వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గురాలేదు! అవే అబద్ధాలు.. అదే సొల్లు: చంద్రబాబును ఏకిపారేసిన విజయసాయి

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తోపాటు ఆ పార్టీ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శల దాడి చేశారు. చంద్రబాబుకు ఇంకా సిగ్గురాలేదని, మళ్లీ అవే అబద్ధాలు, అదే సొల్లు చెబుతున్నారంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

<strong>సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్! పసుపు రంగు పడింది!! కేసులు కూడా..</strong>సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్! పసుపు రంగు పడింది!! కేసులు కూడా..

దొంగ రాతలు రాసుకుని..

‘అబద్ధాలకూ ఒక హద్దుండాలి. @ncbn గారి పాలనలో 67 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి అంధత్వాన్ని పారదోలారట. మళ్లీ పరీక్షలెందుకంటూ ప్రశ్నిస్తున్నాడు. రికార్డుల్లో దొంగ రాతలు రాసుకుని 200-300 కోట్లు దిగమింగినట్టు ఆయనే బయట పెట్టుకుంటున్నాడు' అని విజయసాయి రెడ్డి టీడీపీ అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరీ ఇంత సొంత డబ్బానా?

మరీ ఇంత సొంత డబ్బానా?

‘40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎం, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్, మళ్లీ మూడోసారి అదే పోస్టు. నోస్టాల్జియాలో జీవిస్తున్నాడు. పాపం తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికి పదేపదే ఈ విషయాలు జ్ణాపకం చేస్తుంటారు. దేశంలో ఓడిన, పదవిలో ఉన్న సీఎం లెవరూ ఇలా సొంత డబ్బా కొట్టుకోలేదు. @ncbn'

5లక్షల కోట్లు దోచుకుని..

5లక్షల కోట్లు దోచుకుని..

‘గ్రామ వలంటీర్ల నియామకంపై @ncbn మళ్లీ కడుపుమంట బయట పెట్టుకున్నాడు. నెలకు 200 కోట్లు ఖర్చు పెట్టి వలంటీర్లను నియమించడానికి ఎవడిచ్చాడు మీకు అధికారం అని గుడ్లురుముతున్నాడు. కొడుక్కి మాత్రమే ఉద్యోగం ఇచ్చి, ఐదు లక్షల కోట్లు దోచుకున్నోడు ఇంతకంటే ఏం మాట్లాడతాడు. @naralokesh' అని విజయసాయి ప్రశ్నించారు.

సిగ్గులేని మాటలు..

సిగ్గులేని మాటలు..

‘విశాఖ పర్యటనలో చంద్రబాబును కార్యకర్తలెవరూ పట్టించుకోలేదు. ఎప్పటిలాగే డబ్బులు వెదజల్లి కొంతమందిని పోగు చేశారు. ఎయిర్‌పోర్టుకు లచ్చల మంది కార్యకర్తలు రావడానికి సిద్ధమైతే పోలీసులు అడ్డగించారట. ఇలాంటి సిగ్గు లేని మాటలు నాలుగు నెలలుగా చెబుతూనే ఉన్నాడు.'

అవే అబద్ధాలు.. అదే సొల్లు

అవే అబద్ధాలు.. అదే సొల్లు

‘పోలవరం అంచనాలను 16 వేల కోట్ల నుంచి 58 వేల కోట్లకు పెంచడంలో జరిగిన అవినీతిపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర జలవనరుల శాఖను విచారణకు ఆదేశించిన తర్వాత చంద్రబాబు స్వరం మారింది. నిరాశా నిస్పృహలు ఆవహించాయి. ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. అవే అబద్ధాలు. అదే సొల్లు' అంటూ టీడీపీ అధినేతపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడ్డారు.

English summary
vijayasai reddy hits out at former cm chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X