• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ బెయిల్ రద్దు: ఇంకొద్ది గంటల్లో -సాయిరెడ్డి స్థానంలో ఉమ్మారెడ్డి -రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిలపైనా

|

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ దిశగా కీలక పరిణామాలు జరగబోతున్నాయని చెప్పారు. 11 చార్జిషీట్లలో ఏ1 జగన్.. సహ నిందితులకు పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టడం, ఐఏఎస్ అధికారుల ఏసిర్ రిపోర్టును తానే రాస్తానడం, రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో నిబంధనలు మీరిన కారణంగా ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు ఇంకొద్ది గంటల్లోనే విచారించనున్నట్లు రఘురామ తెలిపారు. బుధవారం నాటి 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో జగన్ బెయిల్, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, వైఎస్ షర్మిల రాజన్నరాజ్యం, ఏపీలో కరోనా విలయం, తిరుపతి బైపోల్ తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

భార్గవ్ రేప్ కేసుతో సంబంధం లేదు -ఏడాదిగా అతను కాంటాక్ట్‌లో లేడు: omg నిత్యశ్రీ కీలక సందేశంభార్గవ్ రేప్ కేసుతో సంబంధం లేదు -ఏడాదిగా అతను కాంటాక్ట్‌లో లేడు: omg నిత్యశ్రీ కీలక సందేశం

 రామరాజ్యం-రాజన్న రాజ్యం

రామరాజ్యం-రాజన్న రాజ్యం

‘‘భారతజాతి ఆరాధ్యదైవం శ్రీరాముడి జన్మదినం, పెళ్లిరోజును కూడా రామనవమిగా జరుపుకొంటున్న సందర్బంలో కొత్తగా పుట్టుకొచ్చిన రాజన్న రాజ్యం అందర్నీ ఆలోచింపజేస్తున్నది. పితృవాక్య పరిపాలన, నమ్ముకున్నవారి పాలిట గొప్ప నాయకుడిగా, ప్రజారంజక పారిపాలకుడిగా శ్రీరాముడికి ఎన్నో సద్గుణాలున్నాయి. రామరాజ్యం కాని రాజన్న రాజ్యం ట్రెండ్ ను మా వైసీపీ వాళ్లు ప్రారంబించారు. చీప్ లిక్కర్ అమ్మకం, ఇసుక దందాలు, ఖజానాలో పైసా లేకపోయినా వీలైనంత మేరలో ప్రజల ఆస్తుల్ని తాకట్టుపెట్టి, అప్పులతో సంక్షేమాన్ని నడిపించేదే రాజన్న రాజ్యామని మావాళ్లు ఫీలవుతున్నట్లున్నారు. ఏపీలో ఏ ఒక్కరూ ఇష్టపడని ఈ రాజన్న రాజ్యం కాన్సెప్టును...

 వైఎస్సార్ ఇంత దరిద్రం కాదు

వైఎస్సార్ ఇంత దరిద్రం కాదు

ఏపీలో నడుస్తోన్న రాజన్న రాజ్యం చాలదన్నట్లు ఇదే మోడల్ ను తెలంగాణలోనూ తెస్తానంటూ జగన్ సోదరి వైఎస్ షర్మిల బయలుదేరారు. అసలు రాజన్న రాజ్యం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన మోడలా? లేక ఆయన పిల్లలు క్రియేట్ చేసిన మోడలా? ఎందుకంటే ఇప్పుడు వైఎస్సార్ పరిపాలన ఇంత దరిద్రంగా చేయలేదన్నది కాదనేలని వాస్తవం. కాబట్టి, రాజన్న కొడుకు, కూతరులు చేసేదే రాజన్న రాజ్యం తప్ప, అది వైఎస్సార్ మోడల్ కాదని చెప్పండి. వైఎస్సార్ నిజంగానే రామరాజ్యానికి దగ్గరగా పాలన అందించిన గొప్ప నేత. నిజానికి రావణాసురుడు కూడా గొప్ప రాజే అని, రావణుడు మరణశయ్యపై ఉండగా, అతని దగ్గరికెళ్లి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని శ్రీరాముడే లక్ష్మణున్ని పంపుతాడు. అంటే ప్రత్యర్థిలోనూ గొప్ప తనాన్ని చూసేది రాముడి తత్వమైతే, మా వైసీపీ నేతల సంకుచిత మనస్తత్వానికి నిన్నొక ఉదాహరణ కనిపించింది..

 సాయిరెడ్డి బదులు ఉమ్మారెడ్డి..

సాయిరెడ్డి బదులు ఉమ్మారెడ్డి..

ప్రతిపక్ష నేత చంద్రబాబు మా వైసీపీకి ప్రత్యర్థేకానీ శత్రువు కాదు. చంద్రబాబుపై పెద్దగా ప్రేమ లేకపోయినా సీఎం జగన్ కొంత సంస్కారంతో టీడీపీ అధినేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అదే వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి మాత్రం తన నీచనికృష్ణదరిద్రపు ట్వీట్లతో పార్టీ పరువు బజారుకీడ్చారు. చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పడం ఇష్టం లేకుంటే కామ్ గా ఉండాలికానీ వెకిలి రాతలతో సాయిరెడ్డి చేసిన పనిని దాదాపు అందరూ తిట్టిపోశారు. ఇతరుల్ని గౌరవిస్తేనే సమాజంలో మనకు గౌరవం దక్కుతున్నందన్న సోయిలేని సాయిరెడ్డిని ఇంకా పార్టీ పదవిలో కొనసాగిస్తే జగన్ కు ఉన్న పరువు కూడా పోవడం ఖాయం. సాయిరెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించి, కనీస సంస్కారం ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి పెద్దలెవరినైనా నియమించాలి. సాయిరెడ్డి దగుల్బాజీ ట్వీట్ల వల్ల 15 శాతం న్యూట్రల్ ఓటింగ్ వైసీపీకి దూరమయ్యే ప్రమాదముంది. రీటెండరింగ్ ప్రక్రియతో పోలవరం ప్రాజెక్టుపై 700కోట్లు ఆదాచేశామన్న వైసీపీ.. ఇవాళ అదే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1750కోట్లు పెరిగినందుకు ఏమని సమాధనం చెబుతుంది? దీనిపై వార్తలు రాస్తే కులం ముద్రలేసి సాయిరెడ్డి విమ్శలు చేయడమేంటి?

ఏపీ సీఎంకు నోబెల్ పురస్కారం

ఏపీ సీఎంకు నోబెల్ పురస్కారం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మరణాలపై చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవానికి పొంతన లేదు. చాలా చోట్ల స్మశానాల్లో తగలబడుతోన్న శవాలే ఇందుకు నిదర్శనం. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉంటే, జగన్ తానేదో సంస్కర్తలాగా, దేశమంతా నడిచే దారిని కాదని పదోతరగతి, ఇంటర్ పరీక్షలు పెడతానని చెబుతున్నాడు. రెండో దశ వ్యాప్తిలో చిన్న పిల్లలు కూడా వైరస్ ప్రభావానికి లోనవుతున్నారనేకాదా, 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్రం చెబుతోంది. మరి జగన్ ఏం సాధించాలని పరీక్షలు పెడుతున్నాడు? ఈ ప్రక్రియలో ఎవరైనా పిల్లలు లేదా వారి కుటుంబీకులు కరోనా వల్ల చనిపోతే అందుకు సీఎం బాధ్యత వహిస్తాడా? పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందుకు ఏపీ సీఎంకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని సలహాదారులు స్విడన్ ప్రభుత్వానికి లేఖలు రాయబోతున్నారా? ఇటు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల ప్రహాసనంపై బీజేపీ అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్రమాలుజరిగాయని వైసీపీ నేతలు కూడా ఆరోపించారు. మరి మాళ్లు కూడా న్యాయం కోసం పిటిషన్ వేస్తే నిజానిజాలు బయటికి వస్తాయి కదా, దొంగ ఓట్ల వ్యవహారం తేలకుండా తిరుపతి ఫలితం వెల్లడైతే దానికి ప్రజాస్వామ్యంలో విలువ ఉన్నట్లవుతుందా? ఇక..

జగన్ బెయిల్ రద్దుపై విచారణ

జగన్ బెయిల్ రద్దుపై విచారణ

ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని తన కేసులను తీవ్రంగా ప్రభావితం చేస్తూ, అన్నీ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోన్న జగన్ మోహన్ రెడ్డికి వెంటనే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో నేను దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుంది. గురువారం (ఏప్రిల్ 22న) మధ్యాహ్నమే ఆ పిటిషన్ ను కోర్టు విచారించనుంది. మొన్నటిదాకా అన్ని కోర్టుల్లో విచారణలు నేరుగానే సాగాయి, కరోనా పరిస్థితుల వల్ల జగన్ బెయిల్ రద్దుపై విచారణ వర్చువల్ పద్ధతిలోనే జరుగనుంది. కోర్టు ఆదేశాలను బట్టి మరిన్ని ఆధారాలను సమర్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. విచారణలో ఏం జరిగిందో రేపు అన్నీ వివరంగా చెబుతాను'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

గంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనాగంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనా

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju told that his petition in cbi court to cancell bail of ap cm ys jagan will come to hearing on thrusday. speaking through social media on wednesday, the rebel mp slams cm jagan, mp vijayasai reddy over several issues. raghurama also suggests ys sharmila not to say rajanna rajyam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X