వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాల ఆమోదం?: లోకసభ స్పీకర్‌ను కలవనున్న జగన్ పార్టీ ఎంపీలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ రాజీనామాల ఆమోదం విషయంపై మంగళవారం సాయంత్రం లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలవనున్నారు. వెంటనే తమ రాజీనామాలను ఆమోదించాలని వారు కోరనున్నారు.

Recommended Video

రాజీనామాలు : వైసీపీ ఎంపీలకు స్పీకర్ లేఖ!

ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నివాసంలో సమావేశమవుతారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6నే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.

YSRCP MPs To Meet Lok Sabha Speaker Over Resignation Issue

ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరతామని చెప్పారు. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడానికి చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. ఉపఎన్నికలంటేనే బాబు జంకుతున్నారని ఎద్దేవా చేశారు.

ఓటుకు నోటు కేసు, ఆర్థిక అవకతవకల కేసులతో చంద్రబాబుకు వణుకుపుడుతోందని మేకపాటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతోనైనా.. లేదంటే మరోసారి ప్రధాని మోడీతో జత కట్టడానికైనా చంద్రబాబు వెనుకాడరని మండిపడ్డారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.

English summary
YSRCP MPs on Tuesday will meet Lok Sabha Speaker Over Resignation Issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X