నిమ్మగడ్డతో ఢీ: జగన్కు భగపాటు - కేంద్ర బలగాలతో ఏపీలో ఎన్నికలు - సుప్రీంకోర్టు చెప్పిందిదే: రఘురామ
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై వేడి గంటగంటకూ పెరుగుతోంది. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు కాబట్టి పోలింగ్ నిర్వహణకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తుండగా, ఇప్పటిదాకా జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. తప్పనిసరిగా చేపట్టాల్సిన ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వమే నో చెబుతుండటం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మళ్లీ భంగపాటు తప్పదని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇలా చెప్పుకొచ్చారు..
ప్రవీణ్ ప్రకాశ్ పని పట్టాల్సింది జగనే -చెప్పు దెబ్బలు -షాకింగ్ సర్వే చూశారా?: ఎంపీ రఘురామ

సుప్రీం కోర్టు ఏం చెప్పింది..
‘‘ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆల్ పార్టీ మీటింగ్ పిలిస్తే, దానిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందిస్తూ.. భేటీకి వెళ్లబోమని, అవసరమైతే రివర్స్ కేసు కూడా వేస్తామని చెప్పారు. గతంలో ఎన్నికల కోసం ఆరాటపడిన వైసీపీ.. ఇప్పుడు కాదనడం.. నిమ్మగడ్డ ఉన్నంతకాలం ఎన్నికలకు వెళ్లబోమని అనడం ఎంతవరకు కరెక్టు? ‘రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి'అని మావాళ్లు సుప్రీంతీర్పుకు వక్రభాష్యం చెప్పారు. నిజానికి కోర్టు.. రాష్ట్ర సర్కారుతో చర్చించమని మాత్రమే చెప్పింది.. అంగీకారం కోరమని కాదు. ప్రభుత్వాలు అంగీకరిస్తేనే ఎన్నికలు పెట్టాలంటే.. అప్పుడిక ఎన్నికలే ఉండవు. అధికారంలో ఉన్నవాళ్లు అలా కొనసాగుతూ ఉండొచ్చు. జగన్ మొండిపట్టుతో ఇంకో ప్రమాదం కూడా ఉంది..
అడ్డంగా దొరికిన విజయసాయిరెడ్డి - మోదీ-జగన్ మధ్య ఉల్కాపాతం -పోలవరం అసలు కథ: ఎంపీ రఘురామ

కేంద్ర బలగాలతో ఎన్నికలు
కనగరాజు ఈసీగా ఉంటేనే వైసీపీకి ఏకగ్రీవాలు వస్తాయనుకోవడం పొరపాటు. ఏడాదిన్నర పాలన అద్భుతంగా ఉంది కాబట్టి గతంలో కంటే ఎక్కువ ఏకగ్రీవాలు నిమ్మగడ్డ ఉండగానే రావొచ్చు. ఏకగ్రీవాల సంగతి ఎలా ఉన్నా ఎన్నికలు మాత్రం కచ్చితంగా నిర్వహించాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం అవి జరగపోతే స్థానిక సంస్థలకు నిధులురావు. ఎన్నికలు వద్దని ప్రభుత్వం చెప్పడానికి వీల్లేదు. ఇంకా మొండికేస్తే.. కేంద్ర బలగాలను రంగంలోకి దించయినా ఏపీలో స్థానిక ఎన్నికలు జరిపిస్తారు. అప్పుడు జగన్ ఆపలేరు. దీనికి అడ్డంగా వెళితే మళ్లీ భంగపడతారు. ఒకవైపు స్కూళ్లు, లిక్కర్ షాపులు తెరుస్తూ ఎన్నికల విషయంలో వెనుకడుగు ఎందుకు?, ఎన్నికల వ్యవస్థను కంట్రోల్ లోకి తీసుకుని, నేనే సూపర్ పవర్ అని అనుకోవడం కరెక్టుకాదు.

నిమ్మగడ్డకు నా మనవి..
స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై రాజకీయ పార్టీలతో ఈసీ మాట్లాడుతున్నారు. అదే సమయంలో నిమ్మగడ్డకు నా విన్నపం ఏంటంటే.. ఎన్నికల వ్యవస్థలో ఓటరు కూడా ఉన్నాడి గుర్తించండి. ప్రజలతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోండి. అందరినీ కలిసి, అడగలేకపోయినా, కనీసం కొన్ని నిజమైన ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలనైనా పరిగణలోకి తీసుకోండి. సుప్రీం ఆదేశాలను మీరు పాటిస్తున్నారు సరే, ప్రజల్ని కూడా పరిగణలోకి తీసుకోండి. కొన్ని బలమైన కారణాలతో నాడు ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడా కారణం బలహీనమైంది కాబట్టి ఎన్నికలు జరిపించండి.

‘భరత్ అనే నేను’ కోర్ కాన్సెప్ట్ ఇదేగా..
మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను' సినిమా చూసి సీఎం జగన్ చాలా స్ఫూర్తి పొందారు. ఆ సినిమా దర్శకుడే నిర్ఘాంతపోయేలా జగన్ సర్కారు జనం నుంచి కొత్త రకం పన్నులు వసూలు చేస్తోంది. అయితే ఆ సినిమా ముఖ్య ఉద్దేశాన్ని మాత్రం జగన్ వదిలేశారు. కావాలంటే మళ్లీ చూడండి.. ‘‘గ్రామాలకు పాలనాధికారం'' అనేది ‘భరత్ అనే నేను'లో కోర్ పాయింట్. గత జన్మలో గాంధీ అయిన జగన్ ది కూడా అదే కాన్సెప్ట్. మరి ఆ లక్ష్యం నెరవేరాలంటే స్థానిక ఎన్నికలు జరగాల్సిందే కదా. ఎలాగో వైసీపీ పాలన అద్భుతంగా ఉంది కాబట్టి స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా గెలవొచ్చు. కాదంటే గతంలో మాదిరిగానే నిమ్మగడ్డ విషయంలో భంగపాటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేంద్ర బలగాలతో ఎన్నికలతో నిర్వహించే పరిస్థితి వస్తుంది'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.