
ఆ గట్టునున్నావా తుప్పన్నా.. ఈ గట్టునున్నావా పప్పన్నా: వైసీపీఎంపీ సాయిరెడ్డి షాకింగ్ పేరడీ
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా చంద్రబాబు, లోకేష్ ల పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడిన విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన పేరడీ పాటతో వారిని టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికలలో టిడిపి పొత్తుల విషయంలో ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

ఆ గట్టునుంటే జనసేనకు నిప్పు…ఈ గట్టునుంటే బీజేపీకి ముప్పు
ఆ గట్టునున్నావా తుప్పన్నా...ఈ గట్టునున్నావా పప్పన్నా... అంటూ ప్రశ్నించినా విజయసాయిరెడ్డి ఆ గట్టునుంటే జనసేనకు నిప్పు...ఈ గట్టునుంటే బీజేపీకి ముప్పు...మరి ఏ గట్టునుంటావు నారన్న అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. అంతేకాదు ఏ గట్టునైనా ఉన్నావో లేదో...కరకట్టనున్నావు నారన్నా! అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర పోస్ట్ చేశారు.

విగ్గు, పెగ్గు అనే బ్యాంకు దొంగ...ఒక నికృష్టుడు: రఘురామను టార్గెట్ చేసిన సాయిరెడ్డి
ఇక వైసిపి రెబెల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గురించి విగ్గు రాజు, పెగ్గు రాజు అంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించే విషయం తెలిసిందే. తాజాగా రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విగ్గు, పెగ్గు అనే బ్యాంకు దొంగ...ఒక నికృష్టుడు అంటూ మండిపడ్డారు. దుర్గంధం వెదజల్లే కుళ్లిన శవంలాంటి వాడు అని టార్గెట్ చేశారు. దేహం పగుళ్లుబారి రసికారుతోంది. దానిని పురుగులు తినేదాక మనం కాస్త దూరంగా ఉండక తప్పదు అంటూ విజయ సాయి రెడ్డి రఘురామకృష్ణంరాజు నుద్దేశించి పేరు పెట్టకుండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మారుమూల రోడ్ల ఫోటోలను చూపించి ప్రధాన రహదారులన్నట్టు బోగస్ రాతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం పై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య కొనసాగుతున్న రగడ తెలిసిందే. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రోడ్ల నిర్మాణంపై జగన్ గారి ప్రభుత్వం ఏడాది కాలంలో 3,590 కోట్లు ఖర్చు చేసింది. బాబు హయాంలో వేల కోట్లు ప్రకటించినా విడుదల అయ్యేవి కాదు అంటూ పేర్కొన్నారు. ఎల్లో మీడియాకు ఇవేవి కనిపించవు. మారుమూల రోడ్ల ఫోటోలను చూపించి ప్రధాన రహదారులన్నట్టు బోగస్ రాతలు రాస్తోంది అంటూ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని, అనుకూల మీడియాను టార్గెట్ చేశారు.

ఇల్లు కట్టినప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా గంజా? అయ్యన్నను టార్గెట్ చేసిన సాయిరెడ్డి
అంతేకాదు
మాజీమంత్రి
టీడీపీ
పొలిట్
బ్యూరో
సభ్యుడు
చింతకాయల
అయ్యన్నపాత్రుడు
ఇంటిని
శనివారం
అర్ధరాత్రి
మున్సిపల్
సిబ్బంది
జెసిబి
లతో
కూల్చివేశారు.
పంట
కాలువను
ఆక్రమించి
ఇంటి
గోడ
నిర్మించాలని
ప్రభుత్వ
భూమిని
రెండు
సెంట్లు
ఆక్రమించారని
గోడను
కూల్చివేశారు.
ఇక
దీనిపై
తెలుగుదేశం
పార్టీ
నేతలు
తీవ్రస్థాయిలో
మండిపడ్డారు.
అయ్యన్నపాత్రుడును
ఉద్దేశించి
వ్యాఖ్యలు
చేసిన
విజయసాయిరెడ్డి
ప్రభుత్వ
భూమిని
కబ్జా
చేసినందుకు
ముందే
నోటీసు
ఇచ్చారు.
దానికి
జవాబు
లేదంటే
తప్పును
ఒప్పుకున్నట్టే
అని
పేర్కొన్నారు.
'అడుసు
తొక్కనేల,
కాలు
కడగనేల'
అన్నట్టు
దర్జాగా
ఆక్రమించి
ఇల్లు
కట్టినప్పుడు
ఇవన్నీ
గుర్తురాలేదా
గంజా?
అంటూ
అయ్యన్నపాత్రుడుని
టార్గెట్
చేశారు.
అర్ధరాత్రి
కూల్చడం
ఏమిటని
ఎల్లో
మీడియా,
పచ్చ
పార్టీ
ఆర్తనాదాలు
చేస్తున్నారంటూ
మండిపడ్డారు.