వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిరెడ్డి కరోనాను జయించారు.. ఆ భగవంతుడి దయతోనే, వెల్ విషర్స్‌కు థాంక్స్ చెబుతూ ట్వీట్

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్‌‌ను జయించారు. తనకు వైరస్ తగ్గడంతో డిశ్చార్జ్ అయ్యానని తెలిపారు. గత నెల 21వ తేదీన తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన పీఏ కూడా చికిత్స తీసుకున్నారు. దాదాపు 12 రోజులు ట్రీట్ మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయినట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Recommended Video

భగవంతుడి దయ తోనే అంటూ.. Vijayasai Reddy ట్వీట్ || Oneindia Telugu

తెలంగాణలో కరోనా కల్లోలం: 2 వేల మార్క్ దాటిన కేసులు, 11 మంది మృత్యువాత..తెలంగాణలో కరోనా కల్లోలం: 2 వేల మార్క్ దాటిన కేసులు, 11 మంది మృత్యువాత..

భగవంతుడి దయతో..

ఆ భగవంతుడి దయతో కరోనాను జయించానని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. తాను కోలుకోవాలని శ్రేయోభిలాసులు కోరుకున్నారని.. వారి ప్రార్థనల బలంతోనే తనకు వైరస్ తగ్గిందని వివరించారు. తన కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతీ ఒక్కరు జయించాలని సాయిరెడ్డి నిండు మనస్సుతో కోరుకున్నారు.

 దూరం.. దూరంగా...

దూరం.. దూరంగా...

కరోనా వైరస్ సోకడంతో ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండనని విజయసాయిరెడ్డి ముందే చెప్పారు. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. అత్యవసరమైతే తప్ప తనను సంప్రదించొద్దని సూచించారు. 10 రోజులపాటు అందుబాటులో ఉండనని చెప్పడంతో... శ్రేణులు కూడా ఆయనకు దూరంగా ఉన్నారు. ఇటీవల అంబటి రాంబాబు కూడా కరోనా వైరస్ తగ్గడంతో డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

ఇలా సోకి ఉంటుంది..?

ఇలా సోకి ఉంటుంది..?

ఇటీవల వైఎస్ జయంతి కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళంలో జరిగిన సభకు చాలా మంది హాజరయ్యారు. విజయసాయిరెడ్డి వెంట మందీ మార్బలం ఉంటారని.. సామాజిక దూరం నిబంధన పట్టించుకోరనే అపవాదు ఉంది. దాంతో కరోనా వైరస్ సోకి ఉండొచ్చని అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో పలువురిని కలువడం ద్వారా వైరస్ సోకి ఉంటుంది. వెంటనే జూలై 21వ తేదీన ఆస్పత్రిలో చేర్చి.. ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత తొలి ట్వీట్ చేశారు.

English summary
ysrcp mp Vijayasai Reddy recovered from coronavirus. he discharged to apollo hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X