• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విజయసాయి రెడ్డికి మోడీ సర్కార్ ఛైర్మన్ పదవి ఆఫర్: లిస్ట్‌లో టీఆర్ఎస్ ఎంపీ కూడా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందనడానికి మరో ఉదాహరణగా చెప్పుకొనే కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రస్థాయిలో బీజేపీ నాయకులు- అధికార వైఎస్ఆర్సీపీతో నిత్య పోరాటం చేస్తోన్నప్పటికీ- హస్తిన స్థాయిలో మాత్రం మెతక వైఖరినే కనపరుస్తోంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలు వైసీపీ పట్ల పెద్దగా ఘర్షణ పడట్లేదు. ఒకింత సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఇదివరకు కొన్ని సందర్భాల్లో ఇది స్పష్టమైంది కూడా.

కీలక పోర్ట్‌ఫోలియోలు..

కీలక పోర్ట్‌ఫోలియోలు..

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల పునర్వ్యవస్థీకరణలో మరోసారి ఇది రుజువైంది. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను ఈ స్థాయి సంఘాలకు ఛైర్మన్లుగా అపాయింట్ చేసింది. కీలకమైన పోర్ట్‌ఫోలియోలకు మాత్రం సొంత పార్టీ సభ్యులు లేదా మిత్రపక్షంగా ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించింది. అలాంటి కీలకమైన స్థాయి సంఘానికి వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డిని ఛైర్మన్‌గా నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది

24 స్థాయి సంఘాల పునర్వ్యవస్థీకరణ..

24 స్థాయి సంఘాల పునర్వ్యవస్థీకరణ..

అత్యంత కీలకంగా ఉండే 24 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొన్ని కమిటీలకు కొత్త ఛైర్మన్లను నియమించింది. సొంత పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చింది. అదే సమయంలో- దేశంలోనే మూడో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీకి సభ్యులను ఇందులోకి తీసుకుంది. ఎన్డీఏ మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్ష పార్టీల సభ్యులకూ వేర్వేరు స్టాండింగ్ కమిటీల్లో చోటు కల్పించింది.

మాజీ డిప్యూటీ సీఎంకు

మాజీ డిప్యూటీ సీఎంకు

పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ ప్యానెల్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ అపాయింట్ అయ్యారు. హోమ్ తప్ప మిగిలిన కీలక స్థానాల్లో బీజేపీ తన సొంత పార్టీ ఎంపీలు లేదా.. మిత్రపక్షాలకు చెందిన పార్టీల వారిని నియమించింది. హోమ్ వ్యవహారాల స్టాయి సంఘాన్ని కాంగ్రెస్‌కు కేటాయించింది. ఆ పార్టీ ఎంపీ ఆనంద్ శర్మను హోమ్ ఎఫైర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది.

 శశిథరూర్‌ రీ అపాయింట్

శశిథరూర్‌ రీ అపాయింట్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌కే చెందిన లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌ను పునర్నియమించింది. ఆయనను తొలగించాలంటూ బీజేపీ సభ్యలు చేసిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పెద్దగా పరిగణనలోకి తీసుకోనట్టే. కొద్దిరోజుల కిందటే ఈ ప్యానెల్ ఛైర్మన్ పదవీకాలం ముగిసింది. మళ్లీ దాన్ని పునర్వ్యవస్థీకరించి- శశిథరూర్‌నే ఛైర్మన్‌గా అపాయింట్ చేసింది. మిత్రపక్షం జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన రాజీవ్ రంజన్ సింగ్‌ను ఇంధన వనరుల స్థాయి సంఘం ఛైర్మన్‌గా నియమించింది బీజేపీ.

 కేంద్ర మాజీమంత్రులకూ చోటు..

కేంద్ర మాజీమంత్రులకూ చోటు..

కేబినెట్ నుంచి తప్పించిన రవిశంకర్ ప్రసాద్‌ను ఆర్థిక స్థాయి సంఘంలో సభ్యుడిగా తీసుకుంది. దీనికి జయంత్ సిన్హా ఛైర్మన్‌గా ఉంటారు. మంత్రులుగా పదవులు కోల్పోయిన ప్రకాష్ జవదేకర్, హర్షవర్ధన్‌లను విదేశీ వ్యవహారాల ప్యానెల్‌లో సభ్యులుగా చోటు కల్పించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్‌ను శాస్త్ర, సాంకేతిక, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులపై ఏర్పాటైన స్థాయి సంఘానికి ఛైర్మన్‌ను చేశారు.

పెట్రోలియం, రైల్వేస్..

పెట్రోలియం, రైల్వేస్..

పెట్రోలియం, సహజవాయు పర్యవేక్షణ స్టాండింగ్ కమిటీకి బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. పట్టణాభివృద్ధి ప్యానెల్‌కు కేంద్ర మాజీమంత్రి జగదంబికా పాల్ అపాయింట్ అయ్యారు. స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్‌, రైల్వే కమిటీకి బీజేపీకి చెందిన వినయ్ సహస్ర బుద్ధే, రాధా మోహన్ సింగ్‌ను కొనసాగించారు. జల వనరుల ప్యానెల్‌కు సంజయ్ జైస్వాల్ ఛైర్మన్‌గా అపాయింట్‌ అయ్యారు.

టీజీ వెంకటేష్, కే కేశవరావు

టీజీ వెంకటేష్, కే కేశవరావు

రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ నియమితులయ్యారు. ఇదివరకు ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. అనంతరం బీజేపీలో చేరారు. పరిశ్రమలపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీకి ఛైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు కే కేశవరావును నియమించారు. గ్రామీణాభివృద్ధి ప్యానెల్‌ శివసేనకు దక్కింది. ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ప్రతాప్‌రావ్ జాదవ్ దీనికి ఛైర్మన్‌ అయ్యారు.

 విజయసాయి రెడ్డికి..

విజయసాయి రెడ్డికి..

వాణిజ్యంపై ఏర్పాటైన స్థాయి సంఘం ఛైర్మన్‌గా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డిని నియమించారు. ఈ సెక్టార్‌లో ఆయనకు ఉన్న అనుభవాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. స్వతహాగా విజయసాయి రెడ్డి టాప్ ఆడిటర్ కావడం వల్ల వాణిజ్య రంగానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ హోదాను కేంద్ర ప్రభుత్వం ఆయన చేతికి అప్పగించినట్లు చెబుతున్నారు. శివసేనకు చెందిన సంజయ్ రౌత్ ఇదివరకు డిఫెన్స్ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉండగా.. ఆయనను విదేశీ వ్యవహారాలకు బదిలీ చేశారు.

English summary
YSR Congress MP V Vijayasai Reddy has been made the chairman of the reconstituted Parliamentary Standing Committee on Commerce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X