వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు రఘురామ లెటర్స్‌ సిరీస్‌- నెరవేరని హామీలపై- ఈ సారి లేఖలో టార్గెట్ అవే

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధినేత కమ్‌ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు పార్టీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్ల పెంపు, సీపీఎస్‌ రద్దు వంటి నెరవేరని హామీలపై ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసే విధంగా లేఖలు రాస్తున్న రఘురామ ఇవాళ మరో హామీని ఎంచుకుని జగన్‌కు లేఖ రాశారు. దాదాపు ఎన్నికల హామీలన్నీ నెరవేర్చినట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్న నేపథ్యంలో రఘురామ లేఖలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Recommended Video

#TopNews : AP Exams - ప్రభుత్వానికి ,పేరెంట్స్ కి మధ్య Communication Gap | Oneindia Telugu

వైసీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే మొత్తాల పెంపు కూడా ఒకటి. ఈ పథకాల కింద ఇచ్చే మొత్తాల్ని లక్ష రూపాయలకు పెంచుతామని వైసీపీ హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఈ హామీ నెరవేరలేదని రఘురామకృష్ణంరాజు తన తాజా లేఖలో సీఎం జగన్‌ను ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఈ రెండు పథకాలకు ఇచ్చే మొత్తం పెంచుతామని జగన్ ఇచ్చిన హామీని లేఖలో రఘురామ ప్రస్తావించారు.

ysrcp mp raghurama raju third letter to cm jagan, questions marriage schemes promise

ప్రభుత్వం ఎన్నికల హామీల్ని దాదాపుగా నెరవేర్చినట్లు వైసీపీ నేతలు చెప్పుకుంటున్న నేపథ్యంలో ఏయే హామీలు నెరవేరలేదో ప్రతి రోజూ సీఎం జగన్‌కు లేఖల రూపంలో రఘురామరాజు బయటపెడ్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా దీనిపై ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ రఘురామను టార్గెట్‌ చేస్తూ మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన తాజా లేఖలపై మాత్రం మౌనం వహిస్తున్నారు. అటు రఘురామ కూడా ఏదో ఒక అంశంతో నిత్యం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ లైవ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
ysrcp rebel mp raghurama krishnam raju on today send another letter to chief minister ys jagan questioning party's poll promises on hike of pelli kanuka and shadi mubarak schemes help.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X