• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మా ఎన్నికలు వైసీపీ ఖాతాలోకే: బాలయ్యకూ క్రెడిట్: మంచు విష్ణుపై ప్రశంసలు: ఆ జోష్ కంటిన్యూ

|
Google Oneindia TeluguNews

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా వేడి రగిలించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించడాన్ని ఒక రకంగా పార్టీలకు అతీతంగా అభినందనలు అందుతున్నాయి. మెగా కాంపౌండ్ అభ్యర్థిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్.. ఈ ఎన్నికల్లో ఓడిపోవడం- ఆ కుటుంబం ప్రతిష్ఠ మసకబారేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మెగా కాంపౌండ్ డౌన్‌ఫాల్ మొదలైందని నెటిజన్లు అంచనా వేస్తోన్నారు.

వైసీపీ సానుభూతిపరుడిగా..

వైసీపీ సానుభూతిపరుడిగా..

నిజానికి- మంచు విష్ణు కుటుంబం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులుగా గుర్తింపు ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కుమారుడు, హీరో మంచు విష్ణు.. స్వయంగా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. అదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన నాయకుడు కావడం వల్ల- ఈ ఎన్నికలు రాజకీయ రంగును పులుముకొన్నాయి.

కమ్మ ఓట్లు విష్ణుకే..

కమ్మ ఓట్లు విష్ణుకే..

తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ వెన్నుదన్నుగా ఉంటూ వస్తోన్న కమ్మ సామాజిక వర్గం సైతం ఈ ఎన్నికల్లో పార్టీకి అతీతంగా ఓటు వేసినట్టే. మంచు విష్ణు విజయం సాధించడానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నటులు, దర్శకులు, నిర్మాతలు సాంకేతిక నిపుణులు.. అనుకూలంగా వ్యవహరించారనేది ఫలితాలు స్పష్టం చేస్తోన్నాయి. వారందరూ ప్రకాష్ రాజ్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారనేది తేలిపోయినట్టయింది.

మెగా కాంపౌండ్‌ మద్దతు వల్లే..

మెగా కాంపౌండ్‌ మద్దతు వల్లే..

ప్రత్యేకించి- ప్రకాష్ రాజ్‌ మీద తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల్లో ఎలాంటి వ్యతిరేక భావం లేదు. ఓ నటుడిగా ఆయనను అందరూ అభిమానిస్తారు. మా ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి ఆ మంత్రం పని చేయలేదు. ప్రాంతీయ భావం తెర మీదికి వచ్చింది. సామాజిక వర్గాలు చిత్ర పరిశ్రమ విడిపోయింది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్.. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ కుటుంబం మద్దతు ఇచ్చిన అభ్యర్థి కావడం వల్లే ప్రకాష్ రాజ్ ఓడిపోయారనే అంచనాలు నెలకొన్నాయి.

బాలకృష్ణ ఫ్యాక్టర్ కూడా..

బాలకృష్ణ ఫ్యాక్టర్ కూడా..

అదే సమయంలో- తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడైన నందమూరి బాలకృష్ణ కూడా.. వైసీపీ సానుభూతిపరుడిగా ముద్ర ఉన్న మంచు విష్ణుకు మద్దతు ఇచ్చారు. పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు బాలకృష్ణ-మంచు విష్ణులు కలిసి దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా ఎన్నికల్లో బాలకృష్ణ ఓటు ఎవరికి పడుతుందనేది అక్కడే తేలిపోయింది. దీనితో ఆయనను అభిమానించే వారు కూడా మంచు విష్ణు వైపే మొగ్గు చూపారు.

వైసీపీలో జోష్..

వైసీపీలో జోష్..

మంచు విష్ణు గెలుపు.. ఓ రకంగా వైఎస్సార్‌సీపీలో జోష్ నింపింది. ఇటీవ‌ల రిప‌బ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్టయిందనే వ్యాఖ్యానాలు సైతం వ్యక్తమౌతోన్నాయి. ఆ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని, ఘాటు విమర్శలను సంధించిన విషయం తెలిసిదే. ఈ నేప‌థ్యంలో ‘మా' ఎన్నికల్లో మెగా కాంపౌండ్ మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజ్‌ను ఓడించాలనే పట్టుదల కనిపించింది. అది వాస్తవ రూపాన్ని దాల్చింది.

మెగా కాంపౌండ్ పట్టు లేనట్టేనా?

మెగా కాంపౌండ్ పట్టు లేనట్టేనా?

చిత్ర పరిశ్రమ మీద మెగాస్టార్ చిరంజీవికి గానీ.. పవన్ కల్యాణ్‌కు గానీ ఎలాంటి పట్టు లేదనే విషయం ఈ ఎన్నికలు మరోసారి నిరూపించినట్టయిందని చెబుతున్నారు. మంచు విష్ణు సాధించిన విజయాన్ని వైసీపీ అందుకున్న విక్టరీగానే భావిస్తోన్నారు ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి సైతం మంచు విష్ణుకు అభినందించడం.. దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

సాయిరెడ్డి అభినందన..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపొందిన యువ హీరో మంచు విష్ణుకు తాను శుభాభినందనలను తెలుపుతున్నానని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఇదే ఉత్సాహంతో ఆయన సినీ కళాకారులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. మంచు విష్ణు ఫొటోను తన ట్వీట్‌కు జత చేశారు సాయిరెడ్డి. ఈ విజయం తమ ఖాతాలో పడిందనే విషయాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పకనే చెప్పినట్టయింది.

 సాయిరెడ్డి అభినందన..

సాయిరెడ్డి అభినందన..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపొందిన యువ హీరో మంచు విష్ణుకు తాను శుభాభినందనలను తెలుపుతున్నానని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఇదే ఉత్సాహంతో ఆయన సినీ కళాకారులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. మంచు విష్ణు ఫొటోను తన ట్వీట్‌కు జత చేశారు సాయిరెడ్డి. ఈ విజయం తమ ఖాతాలో పడిందనే విషయాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పకనే చెప్పినట్టయింది.

English summary
YSR Congress Party MP Vijayasai Reddy congratulates actor Manchu Vishnu after wins in MAA elections 2021 as President.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X