వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్యం: జగన్ బాటలో మోదీ ఇలాకా.. ప్రధాని భార్యను తిట్టిన నోటితో ఇలా.. సాయిరెడ్డి శైలిలో..

|
Google Oneindia TeluguNews

''కొత్తగా అధికారంలోకి వచ్చినవాళ్లు.. గత ప్రభుత్వాల నిర్ణయాలను సమూలంగా మార్చేస్తే ఎలా? అంతర్జాతీయ సంస్థలు, విదేశాలతో చేసుకున్న ఒప్పందాలను అర్ధాంతరంగా రద్దు చేసేస్తే దేశం పరువుపోవా? ఆంధ్రప్రదేశ్ వల్ల ఇండియాకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి కదా''.. అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్ది రోజుల కిందట చేసిన కామెంట్లు సంచలనానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు హయాంలో జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్(పీపీఏ)ను ప్రస్తుత జగన్ సర్కారు రద్దు చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సీన్ కట్ చేస్తే.. పీపీఏల విషయంలో జగన్ అనుసరించిన విధానాన్ని ఇప్పుడు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కూడా ఫాలో అవుతున్నది. గుజరాతేకాదు మరో ఏడెనిమిది రాష్ట్రాలు కూడా పీపీఏల సవరణకు నడుం బిగించాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర, అనూహ్య ట్వీట్లు చేశారు.

సంచైతా.. వైసీపీ తోలుబొమ్మలా ఉండకు - బ్రాహ్మణి, భువనేశ్వరిని చూడాలంటూ అనిత ఫైర్.. ఆపై సాయిరెడ్డి పంచ్సంచైతా.. వైసీపీ తోలుబొమ్మలా ఉండకు - బ్రాహ్మణి, భువనేశ్వరిని చూడాలంటూ అనిత ఫైర్.. ఆపై సాయిరెడ్డి పంచ్

ఏపీ బాటలో..

ఏపీ బాటలో..


వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిగా విద్యుత్ సంస్కరణలపై దృష్టిసారించింది. అవసరం లేకున్నా, వివిధ కంపెనీలకు అధిక ధరలు చెల్లించి చంద్రబాబు సర్కారు చేసుకున్న ఒప్పందాలను సీఎం జగన్ రద్దు చేశారు. డిస్కమ్‌లను పిప్పిచేసేలా, విద్యుత్ చార్జీలు పెరిగేలా టీడీపీ సర్కారు వ్యవహరించిందని పీపీఏలపై ఏర్పాటైన కమిటీ నిర్ధారించింది. ఏపీలో సోలార్, విండ్ పవన్ ప్రాజెక్టుల ఒప్పందాలు రద్దు కాగా, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, తదితర రాష్ట్రాలు అక్కడి థర్మల్ విద్యుత్ ఒప్పందాలను సవరించుకున్నాయి. అంతర్జాతీయంగా బొగ్గు, ఆయిల్ ధరల్లో భారీ వ్యత్యాసాలకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా గుజరాత్ కూడా ఈ జాబితాలో చేరింది.

కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్: వరుస దెబ్బలు.. సచివాలయంపై స్టే పొడగింపు.. మోదీ సర్కారు ఓకే చెప్పిందా?కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్: వరుస దెబ్బలు.. సచివాలయంపై స్టే పొడగింపు.. మోదీ సర్కారు ఓకే చెప్పిందా?

టాటా, అదానీలకే షాక్..

టాటా, అదానీలకే షాక్..

గుజరాత్ లో మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ సంస్థ గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిలెడ్(జీయూవీఎన్ఎల్).. టాటా పవర్, అదానీ పవర్, ఎస్సార్ పవర్ కంపెనీలతో వేర్వేరు ఒప్పందాలు చేసుకుంది. 2018లో బొగ్గు ధరలు అమాంతం పెరగడంతో టారిఫ్ లను పెంచుతూ పీపీఏలకు సవరణలు చేశారు. కాగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో బొగ్గు ధరలు బాగా పడిపోవడంతో ఆమేరకు ‘2018లో పెంచిన టారిఫ్'ను రద్దుచేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం గత వారం ప్రకటించింది. తద్వారా రాష్ట్రానికి వేల కోట్లు ఆదా అవుతాయని తెలిపింది. దీన్ని టాటా, అదానీలకు షాక్ అంటూ ప్రఖ్యాత బిజినెస్ స్టాండర్డ్ వార్తల్లో పేర్కొన్నారు.

జగన్ ఉన్నారిక్కడ..

జగన్ ఉన్నారిక్కడ..

పవర్ పర్చేజ్ అగ్రిమెట్స్(పీపీఏ) విషయంలో జగన్ ముందుచూపుతో వ్యవహరించారని, గతంలో చాలా మంది ఆయను తప్పు పట్టినా, ఇవాళ ఒక్కొక్కరుగా అదే బాట పట్టారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘పీపీఏలను సమీక్షిస్తామంటే, అలా చేస్తే పెట్టుబడులు రావంటూ చంద్రబాబు దొర్లి దొర్లి ఏడ్చాడు. ఇవ్వాళ 8 రాష్ట్రాలు మన దారిలో నడుస్తున్నాయి. తాజాగా గుజరాత్ కూడా సవరణకు సిద్ధపడింది. చౌక కరెంటు కొనుగోళ్లతో 8 నెలల్లోనే 6 వేల కోట్ల ప్రజాధనం ఆదాచేసింది ప్రభుత్వం. సీఎం జగన్ ఉన్నారిక్కడ..''అని ఎంపీ వ్యాఖ్యానించారు. అయితే..

బీజేపీపై సైలెంట్.. బాబుపై చిందులు..

బీజేపీపై సైలెంట్.. బాబుపై చిందులు..

జగన్ పీపీఏలను రద్దు చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు రచ్చ చేయడం, పీపీఏలపై టీడీపీ నెలల తరబడి క్యాంపెయిన్ కూడా నిర్వహించిన మాట నిజం. అయితే ఈ విషయంలో బాబు వల్ల జరిగిన డ్యామేజీ కంటే బీజేపీ ముఖ్యనేతల మాటలతోనే జగన్ విధానాలపై అనుమానాలు రెట్టింపయ్యాయి. ప్రధానంగా కేంద్రంలో నంబర్ 3గా ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. జగన్ వల్ల దేశం పరువుపోవొద్దనేంత పెద్ద మాట కూడా వాడారు. తీరా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సైతం ఏపీ మోడల్ ను అనుసరిస్తున్నాయి. పీపీఏల విషయంలో కామెంట్లు చేసిన వైసీపీ సాయిరెడ్డి.. చంద్రబాబుపై చిందులేశారుగానీ, బీజేపీని ఒక్కమాట అనకపోవడంలో మతలబు ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా..

40 ఇయర్స్.. పాత ఫార్ములా..

40 ఇయర్స్.. పాత ఫార్ములా..

చంద్రబాబుపై విమర్శల పరంపరలో పాత విషయాలను సైతం తిరగదోడారు వైసీపీ సాయిరెడ్డి. గత ఎన్నికల్లో మోదీ భార్యను ప్రస్తావిస్తూ బాబు చేసిన కామెంట్లను గుర్తుచేశారు. ‘‘40 ఇయర్స్ ఇండస్ట్రీ - ఒక్కసారీ సొంతంగా గెలవలేదు. 2019 ఒంటరి పోరులో అసలు బలం తేలిపోయింది. వేరేవారి భుజంపై తుపాకి పెట్టి కాల్చాలనే పాత ఫార్ములా వదలడు. ఎన్నికల ముందు మోదీ భార్య, తల్లిపైనా వ్యక్తిగత విమర్శలు చేశాడు. ఇప్పుడు మనుషుల్ని పంపి కాళ్లబేరాలాడుతున్నా ఫలితం లేదు''అని ట్వీట్ చేశారు. తమ పార్టీ వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దని బీజేపీ నేతలు పదే పదే చెప్పినా సాయిరెడ్డి తరచూ అదే పని చేస్తుండటం గమనార్హం.

English summary
amid Gujarat government reverse the power purchase agreements (PPAs) it signed with three producers - Tata Power, Adani Power and Essar Power - to raise the tariffs, YSRCP mp vijayasai reddy made key remarks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X