• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎంపీ రఘురామ పరారీకి రంగం సిద్ధం -చంద్రబాబు పక్కా స్కెచ్ -మిగిలేది ఇద్దరే: వైసీపీ సాయిరెడ్డి

|

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు, ఆ పార్టీ మధ్య కొనసాగుతోన్న మాటల యుద్ధం మరో స్థాయికి చేరింది. పరస్పర విమర్శల్లో ఇరు వర్గాలు గేరు మార్చాయి. టీవీ5 ఛానల్ అధినేతతో కలిసి రఘురామ హవాలాకు పాల్పడ్డానని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని వైసీపీ కోరగా, మొన్నటిదాకా ప్రభుత్వ, పార్టీ పరమైన అంశాల్లో ఆరోపణలు చేసిన రెబల్.. తాజాగా జగన్, సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణల వ్యక్తిగత, సంస్థాగత విషయాలనూ బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే..

జగన్ వేడుకున్నా వినని ప్రధాని మోదీ -మరో లేఖాస్త్రం -ఏపీలో 3వ వేవ్ భయాలు -కరోనాపై సీఎం కీలక ఆదేశాలుజగన్ వేడుకున్నా వినని ప్రధాని మోదీ -మరో లేఖాస్త్రం -ఏపీలో 3వ వేవ్ భయాలు -కరోనాపై సీఎం కీలక ఆదేశాలు

రెబల్‌కు సాయిరెడ్డి కౌంటర్

రెబల్‌కు సాయిరెడ్డి కౌంటర్

తాను హవాలాకు పాల్పడకపోయినా, ఏపీ సీఐడీ దగ్గరున్న తన ఫోన్ ద్వారా కల్పిత మెసేజ్ లు సృష్టించి, హవాలా పేరుతో లేని కేసును సృష్టించేందుకు వైసీపీ నేతలు, ప్రధానంగా విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని, దీనికి ప్రతిగా జగన్, సాయిరెడ్డి, సజ్జలల నేర చరిత్రను రాష్ట్రపతి, ప్రధాని మోదీతోపాటు పార్లమెంటు ఎంపీలందరికీ పంచి, సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేస్తానని రెబల్ ఎంపీ రఘురామ మంగళవారం నాటి ప్రెస్ మీట్ లో హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బుధవారం నాడు ట్విటర్ వేదికగా స్పందించారు. రెబల్ కు సాయిరెడ్డి ఘాటు కౌంటరిచ్చారు. అదే సమయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబుపైనా భారీ సెటైర్లు వేశారు..

జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలుజగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలు

మిగిలేది ఆ ఇద్దరే..

మిగిలేది ఆ ఇద్దరే..


‘‘అనుకుల మీడియా గాలి కొడుతుంటే పేట్రేగి పోతున్నావు కానీ, ప్రజలకు నీ పార్టీ గురించి ఫుల్ క్లారిటీ ఉంది బాబూ. పెండింగులో ఉన్న పరిషత్ ఎన్నికల కౌంటింగులో కూడా ఏలూరు ఫలితమే రిపీట్ అవుతుంది. 12కు 12 కార్పోరేషన్లు జగన్ గారికి కానుకగా ఇచ్చారు ప్రజలు. ముగిసిపోయిన చరిత్ర నీది. వర్షాలు పడొద్దు, రిజర్వాయర్లు నిండొద్దు, సీమ ప్రాజెక్టులు ఆగి పోవాలి అనే స్థాయికి దిగజారాడు. రెండు రాష్ట్రాల మధ్య నిప్పు రాజుకోవాలని మనసారా కోరుకున్నాడు. పాపం టీడీపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు అభ్యర్థులు దొరకడం కష్టమే బాబూ. నువ్వెంత డబ్బు కుమ్మరించినా పరువు పోగొట్టుకునేందుకు సిద్ధపడేవారు దొరకాలిగా. స్థానిక ఎన్నికలు, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో ఆపసోపాలు పడి ఎదురు పైకం ఇచ్చి నిలబెడితే జనం ఈడ్చి కొట్టారు. చివరకు మిగిలేది మీ ఇద్దరే'' అని చంద్రబాబును విమర్శించారు సాయిరెడ్డి. ఇక రెబల్ విషయంలో..

  Chandrababu Naidu CM అవ్వాలంటే | Ys Jagan సక్సెస్ మంత్రా ! || Oneindia Telugu
  పారిపోడానికి సిద్ధంగా రఘురామ..

  పారిపోడానికి సిద్ధంగా రఘురామ..

  ఓ మీడియా అధినేతతో ఎంపీ రఘురామ సుమారు రూ10కోట్ల హవాలా నడిపినట్లు కేంద్రానికి ఆధారాలు సమర్పించిన వైసీపీ.. రఘురామ విదేశాలకు పారిపోకుండా పాస్ పోర్ట్ సీజ్ చేయాలని కూడా కోరింది. దీనికి ‘20 కేసులున్న సాయిరెడ్డే పాస్ పోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఏ కేసూ లేని నేను విదేశాలకు వెళ్లకూడదా?'అని రఘురామ ప్రశ్నించారు. ఈ వివాదంపై తాజాగా ట్వీట్ చేసిన సాయిరెడ్డి.. రఘురామ పారిపోడానికి సిద్ధంగా ఉన్నాడని, చంద్రబాబు స్కెచ్ వేశాడని ఆరోపించారు. ‘‘పారిపోయే ఆలోచన లేనోడికి 'మిలియన్ యూరోల'తో పనేంటి?. స్కెచ్ వేసిన చంద్రబాబు సామాన్యుడా. పోలీసుల కంటపడకుండా ఎంతో మంది ముద్దాయిల్ని దాచిపెట్టిన చరిత్ర తెలిసిందేగా. కేంద్రాన్ని అప్రమత్తం చేస్తే అంత ఉలుకెందుకు. డిస్క్వాలిఫై అయిన మరుక్షణం ఎగిరిపోడానికి రెడీ అవుతున్నాడు'' అని ఎంపీ సాయిరెడ్డి పేర్కొన్నారు.

  English summary
  ysrcp parliamentary party leader vijaya sai reddy alleged that the rebel mp raghurama krishnam raju is planing to flee from country after disqualification amid hawala issues. taking twitter on wednesday, sai reddy also slams tdp chief chandrababu. ysrcp mp said, chandrababu made plans for raghurama.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X