వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్

|
Google Oneindia TeluguNews

దేశ ద్రోహం కేసు, అరెస్టు, అనర్హత వేటుపై ఆందోళనల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. అనర్హతపై లోక్ సభ స్పీకర్ ఎంతకూ నిర్ణయం తీసుకోకపోవడంతో వైసీపీ రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీలను ఆశ్రయించింది. రఘురామ అక్రమాలు, ఆయన కంపెనీల్లో అవకతవకలపై విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీల బృందం లేఖలు రాసింది. ఈ వ్యవహారంపై రెబల్ ఎంపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ, జగన్, సీబీఐ, సాయిరెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు..

మమతా బెనర్జీ అనూహ్య ఎత్తుగడ -టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక - బెంగాల్‌కు కొత్త సీఎం?మమతా బెనర్జీ అనూహ్య ఎత్తుగడ -టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక - బెంగాల్‌కు కొత్త సీఎం?

షాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూషాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూ

 వైసీపీ అనూహ్య ఎత్తుగడ..

వైసీపీ అనూహ్య ఎత్తుగడ..

రెబల్ ఎంపీ రఘురామ విషయంలో వైసీపీ అనూహ్య చర్యకు పాల్పడింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసగించి 3 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైన కేసులో ఆ కంపెనీల డైరెక్టర్లయిన ఎంపీ రఘురామ, ఇతరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు ఫిర్యాదు చేశారు. రఘురామ కంపెనీలైన ఇండ్‌-భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌, అనుబంధ సంస్థలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాయని, ఎంపీ సహా సదరు డైరెక్టర్లు దేశం విడిచి పారిపోకుండా ప్రయాణాలపై నిషేధ ఉత్తర్వులివ్వాలని వైసీపీ కోరింది. అంతేకాదు, రఘురామ ఆర్థిక అక్రమాల కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ వ్యవహరిస్తోన్న తీరు సక్రమంగా లేదని, దీనివల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని వైసీసీ మోదీకి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై..

 దొంగలు నాపై ఫిర్యాదు చేయడమా?

దొంగలు నాపై ఫిర్యాదు చేయడమా?

రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు వైసీపీ ఎంపీలు లేఖలు రాయడంపై రెబల్ రఘురామ తీవ్రంగా స్పందించారు. తాను బ్యాంకు రుణాలు ఎగవేశానని, చర్యలు తీసుకోవాలని.. జగన్, విజయసాయిరెడ్డిలు ప్రధాని మోదీ, రాష్ట్రపతికి లేఖరాయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు. సుమారు 17 కేసుల్లో ఏ1గా ఉన్న వైఎస్ జగన్, ఏ2 విజయసాయిరెడ్డిలకు సుదీర్ఘ నేరచరిత్ర ఉందని, వీళ్లిద్దరిపై రూ.43 వేల కోట్లు దోచారన్న అభియోగాలతో చార్జిషీట్లు ఉన్నాయని, ఇలాంటి దొంగలు నాపై ఫిర్యాదు చేయడమేంటని రఘురామ మండిపడ్డారు. అంతేకాదు,

Recommended Video

CM Jagan Delhi Tour In Next Week Becoming Crucial In AP Politics | Oneindia Telugu
 సీబీఐ జేడీ చేసింది తక్కువ..

సీబీఐ జేడీ చేసింది తక్కువ..

''నాపై ప్రధానికి చేసిన ఫిర్యాదులో సీబీఐ తీరును కూడా జగన్ పార్టీ ఎండగట్టింది. అసలు ఏ నిందితుడైతే సీఎంగా ఉంటూ, మాట్లాడేవాళ్లపై పనికిమాలిన కేసులు పెట్టి వేధిస్తూ, ఎంతో మంది చావులకూ కారకుడయ్యాడో, ఆయన నా గురించి లేఖ రాయడం విడ్డూరంగా ఉంది. నిజానికి జగన్‌ అక్రమాలకు సంబంధించిన కేసుల్లో అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసింది చాలా తక్కువ. జగన్ లూటీలకు సంబంధించిన మొత్తం వివరాలను నేను కోర్టుకు అందించాను. అవే వివరాలను ప్రధాని మోదీ, రాష్ట్రపతికి కూడా వివరిస్తాను'' అని రఘురామ అన్నారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నదని ఏపీ లేదా ప్రజా సమస్యలపై కాదని, కేవలం తనపై అనర్హత వేటు వేయించడానికే ప్రయత్నిస్తున్నారని రఘురామ ఆరోపించారు.

English summary
as Vijayasai Reddy and other ysrcp MPs have written to the Prime Minister Narendra modi to take action on mp Raghurama krishnam raju and his companies, the rebel mp reacted strongly. speaking to media, raghu rama said, it is insane that a1 jagan, a2 vijayasai made allegations against him. raghurama said that he will write to pm modi more with more evidences than cbi jd laxminarayana found in ys jagan cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X