• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామ

|

సొంత పార్టీపై, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు. రెబల్ ఎంపీపై అనర్హత వేటు తప్పదని, ఆ వెంటనే విదేశాలకు పారిపోయేందుకు రెడీ అవుతున్నాడని వైసీపీ పార్టమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించగా, పారిపోయేది తాను కాదని, సాయిరెడ్డే అని, ఎంపీకి దేహశుద్ది కూడా జరిగిందని రఘురామ అనూహ్య కౌంటరిచ్చారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ.. జగన్ బెయిల్ రద్దు విచారణ, పోలవరం ప్రాజెక్టు, టీడీపీ నేతలపై కేసులు, సాయిరెడ్డి ఆరోపణలపై స్పందించారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే....

ఎంపీ రఘురామ పరారీకి రంగం సిద్ధం -చంద్రబాబు పక్కా స్కెచ్ -మిగిలేది ఇద్దరే: వైసీపీ సాయిరెడ్డిఎంపీ రఘురామ పరారీకి రంగం సిద్ధం -చంద్రబాబు పక్కా స్కెచ్ -మిగిలేది ఇద్దరే: వైసీపీ సాయిరెడ్డి

పోలవరంపై డ్రామా, టార్గెట్ ఇదే

పోలవరంపై డ్రామా, టార్గెట్ ఇదే

‘‘ఏపీ వరదాయిని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన అంచనాలు(రూ.47వేల కోట్ల)కు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని, విజయసాయిరెడ్డి పోరాటం వల్లే అది జరిగిందని జగన్ మీడియా సాక్షి పత్రికలో రాశారు. సరిగ్గా ఇదే వార్త.. 47వేల కోట్లకు జల శక్తి ఆమోదం తెలిపిందని 2020, సెప్టెంబర్ లోనూ రాశారు. అంటే, ఎప్పుడో లభించిన ఆమోదానికి మళ్లీ వీళ్లు ఆమోదం తెచ్చుకున్నారన్నమాట. ఆమోతం తెలిపినంత మాత్రాన డబ్బులు ఇచ్చేది జల శక్తి శాఖ కాదు, ఆర్థిక శాఖ ఇప్పటికే కొర్రీలు పెట్టింది. ఎవర్ని మోసం చేయడానికి ఇలా పోలవరంపై డ్రామాలాడుతున్నారు? మా వాళ్ల అసలు టార్గెట్ నాపై అర్హతవేటు వేయించడమే తప్ప పోలవరం, ఏపీ ప్రయోజనాలు వైసీపీకి ప్రయారిటీ కావు.

జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలుజగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలు

దేవినేని ఉమపై 14 సెక్షన్లా?

దేవినేని ఉమపై 14 సెక్షన్లా?

ఏపీలో రివర్స్ టెండరింగ్ మాదిరిగా రివర్స్ కేసుల ఒరవడి నడుస్తోంది. ఓ ప్రముఖుడి ఇంటి దగ్గర రోడ్డుపై గుంతలు పడితే, చిన్న గుంగలు పూడ్చడానికి ఏకంగా జాతీయ రహదారిని అడుగుల లోతులో తొవ్వి, దాన్ని పూడ్చడానికి అవసరమైన కంకర కోసం మైనింగ్ చేస్తున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఆకలేస్తే దొంగతనం చేయడం తప్పా? అని జులాయి సినిమాలో బ్రహ్మానందం అడిగినట్లుగా ఉందీ వ్యవహారం. అక్రమ మైనింగ్ ను ప్రశ్నించినందుకు టీడీపీ నేత దేవినేని ఉమపై రివర్స్ కేసులు పెట్టారు. దెబ్బతిన్నవాడిపైనే కేసులు.. సంబంధం లేని విషయాలూ చొప్పించి ఏకంగా 14 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇక జగన్ బెయిల్ రద్దు కేసు విషయానికొస్తే..

సీబీఐ లాయర్లకు జ్వరం తగ్గింది..

సీబీఐ లాయర్లకు జ్వరం తగ్గింది..

జ్వరం కారణంగా సోమవారం నాటి విచారణకు హాజరుకాలేకపోయిన ఇద్దరు సీబీఐ లాయర్లు మంగళ, బుధవారాల్లో కోర్టుకు హాజరైనట్లు తెలిసింది. ఇంకొద్ది గంటల వరకు, అంటే శుక్రవారం వరకూ వాళ్లు ఆరోగ్యంగా ఉండి, కోర్టుకు వాదనలు సమర్పిస్తే జగన్ బెయిల్ రద్దుపై నిర్ణయం వెలువడే అవకాశముంది. అసలు ఇన్ని వాయిదాలు కోరడం, లిఖిత పూర్వక కౌంటర్ దాఖలుకు ఇంత సమయం తీసుకోవడంపై సుప్రీంకోర్టు జడ్జిలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రపంచంలో ఎక్కడా మనలా కోర్టు సమయాన్ని వృథా చేయబోరని, అమెరికాలోనైతే మూడు పేజీలకు మించని కౌంటర్, 30 నిమిషాల్లోపే వాదనలు పూర్తి చేయాలనే రూల్ ఉందని సుప్రీంజడ్జిలు వ్యాఖ్యానించారు. ఆ స్ఫూర్తితో సీబీఐ లాయర్లు కూడా త్వరగా పని పూర్తి చేయాలి.. చివరిగా..

ఇంకొద్ది గంటల్లో తేలుతుంది..

ఇంకొద్ది గంటల్లో తేలుతుంది..

సీబీఐ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రేపు కోర్టులో వేసే కౌంటర్ ను బట్టి ఏ1 జగన్, ఏ2 సాయిరెడ్డి సంగతి తేలుతుంది. నేనేదో విదేశాలకు పారిపోడానికి రెడీ అవుతున్నట్లు సాయిరెడ్డి కారు కూతలు కూస్తున్నాడు. పోయేది నేను కాదు, జగన్ బెయిల్ రద్దయిన వెంటనే తానే పారిపోడానికి సాయిరెడ్డి పాస్ పోర్టుకు అప్లై చేసుకున్నాడు. కానీ అది రిజెక్ట్ అయిందని తెలిసింది. ఆ విషయం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. నిజానికి..

సాయిరెడ్డికి దేశహుద్ది జరిగింది..

సాయిరెడ్డికి దేశహుద్ది జరిగింది..

నాపై అనర్హతవేటు పడుతుందని, విదేశాకు పారిపోతానని ఏ2 సాయిరెడ్డి నోటికొచ్చినట్లు పేలుతున్నాడు. అతనికేమైనా పిచ్చెక్కిందా? అంటే, ఎక్కే ఉంటది. ఎందుకంటే, అన్ని చోట్లా ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి టెన్షన్ పెరిగిపోయి ఉండొచ్చు. అంతేకాదు, ఈ మధ్య సాయిరెడ్డికి దేహశుద్ధి కూడా జరిగినట్లు తెలిసింది. సాయిరెడ్డిని కొట్టింది ఎవరో ఆ దేవుడికే తెలియాలి. అతనొక క్రిమినల్. ఎప్పుడూ తప్పుడు సలహాలే ఇస్తుంటాడు, గతంలో నాక్కూడా అలాంటి సలహాలే ఇచ్చాడు..'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju slams andra pradesh cm ys jagan and ysrcp mp vijaya sai reddy over disqualification issue and jagan bail cancelation case. speaking to media on thursday in delhi, the rebel mp alleges that sai reddy is preparing passport to fly after jagan bail cancel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X