వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బాబు నిర్ణయం రాజకీయ డ్రామా', 'నాలుగేళ్ళుగా బూటకపు హమీలే'

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలని టిడిపి తీసుకొన్న నిర్ణయం ఓ డ్రామా అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంపై తాము అవిశ్వాసాన్ని పెడతామని ఆయన ప్రకటించారు. ఎన్నికలు ఏడాదిలో వచ్చే అవకాశం ఉన్నందున రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు టిడిపి కేంద్రంలోని మంత్రులను రాజీనామా చేయించిందన్నారు.

గొంతెమ్మ కోర్కెలు కావు, అవమానించారు:బాబు, మోడీకి ఫోన్గొంతెమ్మ కోర్కెలు కావు, అవమానించారు:బాబు, మోడీకి ఫోన్

కేంద్రం నుండి వైదొలగాలని టిడిపి నిర్ణయం తీసుకొన్నట్టు ప్రకటించిన తర్వాత న్యూఢిల్లీలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయమై టిడిపికి చిత్తశుద్ది లేదని సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు.

కేంద్రంతో టిడిపి కటీఫ్, ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామాకేంద్రంతో టిడిపి కటీఫ్, ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామా

కేంద్రం నుండి వైదొలగాలని చంద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్వాగతించారు. ఇప్పటికైనా చంద్రబాబునాయుడు మంచి నిర్ణయం తీసుకొన్నారని నారాయణ చెప్పారు.

టిడిపి నిర్ణయం డ్రామా

టిడిపి నిర్ణయం డ్రామా

కేంద్ర కేబినెట్ నుండి బయటకు రావాలని టిడిపి తీసుకొన్న నిర్ణయం రాజకీయ డ్రామాగా వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ళపాటు రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబునాయుడు తాకట్టు పెట్టారని వైసీపీ నేత విమర్శించారు.ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకే రెండు పార్టీలు కొత్త డ్రామాకు తెరతీశాయని సుబ్బారెడ్డి ఆరోపించారు.

ఎన్డీఏలో కొనసాగడం ద్వంద్వ ప్రమాణాలు

ఎన్డీఏలో కొనసాగడం ద్వంద్వ ప్రమాణాలు


కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుంటామన్న చంద్రబాబు.. ఎన్డీయేలో కొనసాగుతామనడం టిడిపి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బరెడ్డి అన్నారు. అధికార కూటమిలో‌‌ కొనసాగడం వెనుక ఉన్న అర్ధమేంటో చంద్రబాబే చెప్పాలన్నారు.

బాబు నిర్ణయాన్ని స్వాగతించిన నారాయణ

బాబు నిర్ణయాన్ని స్వాగతించిన నారాయణ

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రం నుండి టిడిపి మంత్రులు వైదొలగాలని తీసుకొన్న నిర్ణయంపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్వాగతించారు.ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. బీజేపీ చేస్తున్న మోసాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు. నాలుగేళ్లుగా ఏపీకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా కేంద్రం మొండిచేయి చూపిందని, దీనికి బీజేపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నారాయణ హెచ్చరించారు.

బూటకపు హమీలను నమ్మాం

బూటకపు హమీలను నమ్మాం

నాలుగేళ్ళుగా కేంద్రం ఇస్తోన్న బూటకపు హమీలను నమ్ముతూ వచ్చామని ఏపీ మంత్రి లోకేష్ బిజెపిపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా బుధవారం రాత్రి నారాలోకేష్ స్పందించారు.ఇక వేచి చూసే కాలం చాలు అంటూ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్నారని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తామని మంత్రి లోకేశ్ తెగేసిచెప్పారు.

English summary
Ysrcp MP Ys Subba Reddy responded on Chandrababu naidu decision to quit from union cabinet on Wednesday night at Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X