వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్, పీఏతో కలిపి అపోలోలో చికిత్స, 10 రోజులు క్వారంటైన్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కలవర పెడుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అయితే వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డికి కరోనా వైరస్ సోకింది. అతని పీఏకి కూడా వైరస్ సోకడంతో.. ఇద్దరు అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాను క్వారంటైన్‌లో ఉంటున్నానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటానని మంగళవారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు. అయితే ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండనని పేర్కొన్నారు. అయితే ఎమర్జెన్సీ కాల్స్ తీసుకుంటానని స్పష్టంచేశారు.

Recommended Video

YSRCP MP Vijaya Sai Reddy Tested COVID-19 Positive || Oneindia Telugu
 అపోలో ఆస్పత్రిలో

అపోలో ఆస్పత్రిలో

ఇటీవల వైఎస్ జయంతి కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళంలో జరిగిన సభకు చాలా మంది హాజరయ్యారు. దీంతోపాటు విజయసాయిరెడ్డి వెంట మందీ మార్బలం ఉంటారని.. సామాజిక దూరం నిబంధన పట్టించుకోరనే అపవాదు ఉంది. దాంతో కరోనా వైరస్ సోకి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తమవుతుంది.

 అందుకే దూరం

అందుకే దూరం

విజయసాయిరెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత. అయితే బుధవారం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంది. ఈ క్రమంలో తాను క్వారంటైన్‌లో ఉంటున్నానని విజయసాయి ట్వీట్ చేయడం గమనార్హం. దీంతో ఆయనకు కరోనా వైరస్ సోకిందని స్పష్టమైంది.

 అనిత ట్వీట్

అనిత ట్వీట్

విజయసాయిరెడ్డి తాను క్వారంటైన్‌లో ఉంటున్నట్టు ప్రకటించారో లేదు టీడీపీ నేత అనిత వంగలపూడి స్పందించారు. అయితే ఆమె విజయసాయిరెడ్డికి కరోనా వచ్చినట్టు ట్వీట్ చేశారు. రాజకీయంగా విభేదించిన.. కరోనాపై కలిసి పోరాడాల్సిందేని ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఆమె టైమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్వీట్ ట్యాగ్ చేశారు. అందులో మాత్రం సాయిరెడ్డికి కరోనా వచ్చినట్టు రాసి ఉంది. ఆ తర్వాత మిగతా వార్తా సంస్థలు కూడా సాయిరెడ్డికి కరోనా వచ్చినట్టు వార్తలు రాశాయి.

కోలుకోవాలని ఆకాంక్ష

కోలుకోవాలని ఆకాంక్ష

రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప తమ మధ్య ఎలాంటి గట్టు తగాదాలు లేవని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి కరోనా బారిన పడడం బాధాకరం అని ట్వీట్ చేశారు. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

English summary
ysrcp mp vijaya sai reddy infect coronavirus positive. he quarantine for 10 days, he not available mobile also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X