• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎలన్ మస్క్ కు బాబు ఐడియా: జూనియర్ ఎన్టీఆర్ పేరెత్తితే వణికిపోతున్నాడేంటి: చంద్రబాబుపై సాయిరెడ్డి సెటైర్లు!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీపై నిత్యం విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా మరోమారు తెలుగుదేశం పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును ఆదర్శంగా చెప్పుకునే ఒక్క పథకం కూడా ఏపీలో లేదని ఎద్దేవా చేశారు. పొలిటికల్ మిర్చి, నాకౌట్ అంటూ వరుస పోస్టులు పెట్టిన విజయసాయి రెడ్డి చంద్రబాబుకు పవర్ ఫుల్ పంచ్ లు వేశారు.

ఎలన్ మస్క్ కు ఐడియా ఇచ్చి స్పేస్ X రాకెట్ల కంపెనీ పెట్టించింది బాబేనంట

ఎలన్ మస్క్ కు ఐడియా ఇచ్చి స్పేస్ X రాకెట్ల కంపెనీ పెట్టించింది బాబేనంట

ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా చంద్రబాబు వల్లేనంటూ చంద్రబాబు చెప్పుకుంటారని, పచ్చమీడియా ప్రచారం చేస్తుందని ఎద్దేవా చేసిన విజయసాయి రెడ్డి అంగారక గ్రహానికి మనుషులను పంపాలని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు ఐడియా ఇచ్చి స్పేస్ X రాకెట్ల కంపెనీ పెట్టించింది బాబేనంట! అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆరోజుల్లో దావోస్ లో ఈయనను కలిసేందుకు బిల్ గేట్స్ రోజంతా వెయిట్ చేశాడని ఎల్లోమీడియా రాసిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అందుకే రాత్రంతా అమెరికా కాల్స్ కోసం వెయిట్ చేస్తుంటాడట పాపం చంద్రబాబు! అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

ప్రజలే పొత్తులు పెట్టుకోమని కోరుకుంటున్నారు, ఇల్లు కట్టుకోమంటున్నారట

ప్రజలే పొత్తులు పెట్టుకోమని కోరుకుంటున్నారు, ఇల్లు కట్టుకోమంటున్నారట

నాకౌట్ పేరుతో చేసిన పోస్టులో నమ్ముతారు నమ్ముతారు మీ ఇష్టం అంటూ చంద్రబాబు పొత్తులపై, కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకోవడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలే పొత్తులు పెట్టుకోమని కోరుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నట్లుగా ఆయన పోస్ట్ చేశారు. అంతేకాదు కుప్పం స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత అక్కడ ఇల్లు కట్టుకోమని ప్రజలే కోరుకున్నారని చంద్రబాబు చెప్పినట్టుగా వెల్లడించారు. అయితే ఏం నమ్మరేం .. నమ్మరేంట్రా బాబు మీరు అంటూ చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలను జనం నమ్మడం లేదంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

పిడుగులపై అప్రమత్తం చేసేవాడని అప్పటి కామెడీలు అందరికీ గుర్తున్నాయి

పిడుగులపై అప్రమత్తం చేసేవాడని అప్పటి కామెడీలు అందరికీ గుర్తున్నాయి

అంతేకాదు ఎల్లో మీడియా, పచ్చ మాఫియా ఎంతగా బరితెగించాయంటే గాలికి చెట్ల కొమ్మలు విరిగినా అది జగన్ గారి ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే అంటారు అంటూ విరుచుకు పడిన విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలపై, ఎల్లో మీడియా పై నిప్పులు చెరిగారు. బాబు గారైతే 'రాడార్' లో చూసి కొమ్మలు తొలగించమని ఆదేశించే వాడని చెప్పడమే మిగిలింది అంటూ ఎద్దేవా చేశారు. పిడుగులపై అప్రమత్తం చేసేవాడని అప్పటి కామెడీలు అందరికీ గుర్తున్నాయని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

మూర్ఖుడు లోకేష్ మాటలు నమ్మి ఇలా పరిస్థితి

మూర్ఖుడు లోకేష్ మాటలు నమ్మి ఇలా పరిస్థితి


ఇక తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ మాటలు విని చెడిపోయారని పొలిటికల్ మిర్చిలో పేర్కొన్న విజయసాయిరెడ్డి లోకేష్ మాటలు విని టిడిపి నేతలు నేరాలకు తెగబడ్డారు అంటూ పోస్ట్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కేసులో టిడిపి మహిళా నేత అరెస్ట్ అయ్యారని, బాలికపై లైంగిక వేధింపులు, ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్ జైన్ అరెస్ట్ అయ్యారని, టీడీపీ ఎమ్మెల్సీ కారులో అక్రమ మద్యం పట్టివేతకు గురైందని పోస్ట్ చేసిన విజయసాయి రెడ్డి 12 కేసులుంటేనే టీడీపీ కార్యకర్తలకు నాతో మాట్లాడే హక్కు కలుగుతుందని, మూర్ఖుడి మాటలు నమ్మి ఇలా పరిస్థితి ఉందని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.

జూనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సాయిరెడ్డి ఫైర్

జూనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సాయిరెడ్డి ఫైర్


ఇక తాజాగా కుప్పం పర్యటనలో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై.. విజయసాయిరెడ్డి ఇలా వణికిపోతున్నాడేంటి? ఒకప్పుడు పార్టీ ప్రచారంలో పాల్గొన్న జూ.ఎన్టీఆర్ పేరును కుప్పం ప్రజాదర్బార్ లో ఒక అభిమాని ప్రస్తావించడంతో చిర్రెత్తిపోయాడు. పార్టీలో చీలికలు తేవద్దంటూ వేళ్లూపుతూ వార్నింగులిచ్చాడు అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 40 ఏళ్ల పార్టీ ఇంత వీక్ అయిందా అని నేతలు పిసుక్కుంటున్నారు అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

English summary
Saireddy threw a series of punches at Chandrababu saying that chandrababu had given the idea to elon Musk and named Space X Rocket Company. The 40-year-old chandrababu was incensed that the party had become so weak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X