• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నారా 420 వైరస్, చంద్రబాబు పీఎం, లోకేష్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్, కరోనాపై గురువింద నీతులు : సాయిరెడ్డి వ్యంగ్యం

|

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబును, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ప్రతిరోజు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు, లోకేష్ కు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప వేరే పని లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో జరుగుతున్నది, పక్క రాష్ట్రంలో క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటూ సెటైర్లు వేశారు.

 నీ వల్ల దేశానికి,తెలుగుదేశానికి ఏంటి ఉపయోగం? చంద్రబాబులాగే ఆ జబ్బు 'పప్పు'రత్నానికి : సాయిరెడ్డి సెటైర్లు నీ వల్ల దేశానికి,తెలుగుదేశానికి ఏంటి ఉపయోగం? చంద్రబాబులాగే ఆ జబ్బు 'పప్పు'రత్నానికి : సాయిరెడ్డి సెటైర్లు

తింగరబుచ్చికి బ్రీఫ్ చేయండి కాస్త.. మాలోకం కు తెలివి లేదు

తింగరబుచ్చికి బ్రీఫ్ చేయండి కాస్త.. మాలోకం కు తెలివి లేదు


సోషల్ మీడియాలో టిడిపి అధినేత చంద్రబాబును,లోకేష్ ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఎల్లో మీడియాను నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది అజ్ఞానం. ట్వీట్లు, స్టేట్మెంట్లు ఇవ్వడానికి ముందు పార్టీలో తెలివిగల వారు ఎవరైనా ఉంటే ఆ తింగరబుచ్చికి బ్రీఫ్ చేయండి కాస్త. కోవిడ్ పరీక్షలు ఒకేరోజు 1,41000 దాటి రికార్డులను అధిగమిస్తూ ఉంటే, లక్ష పరీక్షలు జరగాలని పట్టుబడుతున్నాడు మాలోకం అంటూ లోకేష్ పై సెటైర్లు వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరీక్షలెన్నో కూడా తెలియకుండా లోకేష్ మాట్లాడుతున్నాడని విమర్శించారు.

ప్రజలు చిత్తుగా ఓడించి కుళ్లబొడిచినా బుద్ధి రాలేదు

ప్రజలు చిత్తుగా ఓడించి కుళ్లబొడిచినా బుద్ధి రాలేదు

అంతేకాదు రెండేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి కుళ్లబొడిచినా బుద్ధి రాలేదు . రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా ఉండకూడదు. పొరుగు రాష్ట్రంలో తలదాచుకుని అబద్ధాలు యంత్రాల్లా దుష్ప్రచారాలు సాగిస్తున్నారు. పైశాచిక ఆనందం పొందడం మినహా ఏం సాధిస్తారు అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును,లోకేష్ ను విమర్శించారు.
14 ఏళ్లు సీఎం వెలగబెట్టానని చెప్పుకునే చంద్రబాబు ఏనాడు వైద్యరంగంలో మౌలికవసతుల విస్తరణ పట్టించుకోలేదని దుయ్యబట్టారు .

అప్పుడు ముందు చూపు లేదు.. ఇప్పుడు బాబు గురివింద నీతులు

అప్పుడు ముందు చూపు లేదు.. ఇప్పుడు బాబు గురివింద నీతులు

చంద్రబాబు హయాంలో అప్పుడే ముందుచూపు కనబరిచి ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం తేలికయ్యేది. వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పిన వ్యక్తి ,ఇప్పుడు గురివింద నీతులు చెబుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కరోనా వైరస్ కనిపించని వైరస్ అని ప్రజల ప్రాణాలకు, ప్రజల ప్రశాంతతకూ, సంక్షేమానికి మరియు అభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని,ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కనిపించే వైరస్ అంతే ప్రమాదం అంటూ సెటైర్లు వేశారు.

NARA 420 వైరస్ ప్రచారం, ప్రజలను భయపెట్టటమే పనిగా జూమ్ భూతం

NARA 420 వైరస్ ప్రచారం, ప్రజలను భయపెట్టటమే పనిగా జూమ్ భూతం

సిసిఎంబి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గోబెల్స్ ప్రచారం ఆపడంలేదని, N440k వైరస్ వేరియంట్ ప్రబలింది అంటూ, NARA 420 వైరస్ ప్రచారం చేస్తోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ పారిపోయినా కూడా నారా 420 ఆనవాళ్లు మాత్రం రాష్ట్రంలో అక్కడక్కడా ఉన్నాయి.ప్రజలను భయ పెట్టడమే పనిగా పెట్టుకుంది ఈ జూమ్ భూతం అంటూ నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. ఇక సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబును పీఎం, లోకేష్ డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ చేస్తే బాగుంటుంది అంటూ సెటైర్లు వేశారు.

చంద్రబాబు, లోకేష్ లు కరోనాని నలిపేసి, పిసికేసి, కోరికేసేవాళ్ళు

చంద్రబాబు, లోకేష్ లు కరోనాని నలిపేసి, పిసికేసి, కోరికేసేవాళ్ళు

టిడిపి నేత పట్టాభి వారం రోజులు బాబోరిని సీఎం చేస్తే కరోనాని నలిపేసేవాడని ,నాన్నారిని పీఎం చేస్తే వారంలో దేశంలోని కరోనాని పిసికేసేవాడు అని, నన్ను డబ్ల్యుహెచ్వో డైరెక్టర్ చేస్తే ప్రపంచంలో కరోనాను కొరికేసే వాణ్ణి అని లోకేష్ , చెబుతారు అన్నట్లుగా ట్వీట్ చేశారు. ఇదే సమయంలో కరోనా సమయంలో ఏడాదిగా పక్క రాష్ట్రంలో హోమ్ క్వారంటైన్ లో ఉన్న చంద్రబాబు అంటూ,గదిలో కూర్చొని దిక్కుమాలిన రాజకీయాలు చేయడం టీడీపీ నేతలకే చెల్లుబాటవుతుంది అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి.

English summary
YSRCP MP Vijayasai reddy made shocking comments targeting TDP chief Chandrababu Naidu, Lokesh and Telugudesam party leaders. Vijayasaireddy satires on Chandrababu Naidu saying that CoronaVirus is an invisible threat to life, peace, welfare, and development.and Chandrababu is a visible one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X