వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రలోభాలు ?- వైజాగ్ వెళ్లని కారణమిదేనా - సాయిరెడ్డి ట్వీట్ల వెనుక ?

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన పార్టీపై నిత్యం ట్విట్టర్ లో విమర్శలు గుప్పించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మహానాడు వేళ మరోసారి జూలు విదిల్చారు. అసలు టీడీపీ ఎక్కడుందనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. ఇంకెక్కడి తెలుగుదేశం. ప్రజలకు దూరమై ఏడాదైంది. ఎల్లో మీడియా, ఆ పార్టీ వెబ్ సైట్లలో మాత్రమే తరచూ ఉరుములు వినిపిస్తుంటాయి. క్యాడర్ లేదు, ఓటు బ్యాంకు లేదు. అధికారం ఉంటేనే మాట్లాడతారంట. ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై, అనుకూల వ్యవస్థలను ఉసిగొల్పితే ప్రజాక్షేత్రంలో విజయం సిద్ధిస్తుందా? అంటూ సాయిరెడ్డి చెలరేగిపోయారు.

ysrcp mp vijayasai reddy flays naidu in wake of tdp mahanadu

అటు విశాఖ బాధితుల పరామర్శ కోసం ఏపీకి వచ్చి కరకట్టపై కాలక్షేపం చేస్తున్నారంటూ మరో ట్వీట్ లో సాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. విశాఖ గ్యాస్ బాధితులను పరామర్శిస్తా. వాళ్లకు భారీగా ఆర్ధిక సాయం చేసి ఆదుకుంటా అని చెప్పినోడు కరకట్ట నుంచి కదలడం లేదు. ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకునే పనిలో పడ్డాడు. అధికారం పోయినా, పార్టీ వదిలి పోవద్దని కోట్ల డబ్బు ఆశ చూపిస్తున్నాడంటే ఏ రేంజిలో దోచుకున్నాడో ఊహించొచ్చు అంటూ సాయిరెడ్డి ట్వీట్ లో చురకలు అంటించారు.

ysrcp mp vijayasai reddy flays naidu in wake of tdp mahanadu

టీడీపీ నుంచి వైసీపీలోకి దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సాయిరెడ్డి ట్వీట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్ కు టీడీపీ మహానాడులో కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక బుజ్జగించే ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

YSR Rythu Bharosa : Another Good News For AP Farmers,Govt Will Dig Borewells For Farming
ysrcp mp vijayasai reddy flays naidu in wake of tdp mahanadu

English summary
ysrcp mp vijaya sai reddy mocks chandrababu once again with his tweets. saireddy questions naidu that why he is not yet visit vizag gas leak site. and naidu busy with ooing his mlas from jumping other parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X