వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా - ఇలాంటి చరిత్రహీనుడు ఎవర్ ఆఫ్టర్ - విజయసాయిరెడ్డి ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో అమలవుతోన్న రైతులకు ఉచిత విద్యుత్ పథకంపై మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. ఉచిత విద్యుత్ పథకంలోని లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రారంభించాలన్న ఉద్దేశంతో జగన్ సర్కారు జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 22పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై జగన్ సర్కారును ఉద్దేశించి తీవ్ర విమర్శల చేసిన చంద్రబాబుకు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు.

Recommended Video

AP CM Jagan, CM KCR, Pawan Kalyan's #IndependenceDay2020 Celebrations || Oneindia Telugu

ఆపరేషన్ ఆడెళ్లు : గ్రేహౌండ్స్ ఉచ్చు! - అందుకే ఆదిలాబాద్‌లోనే డీజీపీ మకాం? - అడవిలో ఏం జరుగుతోంది??ఆపరేషన్ ఆడెళ్లు : గ్రేహౌండ్స్ ఉచ్చు! - అందుకే ఆదిలాబాద్‌లోనే డీజీపీ మకాం? - అడవిలో ఏం జరుగుతోంది??

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్‌ కనెక్షన్‌లకు తప్పనిసరిగా మీటర్లు బిగించాలంటూ జగన్ సర్కారు ఉత్తర్వులిచ్చింది. విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు అనుగుణంగా ఏపీలో ఉచిత విద్యుత్ పథకాన్ని నగదు బదిలీ కిందికి తీసుకొస్తామని, ఈ నిర్ణయం వల్ల రైతులపై అదనపు భారమేదీ పడబోదని, మీటర్లకు రైతులు ఒక పైసా కట్టనక్కరలేదని, వాటిని డిస్కం వారే ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఉచిత విద్యుత్ లో నగదు బదిలీకి సంబంధించిన ప్రకటనలో చీకటి కోణం ఉందని, ఇది రైతుల్ని నిండా ముంచేసే ప్రయత్నమని టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. బాబు విమర్శలపై వైసీపీ నేతలు సైతం మండిపడ్డారు. ఆ క్రమంలోనే విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలు చేశారు.

ఉచిత విద్యుత్ ఆలోచన మాదే..

ఉచిత విద్యుత్ ఆలోచన మాదే..

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లకు మీటర్లు బిగించాలనడం దారుణమని, రైతుల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. అంతటితో ఆగకుండా.. అసలు ఉచిత్ విద్యుత్ పథకం ఆలోచన టీడీపీదే అని, రైతులు పోరాడి సాధించుకున్న హక్కు అని అవర్ణించారు. నగదు బదిలీ పేరుతో జగన్ సర్కారు కొత్త డ్రామాలాడుతోందని విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు. వైఎస్సార్ మానసపుత్రిక అయిన ఉచిత విద్యుత్ పథకాన్ని చంద్రబాబు తమదిగా చెప్పుకోవడం దారుణమని వైసీపీ నేతలు మండిపడ్డారు.

చైనా మరో సంచలనం: రాజ్‌నాథ్ హెచ్చరికపై ఘాటు రియాక్షన్ - యుద్ధం వస్తే భారత్ ఓడుతుందంటూ..చైనా మరో సంచలనం: రాజ్‌నాథ్ హెచ్చరికపై ఘాటు రియాక్షన్ - యుద్ధం వస్తే భారత్ ఓడుతుందంటూ..

అబద్ధం నడిచొచ్చే ఆయనే..

అబద్ధం నడిచొచ్చే ఆయనే..

2004లో వైఎస్సార్ ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకంపై అడ్డగోలుగా మాట్లాడి చంద్రబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా వుంటుంది. దీనికి తాజా నిదర్శనం.. కోట్లాది ప్రజల సమక్షంలో ఉచిత విద్యుత్ పై మహానేత రాజశేఖరరెడ్డి గారు సీఎంగా చేసిన తొలి సంతకంపై కూడా అబద్ధమాడేశారు చంద్రబాబు. నీ అబద్ధాలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు 'ఛీ'బిఎన్. నీయంత చరిత్రహీనుడిని ఈ దేశం చూడలేదు, చూడబోదు'' అని ఎంపీ ఫైరయ్యారు.

English summary
YCP MP Vijaya sai reddy criticised TDP chief Chandrababu over free electricity scheme. amid Government of Andhra Pradesh has taken a key decision to initiate cash transfer to the beneficiaries under the free electricity scheme, chandrababu slams cm jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X