వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ట్విస్టులు-పాకిస్తాన్ ఎన్నికలతో పోల్చిన విజయసాయిరెడ్డి..

|
Google Oneindia TeluguNews

ఏపీలో తన రాజకీయ ప్రత్యర్ధులపై నిత్యం ట్వీట్ల వర్షం కురిపించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మధ్య తరచుగా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయన త్వరలో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపైనా దృష్టిపెట్టారు. ఈ ఎన్నికలు జరుగుతున్న తీరుపై సాయిరెడ్డి నిత్యం సంచలన ట్వీట్లు పెడుతున్నారు.
ఇదే క్రమంలో ఇవాళ మరో సంచలనం రేపారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవికి జరుగుతున్న ఎన్నికలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాకిస్తాన్ ఎన్నికలతో పోలుస్తూ సంచలన ట్వీట్ చేశారు. ఇందుకు గల కారణాల్ని కూడా ఆయన తన ట్వీట్ లో వెల్లడించారు. పాకిస్తాన్ అధ్యక్ష ఎన్నిక తరహాలోనే వెనుక ఎవరో ఉండి నడిపించే ఎన్నికలనే అర్దం వచ్చేలా సాయిరెడ్డి ఇందులో ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు సాయిరెడ్డి ట్వీట్ చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీపై తన పాత కక్షంతా కలిపి ఒకేసారి తీర్చుకుంటున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది.

ysrcp mp vijayasai reddy compares congress presidential election with pakistan polls

ఇంతకీ తన ట్వీట్ లో విజయసాయిరెడ్డి ఏం పెట్టారో తెలుసా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అచ్చం పాకిస్తానీ ఎన్నికలలాగే జరుగుతున్నాయి. ఫైనల్ గా జనరల్ మద్దతున్న వారే ఎన్నికల్లో గెలుస్తారంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సైతం పాకిస్తాన్ అధ్యక్ష ఎన్నికల్లో జనరల్ మద్దతున్న వారు గెలిచినట్లుగానే ఇక్కడ కూడా సోనియాగాంధీ లేదా రాహుల్ గాంధీ ఆశీస్సులున్న వారే గెలుస్తారని సాయిరెడ్డి చెప్పకనే చెప్పినట్లయింది. అంతే కాదు ఎన్నిక అనేది లాంఛనమే. అది గాంధీ కుటుంబ ఆశీస్సులున్నవారు గెలిచేదే అన్న అర్ధం వచ్చేలా సాయిరెడ్డి ట్వీట్ ఉందనే ప్రచారం జరుగుతోంది.

English summary
ysrcp mp vijayasai reddy on today compares congress presidential election with pakistan elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X