వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యతోనే అలా: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు -సాయిరెడ్డికి తోడు దొంగ

|
Google Oneindia TeluguNews

దేశ ద్రోహం ఆరోపణలపై ఏపీ సీఐడీ సుమోటోగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదు చేయడం, అరెస్టు తర్వాత సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో రెబల్ ఎంపీ విడుదల కావడం తెలిసిందే. బెయిల్ షరతులున్నా, సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై పదే పదే విమర్శలు చేస్తోన్న రఘురామ.. మరోసారి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను టార్గెట్ చేశారు. ఐపీఎస్ అధికారి వ్యక్తిగత విషయాలనూ ప్రస్తావిస్తూ, ఆయనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో అనుచిత సంబధాలున్నాయని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామ అధికారిక సోషల్ మీడియాలోనూ ప్రసారమైన ప్రెస్ మీట్ లో ఆయనమన్నారో యథాతథంగా అందిస్తున్నాం..

జగన్ ఆకాశం.. నేనొక ఆఫ్ట్రాల్ గాడిని -విజయమ్మ మాటతో బెయిల్ రద్దుకు-సాయిరెడ్డి బాగోతం: రఘురామజగన్ ఆకాశం.. నేనొక ఆఫ్ట్రాల్ గాడిని -విజయమ్మ మాటతో బెయిల్ రద్దుకు-సాయిరెడ్డి బాగోతం: రఘురామ

కలాం‌ను చూసిన కళ్లతో

కలాం‌ను చూసిన కళ్లతో


''అబ్దుల్ కలాం ఆరోవ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి. అలాంటి మహాను భావుణ్ని చూసిన కళ్లతో ఇవాళ కొందర్ని చూడటం అసహ్యకరంగా ఉంది. సాక్షి పత్రికలో ఇవాళ విజయసాయిరెడ్డి ట్వీట్ ను వార్తగా వేశారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతామన్ ను వైసీపీ బృందం కలిసినట్లు వార్త రాస్తే, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చీఫ్ గుర్రం దేవేందర్ రెడ్డి మాత్రం 'విగ్గురాజు హవాలా లావాదేవీలపై నిర్మలను కలిసిన ఎంపీలు'అని అదే ఫొటోను ట్వీట్ చేశారు. ఈ రెండిటిలో ఏది నిజమో ప్రజలే నిర్ణయించాలి. ఒక కులానికి రీహ్యాబిలిటేషన్ సెంటర్ లా మారిన ఏపీ డిజిటల్ మీడియా కార్పొరేషన్ కు అధిపతి ఈ ట్వీట్ ఏ హోదాలో చేశాడో మరి, సదరు ఎంపీలు నాపై చేసిన ఫిర్యాదులు, ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు సంబంధం ఏంటంటే..

జగన్ బెయిల్ రద్దు: అదే చివరి ఛాన్స్ -సీబీఐ లాయర్లపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలుజగన్ బెయిల్ రద్దు: అదే చివరి ఛాన్స్ -సీబీఐ లాయర్లపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలు

భార్యతోనే అలా చేసిన ఘనుడు..

భార్యతోనే అలా చేసిన ఘనుడు..

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై నేను ఈనెల 7న కేంద్రానికి ఫిర్యాదు చేశాను. అరెస్టు సమయంలో నా ఫోన్ లాక్కున్న సునీల్.. అందులో నుంచి ఇతరులకు మెసేజ్ లు పెట్టారు. నిజానికి ఆయన భార్యతోనూ సునీల్ కుమార్ ఇలానే చేశాడు. పెళ్లయిన సునీల్ కు భార్యతో స్పర్థలు రావడం, టెక్నాలజీపై మంచి పట్టున్న ఆయన.. భార్య కంప్యూటర్ ద్వారా వేరే వాళ్లకు మెసేజ్ లు పెట్టిన ఘనుడు. ఇదంతా రికార్డుల్లో ఉంది. ఇక నా ఫోన్ విషయానికొస్తే.. మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ హెచ్చరికతో నా ఫోన్ నుంచి మెసేజ్ లు వెళుతున్నట్లు గుర్తించి, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా ఫోన్ ద్వారా సునీల్ కుమార్ పలు మెసేజ్ లు పంపారు. గతంలో జడ్జిలపై కామెంట్ల వివాదంలోనూ ఇలానే జరిగింది. పెగాసస్ స్పైవేర్ వాడుతూ జగన్ ప్రభుత్వం విశృంఖలంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లుంది.

సాయిరెడ్డికి ఈయన తోడు దొంగా?

సాయిరెడ్డికి ఈయన తోడు దొంగా?

సునీల్ కుమార్ కావొచ్చు ఇంకెవరైనా తప్పుడు పనిచేసినా అందంగా కాకుండా మరీ ఘోరంగా చేస్తున్నారు. నాకు ఎవరితోనే సంబంధాలున్నాయని, ఒక దగ్గర్నుంచి నాకు అమౌంట్ వస్తోందని మెసేజ్ లు సృష్టించారు. ఆ మెసేజ్ ఆధారంగా నా ఖాతాలోకి డబ్బులు వచ్చేసినట్లు భావించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారట, ఆ పిటిషన్ కాపీ సాక్షి చేతికి వస్తే పేపర్ లో ప్రచురించారట. అసలు సునీల్ కుమార్ ఫిర్యాదు సాక్షికి ఎలా అందింది? అదే ఫిర్యాదు విజయసాయి రెడ్డి చేతికి ఎలా దొరికింది? అంటే సునీల్-సాయిరెడ్డి తోడుదొంగలా? సునీల్ కుమార్.. ఈడీలోని ఒక జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ కు ఫిర్యాదు ఇస్తే, అది వైసీపీ దొంగల చేతికి ఎలా వచ్చింది? ఈ ఫిర్యాదుల మీద బ్లాక్ మెయిల్ వ్యవహరాలు కూడా నడుస్తున్నాయని నాకు తెలిసింది. త్వరలో వివరాలు బయటపెడతా.

వాళ్ల లెక్క ప్రకారం కూడా డబ్బు అందలేదు

వాళ్ల లెక్క ప్రకారం కూడా డబ్బు అందలేదు

బేసిగ్గా నాపై పెట్టాలనుకున్నది ఫ్రాడ్ కేసు, బెయిల్ పై ఉన్న సునీల్ కుమార్ ఇలా ఫిర్యాదు కాపీని వైసీపీ నేతలకివ్వడమేంటి? ఇదంతా 120బి కుట్రకోణం కిందికి వస్తుంది. వీళ్లందరిపైనా నేను ఫిర్యాదు చేయబోతున్నాను. నాలుగేళ్ల కిందటే జగన్ సీఎం అవుతాడని, సాయిరెడ్డి సలహాదారుడు అవుతాడని నేను ఊహించి, ఓ టీవీ ఛానల్ లో కలిసి కుట్ర చేస్తానా? ఇదొక కేసా? ఆ డబ్బులేదో మీరే ఇవ్వండి మరి. సునీల్ కుమార్ నా ఫోన్ దొంగిలించి దాని ద్వారా తప్పుడు మెసేజ్ లు పంపుతున్నాడని, మతాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యల తాలూకు వీడియోల ఆధారాలతో నేను చేసిన ఫిర్యాదుపై కేంద్ర హోం శాఖను దర్యాప్తు చేయాల్సిందిగా డీవోపీటీ శాఖ ఆదేశించినట్లు నాకు సమాచారం అందింది. ఎవడూ తప్పించుకోలేడు. ఈ వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు కూడా వేయాలని సుప్రీంకోర్టులో నేను పిటిషన్ వేస్తా

నేరగాళ్లు నీతులు వల్లించడమా?

నేరగాళ్లు నీతులు వల్లించడమా?


సునీల్ కుమార్ పై గతంలో భార్య(అడ్వొకేట్ అరుణ)ను వేదించినందుకు గృహహింస చట్టం కింద కేసు నమోదైంది. ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆయనపై చార్జిషీట్ దాఖలైంది. అయితే, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ఆయనో పిటిషన్ పెట్టుకున్నారు. ఆ కేసులో సునీల్ ఇప్పటికీ నిందితుడే, బెయిల్ పై ఉన్నట్లే లెక్క. అలాంటి నేరస్తుడు ఇవాళ సీబీసీఐడీని నడిపిస్తూ, నేరగాళ్లైన ఏ1, ఏ2లు కలిసి నీతులు వల్లిస్తున్నారు. వీళ్లంతా బెయిల్ ఆర్టిస్టులు. వీళ్లకేమీ పని లేనట్లు కేంద్ర మంత్రి నిర్మలకు ఫిర్యాదు ఇవ్వడమా? దీనిపై పరువునష్టం దావానా, మరొకటా కచ్చితంగా పోరాటం చేస్తాను'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju made sensational alligation on ap cid chief sunil kumar and ysrcp mp vijaya sai reddy. speaking to media in delhi on tuesday, the rebel mp alleged that cid chief has done dirty things by using technology and collide with vijayasai reddy. regarding these incidents, raghurama said he is going to file a complaint with supreme court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X