వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ఆస్పత్రిలో ఎంపీ రఘురామ -గుండెలో బ్లాక్స్ -ముంబైలో చికిత్స -ప్రవీణ్, సాయిరెడ్డిపై ఫైర్

|
Google Oneindia TeluguNews

సొంత పార్టీపై, పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయి విమర్శలు, సంచలన ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం ఆస్పత్రిపాలయ్యారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా సాధారణ వైద్యపరీక్షలు చేయించుకున్న ఆయనకు.. గుండెలో అనూహ్య సమస్యలు తలెత్తినట్లు రిపోర్టుల్లో తేలింది. దీంతో పరిస్థితి విషమించకముందే చికిత్స కోసం ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. మంగళవారం నాటి తన 'రాజధాని రచ్చబండ'ను కూడా ఆస్పత్రి నుంచే నిర్వహించిన ఆయన.. తన ఆరోగ్య స్వయంగా వెల్లడించారు. అదే సమయంలో సీఎం జగన్, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సీఎంవో అధికారి ప్రవీణ్ ప్రకాశ్ లపైనా రఘురామ విరుచుకుపడ్డారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

హ్యాట్సాఫ్ జస్టిస్ రాకేశ్-సిగ్గు రాదా? -పుష్కరాలపై జగన్ కుట్ర -కొత్తరకం దారి దోపిడీ: ఎంపీ రఘురామ హ్యాట్సాఫ్ జస్టిస్ రాకేశ్-సిగ్గు రాదా? -పుష్కరాలపై జగన్ కుట్ర -కొత్తరకం దారి దోపిడీ: ఎంపీ రఘురామ

చక్కెర, కంది పప్పుపై కోత..

చక్కెర, కంది పప్పుపై కోత..

‘‘ప్రస్తుతం నేను ఆస్పత్రిలో చేరాను. నా ఆరోగ్య సమస్యలను వివరించబోయే ముందు, ప్రజలు నా దృష్టికి తీసుకొస్తోన్న రాష్ట్ర సమస్యలు, వైసీలో అంతర్గత విభేదాలపై పై మాట్లాడుతాను. ఏపీలో ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా అందిస్తోన్న సరుకులపై గతం నుంచే 50 శాతం రాయితీ ఉంది. కానీ జగన్ సర్కారు ఇప్పుడు చక్కెర, కందిపప్పులపై రాయితీని 25 శాతానికి తగ్గించి, ఖర్చును ఆదా చేసుకోవాలని చూస్తున్నారు. తక్కువ ధరకు సరుకులు ఇస్తుంటే జనం తిని కూర్చుంటున్నారని, దాన్ని నివారించడానికే రాయితీలు తగ్గిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ప్రచారం చేయడం దారుణం. మిగతా దుబారాను తగ్గించుకునైనా పేదలకు సాయం చేయాలే తప్ప సబ్సిడీలు ఎత్తేయడం తగదు. గతంలో కనీసం అన్నా క్యాంటీన్ల ద్వారానైనా పేదల ఆకలి తీరేది. వాటిని మూసేశారు. మరి వైఎస్సార్ క్యాంటీన్లనైనా తెరుస్తారా? పథకాలతో మనుషుల్ని సోమరుల్ని చేయడం ఎంత తప్పో, ఆకలితో ఉన్నవాడిని గుర్తించకపోవడం కూడా అంతే తప్పు. ఇక..

దుబాయ్ రాజుగారి ఆరో భార్య గుట్టు రట్టు -బాడీగార్డుతో ప్రిన్సెస్ హాయా అఫైర్ -అందుకు రూ.12కోట్లుదుబాయ్ రాజుగారి ఆరో భార్య గుట్టు రట్టు -బాడీగార్డుతో ప్రిన్సెస్ హాయా అఫైర్ -అందుకు రూ.12కోట్లు

వైసీపీలో తీవ్ర గొడవలు..

వైసీపీలో తీవ్ర గొడవలు..

కొద్ది గంటల కిందట తూర్పుగోదావరి డీఆర్సీ మీటింగ్ లో వైసీపీ అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సాధారణంగా డీఆర్సీ మీటింగ్ కు మీడియా కవరేజ్ తప్పనిసరి. కానీ గలాటా జరుగుతుందని ముందే తెలుసు కాబట్టే, మావాళ్లు అక్కడికి మీడియాను రానీయలేదు. ఒకప్పుడు వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడిగా, ప్రస్తుత వైసీపీ సీనియర్ నేతగా, నిన్నటి వరకు డిప్యూటీ సీఎంగా, ఇప్పుడు ఎంపీగా కొనసాగుతోన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ మీటింగ్ లో కొన్ని వాస్తవాలు మాట్లాడారు. దీంతో ఆయనపై వైరివర్గం గొడవకు దిగింది. పార్టీలో నిజాయితీపరుడిగా బోసుకు పేరుంది. ఇలా నిజాలు మాట్లాడినవాళ్లపై దాడులు చేస్తుండటం, అంతర్గత కలహాలు పెరిగిపోవడం అన్ని జిల్లాల్లోనూ కనిపిస్తోంది. పార్టీని చక్కదిద్దాల్సిన పెద్దలేమో..

సాయిరెడ్డికి సోయి ఉందా?

సాయిరెడ్డికి సోయి ఉందా?

సొంత పార్టీలో సమస్యలను పక్కనపెట్టేసి, వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ఇటీవల అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం జాతీయ పార్టీ అయిఉండి, దుబ్బాక ఉప ఎన్నికలో పోటీచేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. అయ్యా.. సాయిరెడ్డిగారు, మన వైసీపీ కూడా జాతీయ పార్టీనే కదా, మీరు పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి కదా, మరి మనం కూడా దుబ్బాకలోగానీ, ప్రస్తుతం జరుగుతోన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోగానీ పోటీ చేయలేదు కదా? అలాంటప్పుడు పక్క పార్టీలను దెప్పి పొడిచే అర్హత మనకుందా? ప్రత్యర్థుల్ని విమర్శించడం తప్పు కాదు. కానీ మనం కూడా ఏం చేస్తున్నామన్నదే ఇక్కడ ముఖ్యం. కంటెంట్ లేకుండా విమర్శిస్తున్నారని అందరికీ ఈజీగా తెలిసిపోతుందిగా, తెలంగాణలో పోటీపై వైసీపీ స్టాండ్ ఏంటని నెటిజన్లు మనని కూడా అడుగుతారు కదా? ఇంకోటి..

ప్రవీణ్ ప్రకాశ్‌కు కేంద్రం ఝలక్

ప్రవీణ్ ప్రకాశ్‌కు కేంద్రం ఝలక్

తప్పుడు సలహాలిచ్చే విజయసాయిరెడ్డికిగానీ, వాటిని వినే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గానీ, ఆచరణలో పెట్టే సీఎంవో ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కుగానీ దూకుడు పనికిరాదని నేను ముందునుంచీ మొత్తుకుంటున్నా. ఒక రాజ్యంలో రాజు దుందుడుకుగా ఉన్నా, మంత్రికి సంయమనం ఉండాలని హితవు చెప్పినా పట్టించుకోలేదు. ఇవాళ అదే ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్ ఐఏఎస్ అధికారులు అందరికీ అడిషనల్ సెక్రటరీలుగా ప్రమోషన్లు లభించాయి. ఈయనకు మాత్రం కేంద్రం మొండిచేయి చూపించింది. అన్ని సార్లూ దూకుడు ప్రదర్శిస్తే ఇబ్బందులు తప్పవు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..

హార్ట్‌లో బ్లాక్స్.. స్టంట్ వేస్తామన్నారు..

హార్ట్‌లో బ్లాక్స్.. స్టంట్ వేస్తామన్నారు..


గత రెండు రోజులుగా నేను ఆస్పత్రిలో ఉన్నాను. వార్షిక చెకప్ కోసం టెస్టులు చేయించుకోగా, గుండెలో సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. గుండెలో రెండు బ్లాక్స్(అడ్డంకులు) ఉన్నాయని, స్టంట్లు వేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. చికిత్స అంతా ముంబైలోనే జరుగుతుంది. పెద్దగా ప్రమాదం ఉండబోదని డాక్టర్లు చెప్పారు. త్వరలోనే కోలుకుంటాను. మరో పది రోజులపాటు ఎవరికీ అందుబాటులో ఉండలేను. నా ఆరోగ్యం పట్ల ఎలాంటి ఆందోళన చెందొద్దని అభిమానులకు, అమరావతి రైతులకు విన్నవించుకుంటున్నాను. నేను ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చేలోపైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్నయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నా'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju hospitalised with heart problems. speaking through social media platform on tuesday, mp himself revealed that he is underwent treatment in mumbai hospital. mp says he will recover soon. mp also slams cm jagan, ysrcp mp vijayasai reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X