• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌పై రఘురామ బిగ్‌బాంబ్‌- మీ కేసులకూ వందరోజులే- పిచ్చోళ్లకు నో ఛాన్స్‌-పది క్యాన్సిల్‌

|

ఏపీలో కరోనా సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సొంత ప్రభుత్వంపై రెచ్చిపోయారు. ముఖ్యంగా కరోనాలో పదో తరగతి పరీక్షలకు పట్టుబడుతున్న సీఎం జగన్, మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు వాలంటీర్లకు సన్మానాలు చేస్తున్న మంత్రులపైనా, అవినీతి అదికారులపై విచారణకు వంద రోజుల డెడ్‌లైన్ పెట్టిన ముఖ్యమంత్రిపైనా ఆయన సంచలన విమర్శలు చేశారు. జగన్ మానసిక పరిస్దితిపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని రఘురామ ఆరోపించారు.

 జగన్‌, మంత్రులపై రఘురామ బిగ్ బాంబ్‌

జగన్‌, మంత్రులపై రఘురామ బిగ్ బాంబ్‌


ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ఏపీలో వైసీపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు చూస్తుంటే పాలకులకు పిచ్చెక్కినట్లు ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయని, అలాంటి వారికి రాజ్యాంగ పదవుల్లో కొనసాగే అర్హత లేదని రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు. పదో తరగతి పరీక్షలతో మొదలుపెట్టి, కరోనాలో వాలంటీర్లకు సన్మానాలు, ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు, జగన్ ఆస్తుల కేసుపై రఘురామ చేసిన కామెంట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

కరోనాలో పరీక్షలు మూర్ఖపు నిర్ణయమే

కరోనాలో పరీక్షలు మూర్ఖపు నిర్ణయమే

కరోనా సమయంలో ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించి తీరుతామంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చే్స్తున్న ప్రకటనలపై వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారికి పిచ్చెక్కిందని సురేష్ చేసిన విమర్శలకూ కౌంటర్ ఇచ్చారు. ఎవరికి పిచ్చెక్కిందో ప్రజలు చూస్తున్నారని రఘురామ అన్నారు. దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దయితే, ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహించడం మూర్ఖపు నిర్ణయం కాక మరేమిటన్నారు. అసలు మీరు, మీ ముఖ్యమంత్రి ఇంత మూర్ఖంగా ఉండటానికి గల కారణాలేంటో అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు.

 వాలంటీర్లకు కరోనాలో సన్మానాలా ?

వాలంటీర్లకు కరోనాలో సన్మానాలా ?

ఎన్నికల్లో మీకు సహకరించిన వాలంటీర్లకు ముఖ్యమంత్రి సన్మానం చేశారని, ఇప్పుడు ఆయన బాటలోనే మంత్రులు కరోనా వ్యాప్తి చెందుతున్నా పట్టించుకోకుండా సన్మాన కార్యక్రమాలు పెడుతున్నారని రఘురామరాజు విమర్శించారు. కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వారిని ప్రజలు పశువులతో పోలుస్తున్నారని రఘురామ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఇలాంటి సన్మానాలతో కరోనా మరింత వ్యాపించే ప్రమాదం ఉందన్నారు.

జగన్‌కు పిచ్చెక్కిందన్నఅనుమానాలు

జగన్‌కు పిచ్చెక్కిందన్నఅనుమానాలు

కరోనాలో పదో తరగతి పరీక్షలు, వాలంటీర్లకు సన్మానాలతో సీఎం జగన్‌కు పిచ్చెక్కిందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని రఘురామకృష్ణంరాజు అన్నారు. పాలకుడైన సీఎం, లేదా ఆయనతో పాటు ఉన్న పాలకులైన మంత్రులకు పిచ్చెక్కిందన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయని రఘురామ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఓ రాజ్యాంగం చదువుకోవాలని వారికి సూచించారు. పాలకుడు మానసిక స్దితి కోల్పోతే పాలనకు అర్హులు కాదని రాజ్యాంగం చెబుతోందని అన్నారు. ప్రజలకు దయచేసి ప్రజలకు ఇలాంటి అనుమానాలు కల్పించవద్దని జగన్‌ను రఘురామ కోరారు.

జగన్‌ను ట్రంప్‌తో పోల్చిన రఘురామ

జగన్‌ను ట్రంప్‌తో పోల్చిన రఘురామ

గతంలో ట్రంప్‌ మీద కూడా ఇలాంటి అభియోగాలే వచ్చాయని, ఆయన పరీక్షకు సిద్దం కాలేదని, ఇక్కడ కోర్టులో కేసు వేస్తే వైద్య పరీక్ష చేయించుకోవచ్చని సీఎం జగన్‌కు రఘురామకృష్ణంరాజు సూచించారు. కానీ 30 ఏళ్లు పాలించాలని భావిస్తున్న వ్యక్తి ఇలా ఐదేళ్లలోనే ఇలా ముద్ర వేసుకుని ఎందుకు వెళ్లాలని కూడా ప్రశ్నించారు. మిమ్మల్ని దేవుడి కంటే ఎక్కువగా భావిస్తున్న చుట్టూ ఉన్న వాళ్లతో దేవుడి కంటే ఎక్కువగా పొడిగించుకోవడం కూడా మానసిక స్దితి వైకల్యానికి నిదర్శనమేనని రఘురామ వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాకముందు ప్రతీ దానికీ బాధనిపిస్తోంది, బాధనిపిస్తోందని చెప్పిన జగన్‌కు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్ధితులు చూస్తుంటే బాధ అనిపించడం లేదా అని రఘురామ ప్రశ్నించారు.

అమూల్‌ కోసమే ధూళిపాళ్ల అరెస్ట్‌

అమూల్‌ కోసమే ధూళిపాళ్ల అరెస్ట్‌

రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తున్న ఓ డెయిరీ అధినేతను ఇవాళ ఉదయం ఏసీబీ అరెస్టు చేసిందని, సంగం డెయిరీ అక్రమాల పేరుతో ఆయన్ని అరెస్టు చేశారని, కానీ అంతా అమూల్ కోసమే అనుకుంటున్నారని రఘురామ ఆరోపించారు. ధూళిపాళ్ల అరెస్టు కక్షతోనా, అమూల్ కోసమా.. ఈ రెండు కలిపి నిర్ణయం తీసుకున్నారా అన్నది ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధూళిపాళకు జైల్లో కరోనా రాకుండా చూసుకోవాల్సిన బాథ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు.

జగన్‌ కేసులూ వందరోజుల్లో తేలాల్సిందే

జగన్‌ కేసులూ వందరోజుల్లో తేలాల్సిందే


సీఎం జగన్‌పై ఎన్నో అవినీతి కేసులు మీపై ఉన్నాయని, ఆయన కడిగిన ముత్యంగా బయటికి రావాలని కోరుకుంటున్నా అని రఘురామ మరోసారి తెలిపారు. ఏడాదిన్నరగా మీరు కోర్టుకే వెళ్లలేదు, మీ కేసులో పెండింగ్‌లో ఉండాలి, మిగిలిన కేసులు మాత్రం వందరోజుల్లో తేలిపోవాలా అని జగన్‌ను రఘురామ ప్రశ్నించారు. మీకు రెండు కొమ్ములున్నాయా అని నిలదీశారు. మీ కేసులు కూడా వందరోజుల్లో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ఊరందరికీ ఓ న్యాయం, సీఎంకు ఓ న్యాయమా అని ప్రజల్లోనూ చర్చ జరుగుతోందన్నారు.

English summary
ysrcp rebel mp raghurama krishnam raju on today made shocking remarks on cm jagan over his decision on continuation of 10th exams in covid time and volunteers feliciations also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X