• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జులై 23న దేవుడు ఏం రాసిపెట్టాడో? -జగన్, చంద్రబాబు ఆఖరిపోరు: సాయిరెడ్డి బాంబు -రఘురామ, డా.సుధాకర్

|

సంచలన రాజకీయాలకు కేరాఫ్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా ఇంకో రెండు నెలలకు అసాధారణ దృశ్యాలు చోటుచేసుకోనున్నాయా? సొంత పార్టీ ఎంపీపైనే దేశద్రోహం ఆరోపణలపై జైలుకు పంపిన జగన్ సర్కారు.. అటు ప్రతిపక్ష నేతలనూ వదలకుండా ఎడాపెడా కేసులు పెడుతున్న క్రమంలో ఇక పెద్ద చేపను టార్గెట్ చేసిందా? అందుకు జులై 23న ముహుర్తం నిర్ణయించారా? జగన్-చంద్రబాబుల మధ్య ఆఖరిపోరాటానికి ఆ రోజు తెరలేవనుందా? అనే ప్రశ్నలకు పరోక్షంగా అవుననే హింట్ ఇస్తున్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎంపీ రఘురామ ఉదంతం, డాక్టర్ సుధాకర్ మృతి తదితర అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు టార్గెట్ గా సాయిరెడ్డి చేసిన కామెంట్లు ఏపీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి..

ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!

viral video:అగ్నిపర్వతం బద్దలు -ఇళ్లపైకి లావా -15మంది మృతి -170 మంది చిన్నారులు గల్లంతుviral video:అగ్నిపర్వతం బద్దలు -ఇళ్లపైకి లావా -15మంది మృతి -170 మంది చిన్నారులు గల్లంతు

రఘురామను ఎగదోసి..

రఘురామను ఎగదోసి..

దేశ ద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పై సోమవారం విడుదలకానున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో ఈనెల 27న కీలక విచారణ జరుగనుంది. జగన్, సీబీఐల కౌంటర్ దాఖలుకు అది చివరి అవకాశం కావడం, ఆ రోజు రఘురామ బయటే ఉండబోతున్నప్పటికీ, సుప్రీం ఆంక్షల దరిమిలా మీడియాకు దూరంగా ఉండాల్సి రావడం ఆసక్తికరంగా మారింది. కాగా, ఎంపీ అరెస్టు తర్వాత ఆయనను ఎగదోసిన అసలు వ్యక్తులు ఎక్స్‌పోజ్ అయ్యారని విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘ఆ ఎంపీ కేసుతో చంద్రబాబు, ఎల్లో మీడియాతోపాటు వారికి మద్ధతిస్తున్న శక్తులన్నీ ఎక్స్ పోజ్ అయ్యాయి. ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రదారులు ఎవరు రెచ్చగొడితే ఎగిరి పడుతున్నారో ప్రజలకు బాగా అర్థమైంది. చట్టం చేతులు చాలా విస్తృతమైనవి. ఎవరెన్ని నాటకాలాడినా తప్పించుకోలేరు'' అని ట్వీట్ చేశారు. అలాగే,

గుండెపోటు వచ్చేలా వెన్నుపోటు

గుండెపోటు వచ్చేలా వెన్నుపోటు

రఘురామ కంటే ముందు జగన్ సర్కారుతో పోరాడిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అనూహ్య రీతిలో గుండెపోటుకు గురై ప్రాణాలుకోల్పోవడం, ఆయన మరణాన్ని వైసీపీ హత్యగా టీడీపీ అభివర్ణించడం తెలిసిందే. దానికి కౌంటర్ గా చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘నీకెందుకు నేనున్నా రెచ్చిపో అంటాడు చంద్రబాబు. మీడియా ముందు పులి వేషాలెయ్యమంటాడు. పూర్తిగా నమ్మించి గుండెపోటు వచ్చేలా వెన్నుపోటు పొడుస్తాడు. ఆనాటి ఎన్టీఆర్ నుంచి డాక్టర్ సుధాకర్ వరకు అంతే. చంద్రబాబు లిస్టులో ఇంకెంతమంది ఉన్నారో? శవం దొరికితే చాలు రాబందులా వాలి రాజకీయం చేస్తున్నావు. ఇంత దరిద్రపు ప్రతిపక్షం ఎక్కడా లేదు. డాక్టర్ సుధాకర్ మృతితో ఆ కుటుంబం విషాదంలో ఉంటే నీ పాలిట్రిక్స్ ఏంటి? అంత ప్రేమున్నోడివి ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎందుకివ్వలేదు? డాక్టర్ సుధాకర్ గుండెపోటు/కరోనాతో మరణిస్తే ప్రభుత్వం కోటి ఇవ్వాలంటున్నావ్. నీ వెన్నెపోటుకు బలైన ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చావ్? నీవు రెచ్చగొట్టడంతో సస్పెండ్ అయిన డా. సుధాకర్ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చావ్? వారి కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంటే నీ శవ రాజకీయాలేంటి?'' అని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇదంతా ఒక ఎత్తయితే..

జులై 23న ఏపీలో ఏం జరగనుంది?

జులై 23న ఏపీలో ఏం జరగనుంది?

వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆదివారం(మే 23)నాటికి రెండేళ్లు పూర్తయింది. ఆ సందర్భంగా జగన్ సర్కారు ఏపీకి చేసిన మేళ్లను పేర్కొంటూ గణాంకాలతో సహా ప్రకటనలు చేసిన సాయిరెడ్డి, ఒక ట్వీట్ లో మాత్రం అసాధారణ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జులై 23న శుక్రవారమని, ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలు కాబోతున్నదని జోస్యం చెప్పారు. ‘‘23వ తేదీ అంటేనే టీడీపీకి కాలరాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ల క్రితం గురువారం, మే 23న టీడీపీ అంతలా వణికింది. గోడదెబ్బ - చెంపదెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో?'' అని విజయసాయిరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది..

English summary
ysrcp general secretary and rajya sabha mp vijayasai reddy made sensational remarks on tdp chief chandrababu amid raghurama row and doctor sudhakar death. sai reddy hints that on july 23rd something big is going to be happen in ap politics between cm jagan and chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X