• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కన్నా..కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్?: సాయిరెడ్డి సింగిల్ లైన్ పంచ్: వైరస్ కంటే వేగంగా..

|

అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా తీవ్రతను కేంద్ర బిందువుగా చేసుకుని చెలరేగిన రాజకీయ మంటలు వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి దక్షిణ కొరియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికను తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్ల ధరలపై నెలకొన్న వివాదాన్ని తెగే దాకా లాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ర్యాపిడ్ టెస్టు కిట్ల రేట్లపై భారతీయ జనతా పార్టీ చేసిస విమర్శలను తిప్పి కొడుతోంది అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు. కరోనా తరహాలోనే ఈ వివాదం కూడా రోజురోజకూ తీవ్రమౌతోంది.

ఇలాక్కూడా రవాణా: అయిదేళ్ల పిల్లాడి కోసం కదిలిన రైల్వే: 350 కిలోమీటర్ల దూరం..!

ర్యాపిడ్ టెస్టు కిట్ల రేట్లపై

ర్యాపిడ్ టెస్టు కిట్ల రేట్లపై

రాష్ట్రంలో వైరస్ పరీక్షలను వేగంగా పూర్తి చేయడానికి ఏపీ సహా దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను తెప్పించాయి. తొలిదశలో 330 రూపాయలకే అందేలా కిట్ల రేటును కుదుర్చుకుంది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. అదే సమయంలో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సహా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వాటి రేట్లను అధికంగా పెట్టి కొనుగోలు చేశాయి. జగన్ సర్కార్.. 730 రూపాయలను కొనుగోలు చేయగా కర్ణాటక ప్రభుత్వం ఒక్కో కిట్ కోసం 795 రూపాయలను ఖర్చు చేసింది.

 అధిక రేటు పెట్టి కొన్నారంటోన్న బీజేపీ

అధిక రేటు పెట్టి కొన్నారంటోన్న బీజేపీ

ఛత్తీస్‌గఢ్‌తో పోల్చుకుంటే జగన్ ప్రభుత్వం అధిక రేటును పెట్టి కొనుగోలు చేసిందంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇవే తరహా ఆరోపణలను గుప్పించారు. సంక్షోభ సమయంలోనూ వైసీపీ నాయకులు కమీషన్లకు పాల్పడ్డారని విమర్శించారు. దీన్ని తిప్పి కొట్టే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు వీ విజయసాయి రెడ్డి ఓ అడుగు ముందుకేశారు. చంద్రబాబు వద్ద 20 కోట్ల రూపాయల మొత్తాన్ని తీసుకుని, తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఇద్దరి మధ్య సుజనా చౌదరి మధ్యవర్తిత్వం వహించారని ఆరోపించారు.

సవాల్ విసిరిన కన్నా.. స్వీకరించిన సాయిరెడ్డి

సవాల్ విసిరిన కన్నా.. స్వీకరించిన సాయిరెడ్డి

తాను చంద్రబాబు నుంచి 20 కోట్ల రూపాయలను తీసుకున్నానని, ఆయనకు అద్దెమైకుగా పనిచేస్తున్నాననే ఆరోపణలను రుజువు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. విజయసాయి రెడ్డికి దమ్ము ఉంటే.. ఆయన మగాడైతే కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి రావాలని ఛాలెంజ్ చేశారు. ఈ సవాల్‌ను సాయిరెడ్డి స్వీకరించారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, కాణిపాకం ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంగళవారమే ప్రకటించిన సాయిరెడ్డి.. మరుసటి రోజు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశారు.

  Lockdown : YSRCP Leaders Slams MLA Roja On Breaking The lockdown Rules
  కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్ అంటూ

  కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్ అంటూ

  కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి బుధవారం ఉదయం విజయసాయి రెడ్డి ట్వీట్లను సంధించారు. కన్నా.. కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్? అంటూ సింగిల్ లైన్ పంచ్ విసిరారు. తాను కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తనతో ఎప్పుడొస్తున్నారో తెలియజేయాలని ఆయన కన్నా లక్ష్మీనారాయణను నిలదీశారు. బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర పార్టీ నిర్వహణ కోసం పంపించిన నిధుల్లో 30 కోట్ల రూపాయలను కన్నా లక్ష్మీనారాయణ నొక్కేశాడంటూ ఇదివరకు దినపత్రికల్లో వచ్చిన క్లిప్పును ఆయన ఈ సందర్భంగా తన ట్వీట్‌కు జత చేశారు. స్థానికంగా సమీకరించిన విరాళాలు దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. కన్నాతో పాటు కొత్తగా చేరిన నేతలు ఈ నిధులు పంచుకున్నట్టు బీజేపీ అధిష్ఠానానికి ఈ విషయం తెలుసునని అన్నారు.

  English summary
  YSR Congress Party Senior leader and Rajya Sabha member Vijayasai Reddy once again invited to Andhra Pradesh State Bharatiya Janata Party (BJP) President Kanna Lakshminarayana, who challenged on Rapid tests kits rates for oath taking at Kanipakam temple.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more