వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేది చంద్రబాబు ఫిలాసఫీ :విజయ సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేది చంద్రబాబు ఫిలాసఫీ అంటూ మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. మద్యనిషేధం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యం షాపులను తగ్గిస్తుంటే ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు. ఇక గతంలో మద్యనిషేధాన్ని లిక్కర్ లాభి కోసం కోసం చంద్రబాబు ఎత్తివేసినా అప్పటి ఎల్లో మీడీయా పట్టించుకోలేని విషయాన్ని ప్రజలు ఎప్పటికి మరిచి పోరని అన్నారు.

30 రోజుల్లో గ్రామాభివృద్ది... సీఎం కేసిఆర్ దిశానిర్ధేశనం30 రోజుల్లో గ్రామాభివృద్ది... సీఎం కేసిఆర్ దిశానిర్ధేశనం

ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై ఆయన ఫైర్ అయ్యారు. ఆయన మనుగడ కోసం ఎవరి కాళ్లుపట్టుకున్న తప్పులేదనే ధోరణితో చంద్రబాబు ఉంటారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి ప్రధాని కాడని ప్రచారం చేసిన చంద్రబాబు మళ్లి బీజేపీలోకి చేరేందుకు పావులు కదుపుతున్నాడని ఆయన విమర్శించారు.తెలుగు దేశం పార్టీ ఊసరవెళ్లి లాంటీ పార్టీ అని అది ఎవరితోనైన జత కడుతుందని అన్నారు.

YSRCP MP VijayaSai reddy once again fires on Chandrababu naidus philosophy.

మరోవైపు పవన్ కళ్యాన్‌పై పరోక్షంగా పవన్ కళ్యాణ్‌పై కూడ పలు ఆరోపణలు చేశారు.యజమాని ,ప్యాకేజీ ఆర్టీస్టు కలిసి ఒకే స్క్రిప్టు చదువుతున్నారని అన్నారు.చంద్రబాబు ఏమే ఎందుకు ఓడిపోయామో తెలియదంటాడు, పవన్ కళ్యాణ్ ఏమో కాలం కిలిసి వచ్చి ఈవీఎంల టాంపరింగ్‌తో గెలిచామని చెబుతున్నారని అన్నారు. ఈవీఎంల చలవ అయితే తెలుగు దేశం పార్టీని 23 సీట్లలో, జనసేనను ఒక్కస్థానంలో ఎవరు గెలిపించారని ఆయన ప్రశ్నించారు.ఇక పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ చేస్తున్న వ్యాఖ్యలు, ఇక్కడ చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలు ఒకేలా ఉంటాయని ఎద్దేవా చేశారు.

English summary
YSRCP MP VijaySai reddy once again fire on Chandrababu naidu's philosophy.he critised the chandrababu and pavan kalayn on liquor ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X