• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పత్తి గింజ నీతిచంద్రిక బోధిస్తుంది, దోపిడీకి రింగ్ మాస్టర్ : చంద్రబాబుపై సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే కక్షల్లో ఏపీ సీఎం బిజీగా ఉన్నారని, కరోనా రెండవ దశ విజృంభణతో రాష్ట్రంలో శవాల గుట్టలు పెరిగిపోతున్నాజగన్ ప్రభుత్వంలో కదలిక లేదని టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాత కక్షలు తీర్చుకోవడానికి ఇదేనా సమయం అంటూ నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు. ఇక టిడిపి అధినేత వ్యాఖ్యలకు కౌంటర్ గా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కట్టప్ప నిమ్మగడ్డ , శాడిస్టు బాబుకోసం, ఉసురు బానిసకు,బాస్ కు..మద్రాస్ కోర్టు తీర్పుతో లింక్ : సాయిరెడ్డి ధ్వజంకట్టప్ప నిమ్మగడ్డ , శాడిస్టు బాబుకోసం, ఉసురు బానిసకు,బాస్ కు..మద్రాస్ కోర్టు తీర్పుతో లింక్ : సాయిరెడ్డి ధ్వజం

కరోనా సమయంలో దొంగలు దొరికినా వదిలి పెట్టాలంట.. సాయిరెడ్డి సెటైర్

కరోనా సమయంలో దొంగలు దొరికినా వదిలి పెట్టాలంట.. సాయిరెడ్డి సెటైర్


బాబు మీడియా సమావేశం చూస్తే చంద్రబాబు అసలు బాధ వైజాగ్ లో పల్లా అక్రమ నిర్మాణం కూల్చివేత,సంగం డెయిరీలో వందల కోట్లు మేసి పాడి రైతుల రక్తం పీల్చిన ధూళిపాళ్ల అరెస్టుపైన ఏడవటానికే అని తెలిసిపోతుందని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. కరోనా సమయంలో దొంగలు దొరికినా వదిలిపెట్టాలంట.. పత్తి గింజ నీతిచంద్రిక బోధిస్తుంది అంటూ చంద్రబాబు పత్తిత్తులా మాట్లాడుతున్నారని విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పనికిరాడని అందరూ తేల్చిన కొడుకు కోసం.. అయినా తిట్టాలి

పనికిరాడని అందరూ తేల్చిన కొడుకు కోసం.. అయినా తిట్టాలి

ఇదే సమయంలో కరోనా విలయం కొనసాగుతున్న తరుణంలో కేంద్రాన్ని,కరోనా కట్టడిలో విఫలమైన పెద్ద రాష్ట్రాలను విమర్శించే దమ్ము లేక చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్నిఆడిపోసుకుంటున్నారు అంటూ నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. టెస్టులు,వ్యాక్సినేషన్,రికవరీ రేటు,ఆక్సిజన్ నిల్వలు,బెడ్లు పెంచడంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. అయినా తిట్టాలి, పనికిరాడని అందరూ తేల్చిన కొడుకు కోసమంటూ,కొడుకు లోకేష్ కోసం చంద్రబాబు ఏపీ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ప్రైవేట్ ఖజానా నింపుకోవడం కోసం వేటినీ వదిలిపెట్టలేదు పచ్చమంద దోపిడీ గ్యాంగ్

ప్రైవేట్ ఖజానా నింపుకోవడం కోసం వేటినీ వదిలిపెట్టలేదు పచ్చమంద దోపిడీ గ్యాంగ్

అచ్చెన్నాయుడు,దేవినేని ఉమ,కూన రవికుమార్,కొల్లు రవీంద్ర ,చింతమనేని ప్రభాకర్ వంటి పచ్చమంద అంతా దోపిడి రింగ్ లో ఒక భాగమని, ఇక రింగ్ మాస్టర్ చంద్రబాబు నాయుడని విమర్శించారు విజయసాయిరెడ్డి. వారంతా తమ ప్రైవేట్ ఖజానా నింపుకోవడం కోసం నీరు,ఇసుక,పాలు,రోడ్లు,బస్సులు,మందులు,వైద్య పరికరాలు ఇలా వేటిని విడిచి పెట్టలేదని విజయ సాయి రెడ్డి ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబును టార్గెట్ చేసి సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి కరోనా సంక్షోభంలోనూ చంద్రబాబు దుష్ప్రచారం ఆగడం లేదని పేర్కొన్నారు.

ఏడాదిగా రాష్ట్రం వదిలిపోయి శవరాజకీయాలు

ఏడాదిగా రాష్ట్రం వదిలిపోయి శవరాజకీయాలు

ఏ మాత్రం సాయం చేయక పోవడమే కాక ఏడాదిగా రాష్ట్రం వదిలి పారిపోయి, పచ్చ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ శవరాజకీయాలు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఏపీ సర్కార్ తీవ్రంగా కష్టపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా కల్పించారు. బాధితులకు అవసరమైన ఎలాంటి వైద్య సహాయమైనా సరే 104 కాల్ సెంటర్ ద్వారా 3 గంటల్లోనే అందించాలని అధికారులను ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. జగన్ కరోనా కట్టడికి సమర్ధంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

  Rahul Gandhi పిలుపుతో ముందుకొచ్చిన MLA Jagga Reddy | Covid రోగులకు సాయపడాలన్న Congress
  కరోనా పరిస్థితులపై జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్న టీడీపీ

  కరోనా పరిస్థితులపై జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్న టీడీపీ


  ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లు ప్రభుత్వ వైఫల్యంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న కేసులతో ఆరోగ్య సంక్షోభం నెలకొందని,కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు.ఆసుపత్రులలో పడకలు లేవని, ఆక్సిజన్ లేదు, మెడిసిన్స్ లేవని, బ్లాక్ లో అధిక ధరలకు మెడిసిన్స్ విక్రయిస్తున్నారని, ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది అంటూ ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడవలసిన చోట,విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం మంచిది కాదని తిట్టిపోస్తున్నారు.

  English summary
  YSRCP MP Vijaya Sai Reddy countered TDP chief Chandrababu's remarks. Vijayasai Reddy made remarks that Chandrababu's real grief lies in the demolition of the Palla illegal construction in Vizag and the arrest of Sangam Dairy chairman dhullipalla narendra not on the corona situation in AP . Chandrababu escape to hyderabad and making un wanted comments on AP CM Jagan for his useless son.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X