• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పిడికిలి బిగించిన సాయిరెడ్డి -సలాం కొట్టిన సవాంగ్ -‘తెలుగు వీరుడా..’వందనమంటూ ఏపీ గీతం

|

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాస్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిడికిలి బిగించారు... ఆ వెంటనే రాష్ట్ర జీడీపీ గౌతం సవాంగ్ సలాం కొట్టారు.. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత కుర్చీలో కూర్చొనే గొంతు కలిపారు.. బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత.. పారిశ్రామిక వేత్త చంద్రశేఖర్ రెడ్డి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు.. వైసీపీ ఎంపీ రోజా.. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు.. ప్రముఖ సినీ నటులు.. అంతాకలిసి 'తెలుగు వీరుడా..' వందనమంటూ నినదించారు..

నిమ్మగడ్డ వెనుకడుగు -గవర్నర్‌తో ‌భేటీ తర్వాత - కలెక్టర్ల కాన్ఫరెన్స్ రద్దు -మళ్లీ హైకోర్టుకు ఎస్ఈసీ?

కరోనాపై పోరులో స్ఫూర్తి స్మరిస్తూ..

కరోనాపై పోరులో స్ఫూర్తి స్మరిస్తూ..

దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించిన తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రస్తుతం కొత్త కేసుల ఉధృత్తి కాస్త తగ్గినా, మొత్తంగా 8.57లక్షల కేసులతో ఏపీ దేశంలో టాప్-3లో కొనసాగుతున్నది. మహమ్మారి కారణంగా రాష్ట్రంలో 6,899 మంది బలైపోయారు. లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన అన్ని రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించడంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. కరోనాపై పోరులో ఏపీ కొనసాగిస్తున్న స్ఫూర్తిని స్మరించుకుంటూ..

తెలుగు వీరుడా.. ఏపీ గీతం

తెలుగు వీరుడా.. ఏపీ గీతం

ఏపీలో కరోనాపై పోరు, ఫ్రంట్ లైన్ యోధుల గొప్ప తనాన్ని గుర్తు చేస్తూ, అదే సమయంలో ఏపీ ఐకానిక్ గా నిలబడి, అభివృద్ధి పథాన పయనిస్తోన్న తీరును వివరిస్తూ.. ప్రఖ్యాత మీడియా సంస్థ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా(టీఓఐ)' సారధ్యంలో ‘‘తెలుగు వీరుడా..'' పేరుతో సరికొత్త గీతాన్ని రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ గీతంగా అభివర్ణిస్తోన్న ఈ పాటను బుధవారం విడుదల చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ పాటను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. కాగా..

 వోకల్ ఫర్ లోకల్‌కు మద్దతు?

వోకల్ ఫర్ లోకల్‌కు మద్దతు?

ఆంధ్రప్రదేశ్ గీతంగా పేర్కొంటొన్న ‘తెలుగు వీరుడా..' పాట రూపకల్పనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన, ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న పలు కంపెనీలు భాగస్వామ్యం అయ్యాయి. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కనిపించినప్పటికీ సీఎం జగన్ ను మాత్రం చూపెట్టలేదు. అయితే, ప్రధాని మోదీ నినాదం ‘వోకల్ ఫర్ లోకల్'ను ఏపీ కూడా సమర్థిస్తోందనే అర్థంలో స్థానిక కంపెనీల ఉత్పత్తులను పాటలో చూపించారు. స్ఫూర్తిమంతంగా సాగే ఆ పాటను పైనున్న సాయిరెడ్డి ఎఫ్‌బీ మీరూ చొడొచ్చు.

నిమ్మగడ్డ రాజీనామా -జగన్ ఫర్మానా -ఏపీలో ఆర్టికల్ 356 -సుప్రీం తీర్పు ఇదే: ఎంపీ రఘురామ

వీడయో కోొసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
ysrcp mp vijaya sai reddy shares a new song called 'Telugu Veeruda' which is dubbed as Andhra Pradesh Anthem on wednesday. Times of India Group, who initiates this song says amid ap is fighting the COVID-19 pandemic, this anthem is an initiative of the to bring cheer to the people and recognize the frontline warriors helping us all fight the pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X