వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌తో వైసీపీ ఎంపీ విజయసాయి భేటీ, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా.. వర్ల విసుర్లు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్ భవన్‌లో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. విజయసాయిరెడ్డి గవర్నర్‌ని కలిసిన సమయంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ర రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ నేత వర్ల రామయ్య భేటీ వెనక మర్మమెంటో అని ప్రశ్నలు సంధించారు.

గవర్నర్‌తో సమావేశమైనట్టు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. వీరి భేటీపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. పలుకేసుల్లో ముద్దాయిగా ఉ్న ఏ-2 విజయసాయిరెడ్డి గవర్నర్‌ను కలువడం ఏంటీ అని అడిగారు. అయితే వీరి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు. రాజేంద్రనాథ్ రెడ్డి.. విజయసాయిరెడ్డితో కలిసి గవర్నర్ వద్దకు వెళ్లడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

ysrcp mp vijayasai reddy met governor at rajbhavan..

Recommended Video

AP CM YS Jagan Orders To Officials, గోదావరి వరద బాధితులకు జగన్ చేయూత

అంతేకాదు వీరిద్దరూ ఎందుకు గవర్నర్‌ను కలిశారో చెప్పగలరా అని నెటిజన్లను ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ విజయసాయిరెడ్డితో ఐబీ చీఫ్ వెళ్లడంపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి సంబంధించి చర్చించాలి అంటే సీఎం, లేదంటే మంత్రులు వెళ్లాలి కదా అనే ఉద్దేశంతో వర్ల రామయ్య ప్రశ్నలు సంధించారు.

English summary
ysrcp mp vijayasai reddy met governor biswabhusan harichandan at rajbhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X