్యమంత్రి, హోంమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ప్రశ్నించారు.

  English summary
  narasapuram ysrcp mp raghu rama krishnam raju likely tobe released on bail from cbi custody on monday. as supreme court gave him conditional bail in sedition case filed by ap cid, counsel of mp to fulfill bail process today. meanwhile, raghu rama's son bharatha along with advocate meets mp at secunderabad army hospital on sunday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X