వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపి ఎంపీల రాజీనామాలు ఆమోదం.. చిత్త‌శుద్ది లేదంటున్న‌టీడిపి..

|
Google Oneindia TeluguNews

కేంద్ర బ‌డ్జెట్ స‌మావేశాల్లో స‌మ‌ర్పించిన వైసీపి ఎంపీల రాజీనామాలను లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఆమోదించిన‌ట్టు తెలిపారు. పున‌ర్ ద్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించిన త‌ర్వాత అదికారికంగా ఆమోదించిన‌ట్టు ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించ‌నందుకు నిర‌శ‌న‌గా రాజీనామా చేసిన‌ట్టు చెప్తున్న వైసీపి ఎంపీలు అదే బీజెపి ప్ర‌భుత్వంతో క‌లిసి దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్స‌డుతోంద‌ని టీడిపి నేత‌లు మండిప‌డుతున్నారు. క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి, ఒంగోలు ఎంపి వైవీ సుబ్బారెడ్డి, తిరుప‌తి ఎంపి వ‌ర‌ప్ర‌సాద్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి రాజీనామాలను ఆమోదించిన‌ట్టు తెలుప్తోంది.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం ప‌నిచేస్తాం.. అందుకే రాజీనామ‌లు ఆమోదం...

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం ప‌నిచేస్తాం.. అందుకే రాజీనామ‌లు ఆమోదం...

స‌స్పెన్స్ త్రిల్ల‌ర్ ను మ‌రిపించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఎట్టకేల‌కు ఆమోదించారు. ఆంద్ర ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌నందుకు నిర‌శ‌న‌గా లోక్ స‌భ‌లో వైసీపి ఎంపీలు రాజీనామా చేసారు. గ‌త పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో స‌మ‌ర్పించిన వైసీపి ఎంపీల రాజీనామాలు బుద‌వారం ఆమోదిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్దితో ఉందో ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు జ‌గ‌న్ ఎంపీలు. ప్ర‌త్యేక హోదా కోసం వైసీపి క‌ట్టుబ‌డి ఉంద‌ని, తెలుగుదేశం పార్టీ లాగా పూట‌కోమాట వైసీపి మాట్లాద‌ని తేల్చి చెప్తున్నారు. ప్ర‌త్యేక హోదా కు తెలుగుదేశం పార్టీ అడ్డం ప‌డింద‌ని, స్వార్థ‌రాజ‌కీయాల‌కోసం ప్ర‌త్యేక హోదాను ప‌ణంగా వెట్టార‌ని చంద్ర‌బాబుపై వైసీపి ఎంపీలు మండిప‌డుతున్నారు.

విజయ సాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేయ‌డం లేద‌ని టీడిపి సూటి ప్ర‌శ్న‌..

విజయ సాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేయ‌డం లేద‌ని టీడిపి సూటి ప్ర‌శ్న‌..

ఆంద్ర ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా సాధించేంత వ‌ర‌కూ వైసీపి విశ్ర‌మించ‌బోద‌ని ఆ పార్టీ ఎంపీలు తేల్చి చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీల‌కు చిత్తశుద్ది ఉంటే త‌మ ఎంపీల చేత రాజీనామాలు చేయించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వైసిపి ఎంపీలు పున‌ర్ ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించిన వెనువెంట‌నే రాజీనామాలు ఆమోదం పొందే అవ‌కాశం ఉన్న‌ట్టు స్పీక‌ర్ కార్యాల‌యం తెలియ‌జేస్తోంది. ఐతే వైసీపి ఎంపీల రాజీనామాల‌ను ఓ పెద్ద డ్రామా గా టీడిపి నేత‌లు అభివ‌ర్ణిస్తున్నారు. ఉప ఎన్నిల‌కు అవ‌కాశం లేకుండా రాజీనామాలు చేసీ ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకు పైసీపి ఎత్తుగ‌డ వేసింద‌ని టీడిపి నేత‌లు చెప్పుకొస్తున్నారు. ప్ర‌జా క్షేత్రంలో బ‌లం నిరూపించుకొనే స‌త్తా లేక‌నే దొడ్డి దారిన రాజీనామాల‌ను ఆమోదించుకున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.ఎంపీల రాజీనామాల‌ను ఆమోదింప‌జేసుకున్న వైసీపి., విజ‌య‌సాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేయ‌డం లేద‌ని ప్ర‌శ్రిస్తున్నారు.

ఉపఎన్నిక‌ల్లో గెలిచే స‌త్తా లేక‌నే ఆల‌స్యంగా ఆమోదంప‌జేసుకున్నారు..

ఉపఎన్నిక‌ల్లో గెలిచే స‌త్తా లేక‌నే ఆల‌స్యంగా ఆమోదంప‌జేసుకున్నారు..

ఏడాది గ‌డువులోపు రాజీనామా చేస్తే ఉప ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, ఉపఎన్నిక‌ల్లో గెలిచే స‌త్తా వైసీపికి లేద‌ని అందుకే గ‌డువు దాటిన త‌ర్వాత రాజీనామాలు చేసి ఉప ఎన్నిక‌లు రాకుండా చేసార‌ని విరుచుకు ప‌డుతున్నారు. ప్ర‌యోజ‌నం లేని రాజీనామాలు చేసి ప్ర‌జ‌ల సానుభూతి పొందాల‌నుకోవడం స‌రైన చ‌ర్య కాద‌ని టీడిపి నేత‌లు అంటున్నారు. 2016 లో కాకినాడ బ‌హిరంగ స‌భ‌లో వైసీపి అదినేత జ‌గ‌న్ మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించ‌క‌పోతే 2017 జూలై 30 లోపు వైసీపి ఎంపీలు రాజీనామ‌లు చేస్తార‌ని ప్ర‌క‌టించారని టీడిపి నేత‌లు గుర్తు చేస్తున్నారు. కాని జ‌గ‌న్ కేంద్ర ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపి రాజీనామాల డ్రామాకు తెర లేపార‌ని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీల చిత్త‌శుద్దిని శంకించాల్సి అవ‌స‌రం లేద‌ని, కీల‌క‌మైన కేంద్ర మంత్రి ప‌ద‌వుల‌కు టీడిపి ఎంపీలు ఎప్పుడో రాజీనామా చేసార‌ని అంటున్నారు.

ప్ర‌త్యేక హోదా ప‌ట్ల చిత్త‌శుద్దిని టీడిపి నిరూపించుకోవాలి..

ప్ర‌త్యేక హోదా ప‌ట్ల చిత్త‌శుద్దిని టీడిపి నిరూపించుకోవాలి..

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం తెలుగుదేశం పార్టీ క‌ట్టుబ‌డి ఉన్నంత‌గా ఏపార్టీ క‌ట్టుబ‌డి లేద‌ని టీడిపి చెప్పుకొస్తోంది. మంత్రిప‌ద‌వుల‌ను త్రుణ‌ప్రాయంగా ఒదిలేప‌సిన తెలుగుదేశం పార్టీకి ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వాస్త‌వాలు చెప్పే దైర్యం టీడిపికి ఉందని నేత‌లు చెప్తున్నారు. ఏడాది గ‌డువులోపు రాజీనామాలు ఆమోదింప‌జేసుకు రాజ‌కీయ మైలేజ్ పొందాల‌ని చూస్తున్న వైసీపి నాయ‌కుల వ్య‌వ‌హార‌న్ని ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటున్న‌ర‌ని, రాబోవు ఎన్నిక‌ల్లో ఎవ‌రు ప్ర‌జ‌లే తీర్పు ఇస్తార‌ని అంటున్నారు. క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రానకి చేయూత అందించాల్సింది పోయి, నిర్మాణాత్మ‌క స‌ల‌హాలు ఇవ్వాల్సింది పోయి కేంద్రం చేతులు క‌లిపి దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌టం రాష్ట్రానికి శ్రేయ‌స్క‌రం కాదంటున్నారు టీడిపి నేత‌లు. ఇప్ప‌టికైనా రాజీనామాల డ్రామాల‌కు స్వస్తి ప‌ల‌కి రాష్ట్ర అభివ్రుద్దిలో ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని తెలుగు త‌మ్ముళ్లు కోరుకుంటున్నారు.

English summary
ycp mp's resignations accepted by the loksabha speaker sumithra mahajan on wednesday. central government denying special status for andhra pradesh thats why the mp;s resigned for the preliminary membership. the ruling party narrating the resignations as a big drama of ycp mps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X