• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రఘురామపై వైసీపీ మరో బాంబ్-రాజ్యాంగ సవరణతో-కేంద్రానికి సాయిరెడ్డి లేఖ-కీలకాంశాలతో

|
Google Oneindia TeluguNews

వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే అసమ్మతి స్వరం వినిపిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఆ పార్టీ మరో అస్త్రం ప్రయోగిస్తోంది. ఇందుకోసం ఏకంగా రాజ్యాంగ సవరణకే ప్రతిపాదిస్తోంది. ఇందుకోసం కేంద్రం సాయం కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు. ఇందులో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం నేపథ్యం, దాని వల్ల కలుగుతున్న నష్టాల్నివివరించారు. దీంతో పాటు పనిలో పనిగా కర్నూలుకు హైకోర్టును తరలించే విషయంలో చర్యలు తీసుకోవాలని, రైతుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని సాయిరెడ్డి కోరారు.

 రఘురామ అనర్హత

రఘురామ అనర్హత

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఈ పార్లమెంటు సమావేశాల్లో అనర్హత వేటు వేయించేందుకు గట్టిగా ప్రయత్నించిన వైసీపీ విఫలమైంది. వైసీపీ ఫిర్యాదు మేరకు రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ నోటీసులు ఇచ్చినా అనర్హత వేటు మాత్రం పడలేదు. ఇందుకోసం రఘురామ స్పందన తీసుకోవడంతో పాటు వైసీపీ వివరణ కూడా తీసుకోవాలని స్పీకర్ భావించడంతో సమయాభావం వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో రఘురామపై ఎలాగైనా వేటు వేయించాలన్న వైసీపీ పంతం నెగ్గలేదు.

రఘురామపై వైసీపీ మరో బాంబ్

రఘురామపై వైసీపీ మరో బాంబ్

ఈ పార్లమెంటు సమావేశాల్లో రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు మరో ప్రయత్నం ప్రారంభించారు. రఘురామరాజుపై అనర్హత వేటు వేయించే లక్ష్యంతో కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజుకు ఆయన ఇవాళ ఓ లేఖ రాశారు. ఇందులో పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టాన్ని వివరించారు. అనర్హత పిటిషన్ల వ్యవహారాన్ని కూడా కెలికారు. ఫైనల్ గా కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందేనని కోరారు.

అనర్హతకు గడువు పెట్టాల్సిందే

అనర్హతకు గడువు పెట్టాల్సిందే


రఘురామరాజుపై వేటు కోసం తాము స్పీకర్ కు ఇచ్చిన పిటిషన్ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజుకు రాసిన లేఖలో దీన్ని పరోక్షంగా ప్రస్తావించారు. అనర్హత పిటిషన్లను తేల్చేందుకు గడుపు నిర్ణయిండంలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ విఫలమైందని, అందుకే ఇందులో మార్పులు చేయడం ద్వారా నిర్ణీత సమయంలో అనర్హత పిటిషన్ల వ్యవహారం తేల్చేలా చూడాలని సాయిరెడ్డి న్యాయశాఖమంత్రిని కోరారు. అనర్హత పిటిషన్లకు గడువు లేకపోవడంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందన్నారు. గతేడాది మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ కేసులో అనర్హత పిటిషన్లకు మూడు నెలల గడువు మాత్రమే ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్నీ ప్రస్తావించారు.

కర్నూలుకు హైకోర్టు తరలింపు

కర్నూలుకు హైకోర్టు తరలింపు


ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో హైకోర్టును అమరావతి నుంచి హైకోర్టుకు తరలించాలని కూడా విజయసాయిరెడ్డి న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజును కోరారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం మూడు రాజధానులు తెస్తూ గతేడాది చట్టాన్ని ఆమోదించిందని, దీని ప్రకారం పాలనా రాజధాని విశాఖకు, న్యాయరాజధాని కర్నూలుకు, చట్ట సభల రాజధాని అమరావతిలోనూ ఉంచబోతున్నట్లు తెలిపారు. కాబట్టి ఈ చట్టం ప్రకారం అమరావతిలోని హైకోర్టు ప్రధాన బెంచ్ ను కర్నూలుకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని న్యాయమంత్రిని కోరారు.
మరోవైపు న్యాయరాజధాని కర్నూల్లో ఏర్పాటు చేస్తున్నందున జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో పాటు జాతీయ జ్యుడిషియల్ అకాడమీని సైతం అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. హైకోర్టు కర్నూల్లోనే ఏర్పాటు అవుతున్నందున లా యూనివర్సిటీ కూడా అక్కడే ఉంటే విద్యార్ధులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. అలాగే ప్రస్తుతం భోపాల్ లో మాత్రమే ఉన్న జ్యుూడిషియల్ అకాడమీ క్యాంపస్ ను కర్నూలుకు కూడా విస్తరించడం ద్వారా మరింత మెరుగైన న్యాయపాలన సాగించేందుకు వీలు పడుతుందన్నారు.

English summary
andhrapradesh ysrcp mp vijaya sai reddy on today wrote a letter to union law minister kiran rijiju requesting for amendment of 10th schedule in constitution to set time limit for disbursal of disqualification petitions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X