అయ్యన్నపాత్రుడు తాగుబోతు, భూమికి భారం-సాయిరెడ్డి ఫైర్-జాబ్ మేళా విమర్శలపై
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయాలకు ఇప్పుడు వైజాగ్ లో వైసీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళా కేంద్ర బిందువుగా నిలిచింది. వైజాగ్ లో వైసీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళాలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలే ఇస్తారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన విమర్శలు దుమారం రేపాయి. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు.
వైజాగ్ జాబ్ మేళాపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నపాత్రుడు చేసిన విమర్శల్ని సాయిరెడ్డి తోసిపుచ్చారు. అయ్యన్నపాత్రుడు తాగుబోతని, ఆయన భూమికి భారంగా మారాడని ఆరోపించారు. తెల్లవారి లేస్తే ఏం పని లేక విమర్శలు చేయడం తప్పితే, ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి గాని ఆయనతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు.

ఆయన ఆయన కుమారులు నిరుద్యోగులు గానే ఉన్నారు.. వస్తే వారికి కూడా ఉపాధి కల్పిస్తామంటూ సాయిరెడ్డి చురకలు అంటించారు. వైజాగ్ జాబ్ మేళాలో వేలాది ఉద్యోగాలు వస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని సాయిరెడ్డి ఆరోపించారు.
మరోవైపు వైసీపీతో పొత్తు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీకి వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాపైనా సాయిరెడ్డి మరోసారి స్పందించారు. జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ..రాష్ట్రానికి ఎవరు ప్రయోజనం చేకూరిస్తే వారితోనే తాము వెళ్తామన్నారు. అది ఎప్పుడో తీసుకున్న నిర్ణయమని, అలాగే ముందుకు వెళ్తామన్నారు. ఆ నిర్ణయంపై ఎలాంటి మార్పు ఉండదని సాయిరెడ్డి వివరించారు.