• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంతా పాక్-ఇండియా మ్యాచ్ వైపు.. చంద్రబాబు, లోకేష్ మాత్రం..: విజయసాయి ఏకిపారేశారు

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్ ‌ను ముడిపెడుతూ విమర్శలు గుప్పించారు. దేశమంతా ఓ వైపు ఉంటే.. ఈ తండ్రీ కొడుకులు మాత్రం దుర్మార్గపు ఆలోచనలో ఉన్నారంటూ ట్విట్ర్ వేదికగా ఎద్దేవా చేశారు.

అంతా ఇండియా-పాక్ వైపు ఉంటే.. చంద్రబాబు, లోకేష్ కుట్రలు ఇలా

అంతా ఇండియా-పాక్ వైపు ఉంటే.. చంద్రబాబు, లోకేష్ కుట్రలు ఇలా

'ప్రపంచం అంతా ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌పై ఆసక్తిగా ఉంటే.. మన ప్రతిపక్ష నాయకుడు, ఆయన పుత్రరత్నం ఆలోచన మాత్రం వేరుగా ఉంది' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ఎలా అడ్డుకోవాలి? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని ఎలా చెడగొట్టాలి? కులాల మధ్య కుంపటి ఎలా రగిలించాలి? ఇదే ఆలోచనతో నిత్యం కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఎవడి కర్మకు ఎవరు బాధ్యులు?' అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో చంద్రబాబు, నారా లోకేష్‌పై విమర్శలు గుప్పించారు.

ఉన్మాద స్థితిలోకి చంద్రబాబు అంటూ విజయసాయి ఫైర్

ఉన్మాద స్థితిలోకి చంద్రబాబు అంటూ విజయసాయి ఫైర్

'విజయం అసాధ్యమనే నిస్పృహ మనిషిని ఉన్మాద స్థితిలోకి నెడుతుంది. సైకాలజీలో దీన్ని Post-traumatic Stress Disorder అంటారు. ప్రజాక్షేత్రాన్ని వదిలి వ్యక్తి కేంద్రంగా దాడులకు దిగడం దీని లక్షణమే. తొలుత దొంగ దెబ్బలతో బెదిరించాలని చూస్తారు. ఫైనల్ గా భౌతిక నిర్మూలనకు కుట్ర చేస్తారు. స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో పొగాకు అమ్మకాల నిషేధం కఠినంగా అమలు. అందుకే.. చిన్నారులు అతి తక్కువగా పొగబారిన పడుతున్న 5 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానం సంపాదించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గ్లోబల్ యూత్ టొబాకో సర్వే కూడా ఇదే విషయం చెప్పింది.' అని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే, ఇవేవీ టీడీపీ అధినేత చంద్రబాబుకు కనిపించవు.. వినిపించవు.. కేవలం కుట్ర రాజకీయాలు చేయడమే ఆయనకు తెలుసునంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

  Huzurabad Election : TRS, BJP కలిసి పనిచేస్తున్నాయి.. ఇవే కారణాలు!!
  చంద్రబాబుకు పిచ్చి తగ్గుతుందంటూ విజయసాయి సెటైర్లు

  చంద్రబాబుకు పిచ్చి తగ్గుతుందంటూ విజయసాయి సెటైర్లు

  'విశాఖమన్యంలో టీడీపీ నేతల గంజాయి స్మగ్లింగ్ కి చెక్. అందుకే వారికి డబ్బుకిక్ లేక ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళింది. మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తి ఒక్కసారే అవి ఆగిపోతే ఇలాగే పిచ్చిపిచ్చిగా మాట్లాడాతాడు. ఇప్పుడు విపక్ష నేత చేస్తున్నది ఇదే - కంగారొద్దు ఈ పిచ్చి క్రమంగా తగ్గిపోతుంది.' అంటూ టీడీపీ నేత గంటా శ్రీనివాస్ వీడియోను పోస్టు చేశారు విజయసాయి రెడ్డి. ఇదిగో టీడీపీ నిజస్వరూపం. టీడీపీ హయాంలో అప్పటి మంత్రి గంటా ఒక ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇవి. మరి లోకేష్ నాయకత్వంలో అయ్యన్న, వెలగపూడి, అప్పటి విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్‌ల గంజాయి వ్యాపార భాగస్వామ్యం గురించి గంట మోగించారో లేక బాబు పాత్రపై అనుమానమో కానీ విషయం మాత్రం ఇది' అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఇలావుంగా, చంద్రబాబు నేతృత్వంలోని 18 మంది పార్టీ సభ్యుల బృందం సోమవారం ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ రాష్ట్రపతిని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని, డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోందని రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చరిత్రలోనే తొలిసారి అని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనంటూ రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు చంద్రబాబు.

  English summary
  YSRCP MP VijayaSai Reddy slams chandrababu and lokesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X