వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు సిద్ధం: జగన్‌తో వైసీపీ ఎంపీలు, 'భవిష్యత్తు ఉండదు'

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామాకు సిద్ధమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆదివారం నాడు వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామాకు సిద్ధమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆదివారం నాడు పార్టీ అధ్యక్షులు జగన్‌కు చెప్పారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఏపీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిరంజీవిని చూపించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరికచిరంజీవిని చూపించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతామన్నారు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ సహా అన్ని అంశాలపై నిలదీస్తామన్నారు. హోదా అంశంపై టీడీపీ ఎంపీలు కలిసి రావాలన్నారు.

 YSRCP MPs ready to resign for Special Status issue

ఆదివారం నాడు వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏం చేసేందుకైనా తాము సిద్ధమన్నారు. అవసరమైతే రాజీనామాలు చేస్తామన్నారు.

విభజనతో ఏపీకి నష్టం జరిగింది: మేకపాటి

విభజనతో ఏపీ అన్ని విధాల నష్టపోయిందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఎంపీల భేటీ అనంతరం ఆయన మీడియాతో మేకపాటి మాట్లాడారు. మిగిలిన రాష్ట్రాలతోపాటు సమానంగా అభివృద్ధి చేయాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.

పవన్ కళ్యాణ్! ఇప్పుడు చెప్పు, సారీ చెప్తున్నా, ఇదీ నా కంపెనీ!: సుజనపవన్ కళ్యాణ్! ఇప్పుడు చెప్పు, సారీ చెప్తున్నా, ఇదీ నా కంపెనీ!: సుజన

అప్పుడే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన టిడిపి, బీజేపీలు.. ఇప్పుడు దానిని తుంగలో తొక్కాయన్నారు. హోదాకు, ఫ్యాకేజీకి ఏమీ తేడా లేదని సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు.

గళం విప్పండి: వైయస్ జగన్

ఏపీకి హోదాయే సంజీవిని అని, లేదంటే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని వైసిపి అధినేత జగన్ ఎంపీలతో చెప్పారు. హోదా కోసం పార్లమెంటులో గళమెత్తాలని సూచించారు. ప్యాకేజీ పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ విషయం ప్రజల దృష్టికి మరింత తీసుకెళ్లాలన్నారు.

English summary
YSR Congress Party MPs said that they are ready to resign for Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X