వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయపై సైరా పంచ్: కరెంటు షాక్ పెట్టినా.. వ్యాధి ఇంకా నయం కానట్టుంది!

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజకీయాల్లో పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం అత్యంత సహజం. అలా చేసుకోకపోతే అది రాజకీయం అని అనిపించుకోదు కూడా. తమ ప్రత్యర్థుల మనస్తత్వాన్ని బట్టి, వైఖరిని బట్టి.. తరచూ విమర్శలు చేస్తుంటారు. ఈ విమర్శలకు కాస్త మసాలాను జోడిస్తే.. అవి భలేగా పేలుతుంటాయి.

ప్రత్యర్తులకు చురకలు అంటించేలా విమర్శలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి వి విజయసాయిరెడ్డి దిట్ట. ఆయన వేసే పంచ్ లు నవ్వులు పుట్టిస్తుంటాయి. ఆలోచనల్లో పడేస్తుంటాయి. నిజమే కదా? అనిపించేలా ఉంటాయి. తాను చేసే విమర్శలకు కాస్త హ్యూమర్ ను జత చేస్తుంటారాయన. దీనితో అవి జనాన్ని ఆకట్టుకుంటుంటాయి.

<strong>దుమ్ము రేపుతోంది! 10,751,547+.. రావాలి జగన్..కావాలి జగన్ పాట: గిన్నిస్ రికార్డ్ అవకాశం?</strong>దుమ్ము రేపుతోంది! 10,751,547+.. రావాలి జగన్..కావాలి జగన్ పాట: గిన్నిస్ రికార్డ్ అవకాశం?

పంచ్ ల దిట్ట: సూటిగా, సుత్తి లేకుండా!

పంచ్ ల దిట్ట: సూటిగా, సుత్తి లేకుండా!

ఎప్పుడూ పెద్దగా ఎవ్వర్నీ విమర్శించకుండా, మౌనంగా, హుందా కనిపించే విజయ సాయిరెడ్డిలో ఇంతటి హాస్యగుణం ఉందా? అనిపిస్తుంటుంది వాటిని చూస్తే. ట్విట్టర్‌ను వినియోగించడంలో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారు. టీడీపీ నేతలపై ఓ రేంజ్‌‌లో విమర్శల వర్షం కురిపిస్తుంటారు. చంద్రబాబు మొదలుకుని ఎమ్మెల్యే అభ్యర్థుల వరకూ.. అప్పుడప్పుడూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ సహా ఏ ఒక్కర్నీ వదిలి పెట్టారు. సోషల్ మీడియాలో దుమ్ముదులిపేస్తుంటారు. సూటిగా, సుత్తి లేకుండా విమర్శిస్తుంటారు

బాలకృష్ణ ఈ సారి టార్గెట్..

బాలకృష్ణ ఈ సారి టార్గెట్..

ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణపై చేసిన ఓ కామెంట్ కలకలం రేపింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా హిందూపురం నుంచే పోటీ చేస్తున్నారు బాలకృష్ణ. కొద్దిరోజుల కిందట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా బాలకృష్ణ ఓ టీవీ ఛానల్ ప్రతినిధి పై చేయి చేసుకున్నారు. బూతులు తిడుతూ దౌర్జన్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. అనంతరం బాలకృష్ణ సారీ చెప్పారనుకోండి. అది వేరే విషయం.

ఈ ఘటనను కేంద్రబిందువుగా చేసుకుని విజయసాయి రెడ్డి తాజాగా బాలయ్య బాబుకు చురకలు అంటించారు. వివాదాస్పద వ్యాఖ్యానాలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ట్వీట్ చేశారు.

సాయిరెడ్డి ట్వీట్ సారాంశం ఇదే..

ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురంలో బాలయ్య టీవీ ఛానల్ ప్రతినిధిని కొట్టడాన్ని విజయసాయి రెడ్డి తప్పుపడుతూ ఓ ట్వీట్ చేశారు. బాలకృష్ణకు మెంటల్ ఉందని ఇదివరకు నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని సాయిరెడ్డి గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జూబ్లీహిల్స్ లో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఉదంతం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

నిర్మాత బెల్లంకొండ సురేశ్ ను రివాల్వర్ తో కాల్చిన ఘటనలో తాను జైలుపాలు కాకుండా చూసుకున్నారు బాలకృష్ణ. తనకు మెంటల్ ఉన్నట్లు ఓ సర్టిఫికెట్ ను తెచ్చుకున్నారు. మెంటల్ ఉన్న కారణంగా బాలకృష్ణను కారాగారానికి తరలించలేదు పోలీసులు. అప్పట్లో నిమ్స్ డైరెక్టర్ గా పని చేసిన కాకర్ల సుబ్బారావు ఈ సర్టిఫికెట్ ను జారీ చేశారు.

దీన్ని ప్రస్తావిస్తూ.. విమర్శలు చేశారు సాయిరెడ్డి. `తన ఇంట్లో బెల్లంకొండ సురేశ్ ను రివాల్వర్ తో కాల్చిన కేసులో బాలక్రిష్ణ జైలుకు పోకుండా అప్పటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు చౌదరి ఆయనకు మెంటల్ ఉందని సర్టిఫికేట్ ఇచ్చాడు. బెయిల్ దొరికిందాక రెండు నెలలు కరెంట్ షాక్ లిచ్చారు. వ్యాధి నయం కానట్టుంది. కార్యకర్తల్ని కొడుతున్నాడు..` అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

English summary
YSR Congress Party Rajya Sabha Member V Vijay Sai Reddy is targets TDP MLA Candidate Nandamuri Balakrishna this time. Sai Reddy criticized that, It is the time to renewal of Mental Certificate which is issued by the NIMS Doctors to Balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X